For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లక్షల్లో పోస్ట్ ఆఫీసులు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తో అనుసంధానం.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సెప్టెంబర్ 1 న దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది.డిసెంబరు 31, 2018 నాటికి దేశవ్యాప్తంగా 1.55 లక్షల పోస్టాఫీసులు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి)తో అనుసంధానం.

|

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సెప్టెంబర్ 1 న దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది.డిసెంబరు 31, 2018 నాటికి దేశవ్యాప్తంగా 1.55 లక్షల పోస్టాఫీసులు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) వ్యవస్థతో అనుసంధానించబడుతుందని కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు.

ప్రారంభించే రోజుకి:

ప్రారంభించే రోజుకి:

ప్రారంభించే రోజుకి,ఐపిపిబి దేశవ్యాప్తంగా 650 శాఖలు మరియు 3,250 యాక్సెస్ పాయింట్లు కలిగి ఉంటుంది అని మంత్రి IANS విలేఖరులతో చెప్పారు. 2018 చివరి నాటికి యాక్సెస్ పాయింట్ల సంఖ్య 1.55 లక్షలకు చేరుకుంటుంది, అందులో 1.30 లక్షల శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయని సిన్హా తెలిపారు.

ఐపిపిబి సేవలను:

ఐపిపిబి సేవలను:

అంతేకాకుండా, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాలను లింక్ చేయడం ద్వారా ఐపిపిబి సేవలను పొందగలుగుతారు అని ఆయన చెప్పారు. చెల్లింపుల బ్యాంకు ఖాతాదారులకు QR కార్డు అందించబడుతుంది, మరియు కార్డు ద్వారా వారి లావాదేవీలను ఆథరైజ్ చేయవచ్చు, అని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రివర్గం:

కేంద్ర మంత్రివర్గం:

ఇంతలో, కేంద్ర మంత్రివర్గం బుధవారం 800 కోట్ల రూపాయల నుండి 1,435 కోట్ల రూపాయల వరకు చెల్లింపుల బ్యాంకును ఏర్పాటు చేయటానికి ప్రాజెక్టు వ్యయాలను పునర్విచారణకు ఆమోదించింది.

మంత్రి మాట్లాడుతూ:

మంత్రి మాట్లాడుతూ:

కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, మనీ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ బెనిఫిట్ బదిలీ, ఎంటర్ప్రైజ్, వ్యాపారి చెల్లింపుల వంటి సేవలను బ్యాంక్ అందించనుందని మంత్రి తెలిపారు. కౌంటర్ సర్వీసులు, మైక్రో ఎటిఎమ్, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, SMS మరియు IVR (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

వినియోగదారులు:

వినియోగదారులు:

పోస్ట్ ఆఫీస్ వినియోగదారులు ముందుగా ఇండియా పోస్ట్ పెమెంట్స్ బ్యాంకు కాథా ను తెరవాలన్నారు. ఇప్పటి వరకు మేము ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, పెటియం పేమెంట్స్ బ్యాంక్ మరియు ఇతర చెల్లింపు బ్యాంక్స్ కలిగి ఉన్నామన్నారు. ప్రభుత్వం చెల్లింపుల బ్యాంక్ సేవతో నేరుగా వస్తున్న నేపథ్యంలో, వినియోగదారులకు మంచి ప్రయోజనాలను పొందుతారని తెలిపారు.

English summary

లక్షల్లో పోస్ట్ ఆఫీసులు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తో అనుసంధానం. | 1.55 Lakh Post Offices Will Be Linked to India Post Payments Bank by December 31

The India Post Payments Bank launch is now scheduled to happen nationwide on September 1. Ahead of the formal launch, Communications Minister Manoj Sinha stated that all the 1.55 lakh post offices across the country would be linked to India Post Payments Bank (IPPB) system by December 31, 2018.
Story first published: Thursday, August 30, 2018, 13:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X