For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విప్రో ఫుల్ జోష్.. ఇక విప్రో ఉద్యోగులకి పండగే! భారీ డీల్ సొంతం.

By Sabari
|

సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజ సంస్థ విప్రో అమెరికన్‌ కంపెనీనుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. 1.6 బిలియన్ల డాలర్ల కాంట్రాక్టును స్వాధీనం చేసుకుంది.

ఇది భారీ డీల్ అని ఐటీ వ‌ర్గాలు అంటున్నాయి.దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన‌ విప్రో అమెరికన్‌ కంపెనీ నుంచి చాలా పెద్ద ఆర్డర్‌ను దక్కించుకుంది. 1.6 బిలియన్ల డాలర్ల కాంట్రాక్టును స్వాధీనం చేసుకుంది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం. అంతే కాకుండా ఐటీ ప‌రిశ్ర‌మ‌లో భారీ రికార్డు. అలైట్ సొల్యూషన్స్‌ నుంచి 1.6 బిలియన్ డాలర్ల విలువైన 10 సంవత్సరాలకు అవుట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టును గెలుచుకుంది. దీంతో స్టాక్‌మార్కెట్లో విప్రో స్టాక్‌కు డిమాండ్ ఏర్ప‌డింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో విప్రో షేరు సోమవారం దాదాపు 5శాతం పైకి ఎగ‌సి మ‌ధ్యాహ్నం ట్రేడింగ్ స‌మ‌యానికి 3% పైనే లాభాల్లో కొన‌సాగుతోంది.

విప్రో ఫుల్ జోష్.. ఇక విప్రో ఉద్యోగులకి పండగే! భారీ డీల్ సొంతం.

సమీకృత సొల్యూషన్లు, సర్వీసులు అందించేందుకు ఇల్లినాయిస్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లింకన్‌షైర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐటీ సేవల దేశీ సంస్థ విప్రో లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం. ఆగ‌స్టు 31 నాటికి అలైట్ కంపెనీ ప్రాజెక్టు ప‌నికి సంబంధించిన ఒప్పందం పూర్త‌యిన‌ట్లు విప్రో తెలిపింది. అలైట్‌ సొల్యూషన్స్‌ నుంచి లభించిన కాంట్రాక్టు పదేళ్లకాలం పాటు కొనసాగనున్నట్లు తెలియజేసింది. ఒప్పంద కాలంలో 150-160 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరనున్నట్లు విప్రో వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా డిజిటల్‌ టెక్నాలజీస్‌, ఆటోమేషన్, అనలిటిక్స్‌ సంబంధ సేవలను అందించనున్నట్లు వెల్లడించింది. అలైట్‌ సొల్యూషన్స్ కస్టమర్లకు టెక్నాలజీ ఆధారిత హెల్త్‌, వెల్త్, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌ సొల్యూషన్స్ అందిస్తుంటుంది.

విప్రో ప్రత్యర్థి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) డిసెంబర్ 2017 ఆదాయం కంటే $ 5.6 బిలియన్ కంటే ఎక్కువ విలువైన మూడు పెద్ద బహుళ-సంవత్సరాల కాంట్రాక్టులను పొందింది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధి.

Read more about: business
English summary

విప్రో ఫుల్ జోష్.. ఇక విప్రో ఉద్యోగులకి పండగే! భారీ డీల్ సొంతం. | Wipro Got Big Deal With US Company

oftware company Wipro has received a huge order from the American company. 1.6 billion dollars contract.
Story first published: Monday, September 3, 2018, 16:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X