For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రైలు ఎక్కడ ఉందో మీ వాట్సాప్ చెప్పేస్తుంది! ఎలాగో తెలుసా?

By Sabari
|

రైల్లో ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకున్నారా? మీరు ఎక్కాల్సిన రైలు సమయానికి స్టేషన్‌కు వస్తుందో లేదో అన్న అనుమానం ఉందా? ఏం పర్లేదు. జస్ట్ వాట్సప్‌లో ఓ మెసేజ్ పంపి ఆ రైలు ఎక్కడుందో ఎంత ఆలస్యంగా ప్రయాణిస్తుందో తెలుసుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు అందిస్తున్న కొత్త సర్వీస్ ఇది. ఇండియన్ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్‌మైట్రిప్‌తో కలిసి ప్రయాణికులకు ఈ సేవల్ని అందిస్తుంది. వాట్సప్‌లో ట్రెయిన్‌కు సంబంధించిన వివరాలు, సమయం, స్టేషన్స్ లాంటివన్నీ తెలుసుకోవచ్చు.

మీ రైలు ఎక్కడ ఉందో మీ వాట్సాప్ చెప్పేస్తుంది! ఎలాగో తెలుసా?

మీరు ఏదైనా ఓ రైలు లేటెస్ట్ స్టేటస్ వాట్సప్‌లో తెలుసుకోవాలంటే ముందుగా మీ ఫోన్‌లో 7349389104 (మేక్‌మైట్రిప్) నెంబర్ సేవ్ చేసుకోవాలి.
మీకు ఏ రైలు అప్‌డేట్ కావాలనుకుంటే ట్రెయిన్ నెంబర్‌ను వాట్సప్‌లో 7349389104 నెంబర్‌కు మెసేజ్ చేయాలి. మీ వాట్సప్‌లో బ్లూటిక్స్ వస్తేనే మీ ట్రెయిన్ నెంబర్‌ సర్వర్‌ వరకు వెళ్లినట్టు. ఆ తర్వాతే మీకు కావాల్సిన వివరాలొస్తాయి.

మీకు లాభమేంటీ?

  • స్మార్ట్‌ఫోన్‌లోనే అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు.
  • వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు.
  • ఎంక్వైరీ నెంబర్ 139కి కాల్ చేసి అడగాల్సిన అవసరం కూడా లేదు.
  • ఒక్క క్లిక్‌లో రైలు రాకపోకలు, సమయం తెలుస్తుంది.
  • మీ సమయం వృథా కాకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.

Read more about: whatsapp
English summary

మీ రైలు ఎక్కడ ఉందో మీ వాట్సాప్ చెప్పేస్తుంది! ఎలాగో తెలుసా? | Indian Railway Provides Train Status in whatsapp

Have a reservation on train in train? Do you have any doubt whether the train arrives at the station? What happened. Just send a message to Watsup and see how long the train is traveling. This is the new service offered to Indian Railways passengers. The Indian Online Travel Company will provide travelers with travelers with Memmittrip. In Watts, you can find the details of the train, time and station.
Story first published: Saturday, September 1, 2018, 17:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X