For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నావల్ల కావడం లేదు అన్న నువ్వే చూసుకో :అనిల్ అంబానీ

By Sabari
|

రిలయన్స్‌ జియో ఇన్ఫోకమ్‌కు రూ.2,000 కోట్ల ఆస్తులను విక్రయించినట్లు ఆర్‌కామ్‌ వెల్లడించింది. ప్రణాళిక ప్రకారం మీడియా కన్వెర్జెన్స్‌ నోడ్స్‌(ఎంసిఎన్‌)ను అమ్మేసినట్లు ఆర్‌కామ్‌ వెల్లడించింది.

రిలయన్స్‌ ఇండిస్టీస్‌

రిలయన్స్‌ ఇండిస్టీస్‌

దీంతో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తన తమ్ముడు రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ఆస్తులను ఇతరుల చేతుల్లోకి వెళ్లనీయకుండా తానే దక్కించుకున్నట్లయ్యింది. ఆర్‌కామ్‌ విక్రయించిన వాటిలో 248 నోడ్స్‌ దాదాపు 5 మిలియన్ల చదరపు అడుగుల ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. వీటిని టెలికాం మౌలిక వసతుల కోసం ఉపయోగిస్తున్నారు.

రూ.25000 కోట్ల

రూ.25000 కోట్ల

వీటిని టెలికాం మౌలిక వసతుల కోసం ఉపయోగిస్తున్నారు. వీటన్నింటినీ ప్రస్తుతం జియోకు బదిలీ చేసినట్లు ఆర్‌కామ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఒప్పందం పూర్తయినట్లు పేర్కొంది. తన రూ.25000 కోట్ల ఆస్తుల అమ్మకపు ప్రణాళిక ప్రక్రియ నడుస్తుందని ఈ నెల మొదట్లోనే ఆర్‌కామ్‌ వెల్లడించింది.

ఆర్‌కామ్‌

ఆర్‌కామ్‌

ఆర్‌కామ్‌ దాదాపు రూ.40వేల కోట్ల భారీ అప్పుల్లో కూరుకుపోవడంతో బ్యాంకులకు చెల్లింపులు చేయడానికి పలు ఆస్తులను విక్రయానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్‌కామ్‌ వైర్‌లెస్‌ స్పెక్ట్రమ్‌, టవర్‌, ఫైబర్‌ అండ్‌ ఎంసిఎన్‌ ఆస్తులను జియోకు అమ్మేందుకు అంగీకరించింది. 2017 డిసెంబరులోనే ఈ ఒప్పందాన్ని ప్రకటించారు.

ఈ డీల్‌లో

ఈ డీల్‌లో

122.4 మెగా హెడ్జ్‌ 4జిస్పెక్ట్రమ్‌, 43000కు పైగా టవర్లు, 1,78,000 కిలోమీటర్ల ఫైబర్‌, 248 మీడియా కన్వర్జెన్స్‌ నోడ్స్‌ ఈ అమ్మకపు డీల్‌లో ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.25వేల కోట్లుగా ఉంటుందని అంచనా. అతిపెద్ద ఈ డీల్‌లో ప్రణాళిక ప్రకారం నేడు నోడ్స్‌ అమ్మకం పూర్తయినట్టు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ప్రకటించింది.

రిలయన్స్‌ మార్కెట్‌ విలువ రికార్డు

రిలయన్స్‌ మార్కెట్‌ విలువ రికార్డు

దేశ స్టాక్‌ మార్కెట్లలో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ (రిల్‌) మార్కెట్‌ కాపిటల్‌ విలువ రికార్డు స్థాయికి చేరింది. గురువారం రిల్‌ మార్కెట్‌ విలువ రూ.8 లక్షల కోట్లకు పెరిగి అతిపెద్ద ఎకైక కంపెనీగా నిలిచింది. బిఎస్‌ఇ ఇంట్రా ట్రేడింగ్‌లో ఈ కంపెనీ సూచీ 1.72 శాలం లాభపడి ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1,268ని తాకింది. దీంతో కంపెనీ ఎం-క్యాప్‌ విలువ రూ.8,00,001.54 కోట్లుగా నమోదయ్యింది. తుదకు 1.86 శాతం లాభపడి రూ.1,269.70 వద్ద ముగిసింది. దీంతో ఆ కంపెనీ ఎం-క్యాప్‌ రూ.8.01 లక్షల కోట్లకు చేరింది. స్టాక్‌ మార్కెట్‌లో టిసిఎస్‌తో పోటాపోటీగా సాగే రిల్‌ షేర్‌ ఈ స్థాయిలో పెరగడం

ఇదే తొలిసారి

ఇదే తొలిసారి

టిసిఎస్‌ షేర్‌ విలువ 1.08 శాతం పెరిగి రూ.2,035.45 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.7.66 లక్షల కోట్లుగా నమోదయ్యింది. జులై 13న తొలిసారి రిల్‌ రూ.7 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను చేరింది. జులై 5న రిల్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఆ కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ 2025 నాటికి తమ కంపెనీ విలువను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం వ్యాపారారాలను విస్తరిస్తామన్నారు. ఈ ప్రకటన మదుపర్లలో విశ్వాసాన్ని నింపిందని బ్రోకర్లు పేర్కొంటున్నారు. గతేడాది కాలంలో రిలయన్స్‌ షేర్లు 60 శాతం పెరగ్గా, ఇదే సమయంలో టిసిఎస్‌ సూచీ 63 శాతం లాభపడింది.

Read more about: mukesh ambani
English summary

నావల్ల కావడం లేదు అన్న నువ్వే చూసుకో :అనిల్ అంబానీ | Anil Ambani Gave 2000 Crores to Mukesh ambani

RCOM revealed that Reliance Geo Infocomm had sold over Rs 2,000 crore in assets. According to the plan, Arcom revealed that Media Convergence nodes (MCN) were sold.
Story first published: Friday, August 24, 2018, 13:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X