For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎవరైతే మాకేంటి మేము అనుకున్నది జరగాలంతే. : ముకేశ్ అంబానీ

By Sabari
|

వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పంచభక్ష పరమాన్నాలు అందుతాయన్నది నానుడి. కేంద్రంలో ఏ సర్కారొచ్చినా అంబానీ సోదరులకు అడ్డేలేదన్నట్టుగా పనులు చకచకా జరిగిపోతున్నాయి.

జియో వర్సిటీ

జియో వర్సిటీ

ఇపుడు జియో వర్సిటీ విషయంలో గుజరాతీయులైన మోడీ, ముకేశ్‌ అంబానీ దోస్తానా బాగా కలిసివచ్చినట్టుంది. పునాదులేపడని జియో యూనివర్సిటీకి శ్రేష్ట విద్యాలయం(ఐవోఈ) గుర్తింపు ఇవ్వటానికి పీఎంవోనే జోక్యం చేసుకోవటం వివాదస్పదమవుతున్నది.

 రిలయన్స్‌కు

రిలయన్స్‌కు

ఇంకా ఉనికిలోనే లేని రిలయన్స్‌కు చెందిన జియో విద్యా సంస్థకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఐఓఈ) హోదా కల్పించేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) శాయ శక్తులా శ్రమించింది. హెచ్‌ఆర్డీ(మానవ వనరుల అభివృద్ధి శాఖ) నుంచి పీఎంఓ దాకా జియో వర్సిటీకి ఐఓఈ ట్యాగ్‌ అందజేసేందుకు ఆ సంస్థకు అను కూలంగా ముందస్తుగానే విధానాలను రూపొందించాయి.

భారత వర్సిటీలు

భారత వర్సిటీలు

భవిష్యత్‌ ప్రణాళిల ఆధారంగా ఇంకా ఉనికిలోనే లేని ఓ ప్రయివేటు విద్యా సంస్థకు ఐఓటీ హోదా ఇవ్వడం నిర్హేతుకమైందని, ఇది ఉన్నత విద్యా వాతావరణాన్నే చెడగొడుతుందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ సూచించినా ఖాతరు చేయలేదు. ప్రపంచంలో టాప్‌ 100 ర్యాంకింగ్‌లో భారత వర్సిటీలు నిలవాలంటే ఏర్పాటే కానీ వర్సిటీల కంటే ప్రస్తుతం ఉన్న విద్యా సంస్థలపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఏర్పాటు చేసిన విద్యాసంస్థలు ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించలేవని ఉన్నత విద్యా విభాగం వివరించినా పరిగణనలోకి తీసుకోలేదు.

హోదా

హోదా

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఓఈ కోసం రిలయన్స్‌ గ్రూప్‌ ఎంపవర్డ్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ(ఈఈసీ) ముందు ప్రదర్శన ఇచ్చిన బృందంలో ఉన్న ఐఏఎస్‌ క్యాడర్‌ సీనియర్‌ అధికారి వినరుశీల్‌ ఒబేరారు అప్పుడు హెచ్‌ఆర్డీ సెక్రెటరీగా ఉన్నారు. దీంతో రిలయన్స్‌ స్పాన్సర్‌ చేస్తున్న జియో ఇన్‌స్టిట్యూట్‌కు ఐఓటీ హోదా ఇవ్వడంపై మరోసారి దుమారం రేగింది.

 గ్రీన్‌ఫీల్డ్‌ విభాగంలో

గ్రీన్‌ఫీల్డ్‌ విభాగంలో

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ స్కీంలో గ్రీన్‌ఫీల్డ్‌, బ్రౌన్‌ ఫీల్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌లనే రెండు విభాగాలున్నాయి. విద్యారంగంలో చాలా ఏళ్ల్లుగా సేవలందిస్తున్న సంస్థలు బ్రౌన్‌ ఫీల్డ్‌ విభాగంలోకి రాగా, టాప్‌ 100 ర్యాంక్‌లో నిలిచే విధంగా ప్రపంచ శ్రేణి విద్యాసంస్థలను వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసేవి గ్రీన్‌ఫీల్డ్‌ విభాగంలోకి వస్తాయి. కాగా, గ్రీన్‌ఫీల్డ్‌ విభాగంలో కేంద్రం ఎంపిక చేసిన ఏకైక సంస్థ జియో వర్సిటీనే కావడం విశేషం.

