For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక పై పాత వస్తులువు కూడా ఫ్లిప్ కార్ట్ లో దొరుకుతాయి! ఎలాగో తెలుసా?

By Sabari
|

సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనేందుకు ఇష్టపడే వారి కోసం ఫ్లిప్‌కార్ట్‌ కొత్త సౌలభ్యం తీసుకొచ్చింది. '2GUD' పేరిట కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. ఇందులో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌, ట్యాబెట్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉంటాయి. త్వరలో మరిన్ని కేటగిరీలను తీసుకొస్తామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి మీడియాకు తెలిపారు.

ప్రస్తుతం మొబైల్‌ వెబ్‌లోనే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, త్వరలో డెస్క్‌టాప్‌, మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని కృష్ణమూర్తి వెల్లడించారు. పాత వస్తువులు కొనాలి అనుకునే వారికోసం దీన్ని ప్రత్యేకంగా తీసుకొస్తున్నామని, కొత్త వస్తువుల కొనుగోలుకు ఫ్లిప్‌కార్ట్‌ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. రీఫర్బిష్డ్ వస్తువుల కొనాలి అనుకునేవారి తొలి ఛాయిన్‌ '2గుడ్‌' కావాలని తాము కోరుకుంటున్నామని, ఈ కామర్స్‌ మార్కెట్‌లో అగ్రగామిగా నిలవాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు.

ఇక పై పాత వస్తులువు కూడా ఫ్లిప్ కార్ట్ లో దొరుకుతాయి! ఎలాగో తెలుసా?

ఆయా వస్తువుల కొనుగోలుపై 3 నుంచి 12 నెలల వారెంటీని తమ విస్తృతమైన నెట్‌వర్క్‌ ద్వారా అందిస్తామని కృష్ణమూర్తి చెప్పారు. చెల్లింపులు, రవాణా విషయంలోనూ కొనుగోలుదారుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరని హామీ ఇచ్చారు. '2గుడ్‌' ద్వారా కొనుగోలు ప్రక్రియను సులభతరం చేశామని, ఇందులోనూ ఫ్లిప్‌కార్ట్‌ తరహాలో నాణ్యమైన వస్తువులు విక్రయిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అనిల్‌ గొటేటి వెల్లడించారు. '2గుడ్‌'కు ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. ఈబే ఇండియాను ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు చేసిన అనంతరం పునర్‌వ్యవస్థీకరించి ప్రారంభించారు.

Read more about: flipkart
English summary

ఇక పై పాత వస్తులువు కూడా ఫ్లిప్ కార్ట్ లో దొరుకుతాయి! ఎలాగో తెలుసా? | We Can Buy Second Handle Products in Flipkart

Flipkart brings new convenience for people who want to buy second hand goods. Launched a new portal named '2GUD'. It includes second hand smartphones, laptops, tabs and other electronic devices. Flipkart CEO Kalyan Krishnamurthy told the media that it will soon get more categories.
Story first published: Thursday, August 23, 2018, 12:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X