For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఏటీఎంలో డబ్బులు రాకపోతే ఏమి చేస్తారు? ఒకవేళ తెలియకపోతే ఇలా చేయండి!

By Sabari
|

మీరు ఏటీఎంకు వెళ్తే ప్రతీసారి అందులోంచి డబ్బులు రావు. మెషీన్‌లో డబ్బులు ఉన్నాసరే ఒక్కోసారి ట్రాన్సాక్షన్ డిక్లైన్ అవుతుంది. మెషీన్‌లోంచి డబ్బులు రాకపోయినా కొన్ని సందర్భాల్లో అకౌంట్‌లో డబ్బులు తగ్గుతుంటాయి. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో చాలామందికి అర్థం కాదు. మీకూ అలాంటి అనుభవమే ఎదురైతే ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి.

కస్టమర్ కేర్‌

కస్టమర్ కేర్‌

మొదట బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి. మీ సమస్య చెప్పండి. అయినా మీ సమస్య పరిష్కారం కాకపోతే దగ్గర్లోని బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లండి. అక్కడి సిబ్బందికి కంప్లైంట్ ఇవ్వండి.

 బ్రాంచ్ మేనేజర్‌ని

బ్రాంచ్ మేనేజర్‌ని

బ్యాంకు సిబ్బందిని కలిసినా ఫలితం లేకపోతే బ్రాంచ్ మేనేజర్‌ని కలవండి. బ్యాంకు మేనేజర్ కూడా సమస్య పరిష్కరించకపోతే గ్రీవెన్స్ సెల్‌లో కంప్లైంట్ ఇవ్వండి. ఈ సెల్‌లో చేసే ఫిర్యాదులన్నీ జనరల్ మేనేజర్ స్థాయి అధికారి దగ్గరకు వెళ్తాయి. మీరు నేరుగా బ్యాంకు వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు పోస్ట్ చేయొచ్చు. వాటిని సంబంధిత శాఖలు పరిష్కరిస్తాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మీరు ఇన్ని ప్రయత్నాలు చేసినా మీ సమస్య పరిష్కారం కాకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించిన ఉన్నతాధికారి కస్టమర్ల కంప్లైంట్లను స్వీకరించి పరిష్కరిస్తారు. కమర్షియల్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, సహకార బ్యాంకులన్నీ అంబుడ్స్‌మన్ పరిధిలోకి వస్తాయి. ప్రతీ రాష్ట్ర రాజధానిలో ఈ ఆఫీస్ ఉంటుంది. అడ్రస్ వివరాలు ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉంటాయి.

వెబ్‌సైట్‌

వెబ్‌సైట్‌

చివరకు అంబుడ్స్‌మన్ అధికారికి ఫిర్యాదు చేసినా మీ సమస్య పరిష్కారం కాకపోతే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ http://ncdrc.nic.in/ వెబ్‌సైట్‌ని ఆశ్రయించండి. ఇక్కడ మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది.

 కోర్టు

కోర్టు

మీరు ఇన్నిరకాలుగా ప్రయత్నించినా అకౌంట్‌లో తగ్గిన డబ్బులు జమ కాకపోతే కోర్టును కూడా ఆశ్రయించొచ్చు. సంబంధిత బ్యాంకుపై జిల్లా కోర్టులో కేసు వేయొచ్చు. భారత పౌరులకు ఆ హక్కు ఉంది. మీ డబ్బులు పొందడమే కాదు న్యాయం కోసం మీరు ఖర్చుపెట్టిన ప్రతీ రూపాయిని తిరిగి పొందొచ్చు.

బ్యాంకుల దగ్గర

బ్యాంకుల దగ్గర

అయితే మీకు బ్యాంకుల దగ్గర ఈ సమస్యలు పరిష్కారమవుతాయి. మరీ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే రాదు. అకౌంట్‌లో తగ్గిన మీ డబ్బులు ఖచ్చితంగా తిరిగివస్తాయి. కాకపోతే కొన్నిరోజుల సమయం పడుతుంది

Read more about: atm
English summary

మీరు ఏటీఎంలో డబ్బులు రాకపోతే ఏమి చేస్తారు? ఒకవేళ తెలియకపోతే ఇలా చేయండి! | Facts to Know to Withdraw Money in ATM

Every time you go to ATM, you will not get money. Transaction decline will always be a matter of money on the machine. In some cases the money will be reduced in the account, even if the machine does not get money. Most people do not understand what to do in this case. If you experience such an experience, follow these steps
Story first published: Saturday, September 1, 2018, 12:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X