For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇతనే మరో నిరవ్ మోడీ మొత్తం రూ.5250 కోట్లు స్వాహా

By Sabari
|

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త అదానీ కుటుంబానికి ద‌గ్గ‌రి బంధువు అయిన గుజ‌రాత్ పారిశ్రామిక‌వేత్త జ‌తిన్ మెహ‌తా బ్యాంకుల నుంచి తీసుకున్న సొమ్ము విదేశాల‌కు త‌ర‌లించిన‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ‌లు గుర్తించాయి.

జ‌తిన్ మెహ‌తా

జ‌తిన్ మెహ‌తా

విన్‌స‌మ్ డైమండ్స్, ఫ‌ర్ ఎవ‌ర్ డైమెండ్స్ తోపాటు ప‌లు కంపెనీల పేరుతో బ్యాంకుల నుంచి జ‌తిన్ మెహ‌తా తీసుకున్న సొమ్ము ఇపుడు రూ. 9000 కోట్ల‌కు చేరింది. అంటే బ్యాంకుల నుంచి తీసుకున్న అస‌లు మొత్తం (దాదాపు రూ. 5000 కోట్ల‌కు పైనే) పూర్తిగా విదేశీ కంపెనీల ద్వారా తన సొంత కంపెనీల‌కు త‌ర‌లించిన‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ‌లు గుర్తించిన‌ట్లు ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ప‌త్రిక తెలిపింది

బోర్డు తిప్పేశాయ‌ని

బోర్డు తిప్పేశాయ‌ని

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌కు చెందిన ప‌లు కంపెనీల నుంచి త‌న‌కు న‌గ‌లు, డైమండ్స్ ఎగుమ‌తికి ఆర్డ‌ర్లు వ‌చ్చాయ‌ని మ‌న బ్యాంకుల నుంచి సుమారు రూ. 5000 కోట్ల‌కు పైగా రుణం తీసుకున్నారు. అయితే త‌మ నుంచి న‌గలు తీసుకున్న యూఏఈ కంపెనీలు భారీ న‌ష్టాలు వ‌చ్చి.. బోర్డు తిప్పేశాయ‌ని జ‌తిన్ మెహ‌తా చేతులు ఎత్తేశారు. చిత్రంగా ఆయ‌న దివాళ తీయ‌డానికి ముందు కంపెనీ డైరెక్ట‌ర్ల బోర్డు నుంచి త‌ప్పుకోవ‌డ‌మే గాక‌ భార‌త పౌర‌స‌త్వాన్ని కూడా వొదులుకున్నారు.

బ్యాంకుల సొమ్ము

బ్యాంకుల సొమ్ము

బ్యాంకుల నుంచి తీసుకున్న సొమ్ము యూఏఈ, హాంగ్‌కాంగ్‌, బ‌హ‌మాస్ తోపాటు మ‌రికొన్ని దేశాల‌కు త‌న డమ్మీ కంపెనీల నుంచి త‌ర‌లించిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది.దీని కోసం అనేక షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. బ్రిట‌న్‌లో వీటిని ఏర్పాటు చేశారు. బ్రామ్‌హాల్ అండ్ 0లాన్స‌డేల్, హారింగ్ట‌న్ అండ్ ఛార్లెస్ ట్రేడింగ్ కంపెనీ, వెల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, కార్టె అండ్ హ‌ర్ట్ టూల్స్ లిమిటెడ్‌, రోజ్ మౌంటెన్ ఎల్ఎల్‌పీ అనే కంపెనీ ల ద్వారా ఈ మొత్తం త‌ర‌లించారు

నీర‌వ్ మోడీ

నీర‌వ్ మోడీ

ఈ కంపెనీల ద్వారా సైప్ర‌స్‌లో జ‌తిన్ మెహ‌తాకు చెందిన డాక్‌ల్యాండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ కు త‌ర‌లించారు. చిత్ర‌మేమిటంటే కంపెనీ దివాళ తీసిన త‌ర‌వాత నిధుల‌ను త‌ర‌లించి 2016లో వీటిని ర‌ద్దు చేశారు. అయితే నిధుల ప్ర‌వాహం ప‌రిశీలించిన అధికారుల‌కు ఈ కంపెనీల‌కు నీర‌వ్ మోడీ కంపెనీల‌కు కూడా లింకు ఉన్న‌ట్లు గుర్తించాయి.

 సీబీఐకి ఫిర్యాదు

సీబీఐకి ఫిర్యాదు

20104లో సీబీఐకి ఫిర్యాదు అందినా ద‌ర్యాప్తు సంస్థ‌లు చాలా ఉదాసీనంగా వ్య‌వ‌హారించాయి. దీంతో ఆయ‌న భార‌త పౌర‌స‌త్వాన్ని వొదులుకోవ‌డ‌మేగాక సెయింట్ కీట్స్ అండ్ నెవిస్ దేశ పౌర‌స‌త్వం తీసుకున్నారు. ఆ దేశంతో మ‌న దేశానికి ఎలాంటి దౌత్య‌ప‌ర ఒప్పందాలు లేక‌పోవ‌డంతోద‌ర్యాప్తు సంస్థ‌లు ఏమీ చేయ‌లేని స్థితిలో ఉన్నాయి

గౌత‌మి అదాని

గౌత‌మి అదాని

అయితే జ‌తిన్ మెహ‌తా ఇంగ్లండ్‌లోనే ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అదానీ గ్రూప్ ఛైర్మ‌న్ గౌత‌మి అదాని సోద‌రుడు వినోద్ అదానిని కుమార్తెను జ‌తిన్ మెహ‌తా కుమారుడు సూర‌జ్ వివాహం చేసుకున్నాడు.

Read more about: bajaj
English summary

ఇతనే మరో నిరవ్ మోడీ మొత్తం రూ.5250 కోట్లు స్వాహా | Jatin Mehta Diverted Bank Loan to His Own Companies

Investigators found that the money taken from Gujarat industrialist Jatin Mehta, a close relative of the leading industrialist Adani family, moved to abroad.
Story first published: Friday, August 24, 2018, 10:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X