For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజు రోజుకి పతనం అవుతున్న రూపాయి.. కానీ వారు మాత్రం హ్యాపీ

By Sabari
|

రోజురోజుకీ రూపాయి విలువ అంతకంతకూ పడిపోతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి, ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో భారతీయులంతా ఆందోళన చెందుతున్నారు. డాలర్ విలువ పెరిగిపోవడంతో పెట్రోల్ ధర కూడా పైపైకి పోతూ, వాహనదారులకు చుక్కులు చూపిస్తోంది. ఎక్స్‌ఛేంజ్ రేట్ పడిపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మనదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువులకు ధర కూడా పడిపోయింది. రూపాయి విలువ పడిపోవడంపూ దేశమంతా ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రవాసీయులు మాత్రం ఫుల్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

 రోజు రోజుకి పతనం అవుతున్న రూపాయి.. కానీ వారు మాత్రం హ్యాపీ

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 71.95 పైసలకి పడిపోయింది. ఇది రికార్డ్ స్థాయి పతనం. అయితే ఈ పరిణామంతో ప్రవాస భారతీయులు అందుకునే జీతంలో మార్పు లేకపోయినా, వారి ముఖాల్లో మాత్రం సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. కారణం మనీ ఎక్స్‌ఛేంజ్‌లో డాలర్లకి బదులుగా ఇచ్చే భారత కరెన్సీ ఎక్కువగా వస్తుండడమే. ఇంతకుముందు 100 డాలర్లు మార్చుకుంటే 6500 నుంచి 6700 మధ్య భారతీయ రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు అది 7100 దాకా ఉంటోంది. దాంతో ఈ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు పంపేందుకు వీలు కలుగుతోంది. డాలర్ పతనంతో కొద్దో గొప్పో సంపాదిస్తున్న వారు కూడా సంతోషంగా ఆ మొత్తాన్ని స్వదేశానికి పంపించడానికి క్యూ కడుతున్నారు. దీంతో విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న మనీ ఎక్స్‌ఛేంజ్‌లు కిటకిటలాడుతున్నాయి.

దుబాయి, కువైట్, మస్కట్, దమ్మాం ప్రాంతాల్లోని మనీ ఎక్స్‌ఛేంజ్ ఆఫీసులన్నీ ప్రవాస భారతీయులతో నిండిపోతున్నాయి. మరికొందరైతే రూపాయి మరింత బలహీనపడితే ఇంకా ఎక్కువ డబ్బు స్వదేశానికి పంపించవచ్చనే ఆలోచనల్లో ఉన్నారుట

Read more about: rupee
English summary

రోజు రోజుకి పతనం అవుతున్న రూపాయి.. కానీ వారు మాత్రం హ్యాపీ | Indian Rupee Inches Towards 72

Rupee falls to the end of the day. All Indians worry about rising inflation and damping costs
Story first published: Thursday, September 6, 2018, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X