For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్నదమ్ములు ఇద్దరు టెలికాం సంస్థలకు చుక్కలు చూపిస్తున్నారు!

By Sabari
|

దేశంలోని మిగతా టెలికాం సంస్థలను టెన్షన్ పుట్టిస్తూ అంబానీ బ్రదర్స్‌ ఆడుతున్న క్రయవిక్రయాల క్రీడ కొనసాగుతూ వస్తోంది.

అనిల్‌ అంబానీ

అనిల్‌ అంబానీ

అప్పుల ఉబిలో కూరుకుపోయి నిధుల కోసం ఆస్తులను విక్రయిస్తున్నట్టుగా చెబుతున్న అనిల్‌ అంబానీ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు(ఆర్‌కామ్‌) చెందిన విలువైన టెలికాం ఆస్తులను ఒక్కొక్కటిగా ముఖేశ్‌ అంబానీకి చెందిన జియో సంస్థకు అప్పగిస్తూ వస్తున్నారు.

రిలయన్స్‌ జియోకు

రిలయన్స్‌ జియోకు

తాజాగా ఈ క్రయవిక్రయ క్రీడలో ఆర్‌కామ్‌ సంస్థ తమకు చెందిన దాదాపు 1,78,000 కిలోమీటర్ల ఫైబర్‌ లైన్‌తో పాటు ఫైబర్‌ కమ్యూనికేషన్స్‌కు చెందిన విలువైన ఆస్తులను రిలయన్స్‌ జియోకు అప్పగించినట్టుగా తెలిపింది.

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ

వీటి విక్రయం ద్వారా ఆర్‌కామ్‌కు దాదాపు రూ.3,000 కోట్ల నిధులు సమకూరాయి. విలువైన ఫైబర్‌ కమ్యూనికేషన్‌ ఆస్తులు, అవస్థాపనా సౌకర్యాలను ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియోకు విక్రయించినట్లు ఆర్‌కామ్‌ బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీకి అందించిన ఒక లేఖలో వెల్లడించింది

రూ.2000 కోట్ల

రూ.2000 కోట్ల

గతవారమే ఆర్‌కామ్‌ సంస్థ రిలయన్స్‌ జియోకు మీడియా కన్వెర్జెన్స్‌ నోడ్స్‌ (ఎంసీఎన్‌)ను విక్రయించిన సంగతి తెలిసిందే. అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ సంస్థ 248 నోడ్‌లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆస్తులు కలిపి దాదాపు మొత్తం రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియోకు అప్పగించిన సంగతి తెలిసిందే.

దశల వారీగా 20,000 కోట్ల ఆస్తులు

దశల వారీగా 20,000 కోట్ల ఆస్తులు

ప్రస్తుతం జరుపుతున్న అమ్మకాలకు తోడు త్వరలోనే దాదాపు రూ.20వేలకు పైగా కోట్ల విలువైన ఆస్తులను ఆర్‌కామ్‌ సంస్థ జియోకు అమ్మనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రిలయన్స్‌ జియోతో ఒప్పందం కుదర్చుకుంది

అప్పులు

అప్పులు

అప్పులు తగ్గించుకునేందుకు ఆర్‌కామ్‌ వైర్‌లెస్‌ స్పెక్ట్రమ్‌, టవర్‌, ఫైబర్‌ అండ్‌ ఎంసీఎన్‌ ఆస్తులను జియోకు అమ్మేసేందుకు అంగీకరించింది. 2017 డిసెంబరులోనే ఈ డీల్‌ ప్రకటించారు. 122.4 మెగా హెడ్జ్‌ 4జీ స్పెక్ట్రమ్‌, 43000 టవర్లు, 1,78,000 కిలోమీటర్ల ఫైబర్‌, 248 మీడియా కన్వర్జెన్స్‌ నోడ్స్‌తో పాటు మరికొన్ని ఆస్తులు ఈ అమ్మకపు డీల్‌లో భాగంగా ఉన్నట్టు సమాచారం.

Read more about: jio
English summary

అన్నదమ్ములు ఇద్దరు టెలికాం సంస్థలకు చుక్కలు చూపిస్తున్నారు! | Anil Ambani Handover RCOM to Mukesh Ambani

The game continues to be played by the Ambani brothers playing tens of other telecom companies in the country.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X