మిగతా ప్రయివేటు వర్సిటీల

మిగతా ప్రయివేటు వర్సిటీల

అందువల్లే మిగతా ప్రయివేటు వర్సిటీల ప్రతిపాదనలు కాదని జియో వర్సిటీ ముందుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఆర్థిక, హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖలు సూచించిన కఠిన నిబంధనలనూ పీఎంఓ జోక్యంతో నీరుగార్చేందుకు ఒబేరా రు అంగీకరించారని ఆ రిపోర్ట్‌ పేర్కొంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్డీ శాఖల బలమైన అభ్యంతరాలను తోసిపుచ్చడం పీఎంఓ జోక్యం ఏ మేరకు ఉన్నదో తేటతెల్లం చేస్తుంది.

 పీఎంఓ

పీఎంఓ

కాగా, 23 ఫిబ్రవరి 2017 తేదీన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ రాసిన లేఖలో ఉనికిలోనే లేని ఓ ప్రయివేటు ఇన్‌స్టిట్యూషన్‌కు ఐఓటీ హోదా కల్పించడం నిర్హేతుకమైనదని, ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నది. ఉద్దేశాలు, లక్ష్యాల ఆధారంగా ఈ హోదా కల్పించినట్టు తెలిపింది.జియో ఇన్‌స్టిట్యూషన్‌ లాంటి గ్రీన్‌ఫీల్డ్‌ సంస్థలు తప్పక పాటించాలంటూ హెచ్‌ఆర్డీ శాఖ రూపొందించిన కఠిన నిబంధనలను పీఎంఓ తోసిపుచ్చింది.

 కలిసివచ్చే అంశంగా

కలిసివచ్చే అంశంగా

గ్రీన్‌ఫీల్డ్‌ ఇన్‌స్టిట్యూషన్లను స్పాన్సర్‌ చేసే సంస్థ సభ్యులు ఇది వరకు వర్సిటీల ఏర్పాటులో అనుభవం కలిగి ఉండాలనే హెచ్‌ఆర్డీ నిబంధనను పీఎంవో తొలగించింది. ఇది రిలయన్స్‌కు కలిసివచ్చే అంశంగా మారింది. అలాగే ప్రయివేటు ఐఓఈల్లో ఆర్థికపరమైన అవకతవకలేమైనా చోటు చేసుకుంటే కాగ్‌ ఆడిట్‌ చేసే అవకాశం కల్పించిన నిబంధననూ పీఎంఓ తొల గించింది.

ఈ స్థాయిలో

ఈ స్థాయిలో

అంతే కాకుండా వాటి పట్ల పీఎంఓ మరింత ఉదారత చూపుతూ ఏడాదికోసారి ప్రయి వేటు ఐఓటీల పనితీరు, లక్ష్యాలు, ప్రణాళికల అమలును సవిూక్షించడం, ఒకవేళ లక్ష్యాలను నిర్లక్ష్యం చేసినట్టయితే పెనాల్టీ విధించే నిబంధననూ తొలగించింది.పీఎంఓ ఈ స్థాయిలో జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారాలన్నింటికీ పీఎంఓ కేంద్రస్థానంగా మారుతోందని విమర్శిస్తున్నారు.

విద్యార్థి సంఘం

విద్యార్థి సంఘం

జియో వర్సిటీకి ఐఓఈ హోదానివ్వడం ప్రస్తుతం ఉనికిలో ఉన్న విద్యాసంస్థలను నిరుత్సాహపరచడమేనని విద్యార్థి సంఘం నాయకులంటున్నారు. జియో ఇన్‌స్టిట్యూట్‌కు ఒబేరారు ఎడ్యుకేషన్‌ అడ్వయిజర్‌గా నియామకం కావడంతో ఈ అంశాలన్నీ ముందే నిర్ణయించబడ్డాయని తెలుస్తోందన్నారు.

Read more about: jio
English summary

ఎవరైతే మాకేంటి మేము అనుకున్నది జరగాలంతే. : ముకేశ్ అంబానీ | Central Government Helping to Jio Institute

The tasks have been done in the center of the corps of the Ambani brothers in the center.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X