For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంత పెద్ద పెద్ద చదువులు చదివిన ఏమి లాభం బ్రదర్!

By Sabari
|

ఉత్తరప్రదేశ్‌లోని పోలీసు శాఖ ఇటీవల మెసెంజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసింది. మెసెంజర్ అంటే టెలికామ్ వింగ్ నుంచి వచ్చే సమాచారాన్ని ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకు చేరవేసే చిన్న ఉద్యోగం అది.

అర్హత

అర్హత

12 సంవత్సరాల తర్వాత 62 ఖాళీలతో నోటిఫికేషన్ వేసింది ప్రభుత్వం. అర్హత ఐదో తరగతే అయినా ఏకంగా 50,000 మంది గ్రాడ్యుయేట్లు, 28,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, వారితో పాటు 3700 మంది పీహెచ్‌డీ హోల్డర్లు ఈ చిన్న ఉద్యోగానికి దరఖాస్తు చేశారు.

నిరుద్యోగ సమస్య

నిరుద్యోగ సమస్య

అంతేకాదు ఎంబీఏ, బీటెక్ పూర్తి చేసినవాళ్లు సైతం అప్లై చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు అద్దం పడుతోంది ఈ పరిస్థితి. మొత్తం 93,500 దరఖాస్తులు వస్తే అందులో 5-12 తరగతి చదివిన వారి అప్లికేషన్లు కేవలం 7,400 మాత్రమే ఉన్నాయి.

వాస్తవానికి

వాస్తవానికి

వాస్తవానికి సైకిల్ తొక్కడం వచ్చి ఐదో తరగతి పూర్తి చేసినవారికి నేరుగా ఉద్యోగం ఇచ్చేస్తారు. కానీ 62 పోస్టులకు ఏకంగా 93,500 మంది దరఖాస్తు చేయడంతో సెలక్షన్ టెస్ట్ పెట్టాలని పోలీసు శాఖ భావిస్తోంది.

పోలీసు బాసులు

పోలీసు బాసులు

లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, బేసిక్ మ్యాథ్స్‌తో రాతపరీక్ష నిర్వహిస్తామంటున్నారు అధికారులు. క్వాలిఫికేషన్ ఎక్కువగా ఉన్నవారు దరఖాస్తు చేయడం వల్ల డిపార్ట్‌మెంట్‌ పనితీరులో నాణ్యత పెరుగుతుందని అక్కడి పోలీసు బాసులు చెబుతున్నారు

చిన్న పోస్టే

చిన్న పోస్టే

చెప్పుకోవడానికి చిన్న పోస్టే అయినా ప్రభుత్వ ఉద్యోగం కావడం, నెలకు రూ.20,000 వేతనం ఇస్తుండటంతో ఈ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఏదేమైనా క్లర్కు పోస్టు కన్నా చిన్న ఉద్యోగానికి బీటెక్, ఎంబీఏ, పీజీ, పీహెచ్‌డీ చదివినవాళ్లు దరఖాస్తు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Read more about: jobs
English summary

ఇంత పెద్ద పెద్ద చదువులు చదివిన ఏమి లాభం బ్రదర్! | 3700 Phd Holders Applied for Small Jobs

The Uttar Pradesh police department recently issued a notification to the messenger jobs. Messenger is a small job that can send information from the telecom wing to an office.
Story first published: Friday, August 31, 2018, 8:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X