For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్,డీజిల్ ను జిఎస్టి లో చేర్చకూడదంటున్న రాష్ట్రాలు?

గత జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో పెట్రోల్, డీజిల్ ను జిఎస్టిలో చేర్చకూడదని రాష్ట్రాలు ప్రతిపాదించాయి.

|

న్యూఢిల్లీ: గత జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో పెట్రోల్, డీజిల్ ను జిఎస్టిలో చేర్చకూడదని రాష్ట్రాలు ప్రతిపాదించాయి ఎందుకంటే సంక్షోభ సమయంలో నిధులు సమకూర్చుకోవటానికి కొన్ని యుక్తులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించలేదు.

పెట్రోల్,డీజిల్ ను జిఎస్టి లో చేర్చకూడదంటున్న రాష్ట్రాలు?

గత సమావేశంలో జిఎస్టి కింద పెట్రోల్ మరియు డీజిల్ను చేర్చడానికి ఒక్క రాష్ట్రం కూడా మద్దతు ఇవ్వలేదు. దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా దానిని సమర్ధించటానికి ఇష్టపడలేదు, అని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

జిఎస్టి కింద పెట్రోల్ మరియు డీజిల్ను ప్రవేశపెడుతున్న విషయం జిఎస్టి సమావేశంలో కేంద్రం చేత ప్రతిపాదించబడింది.కానీ రాష్ట్రాలు తమ వాదనలు విన్నవిస్తూ వారికి మరికొన్ని అంశాలపై సానుకూల విధానాలు అవసరమని కోరారు.

రాష్ట్రాలు, ముఖ్యంగా కేరళ,ప్రతి వస్తువు జిఎస్టి కింద అమలు చేసేలా కేంద్రం ద్రుష్టి సారించాలని ప్రతిపాదించింది. జిఎస్టి వెలుపల ఉన్న ఉత్పత్తులు జిఎస్టి వెలుపలే ఉండాలని వారు చెప్పారు.జీఎస్టీలో చేరిస్తే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ రూపంలో రూ.20,000 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.19.48, డీజిల్‌పై లీటర్‌కు రూ.15.33ను ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్రం రాబడుతుండగా, దీనికి అదనంగా రాష్ట్రాలు వ్యాట్‌ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం గడిస్తున్నాయి.

పెట్రోలు, డీజిల్ పై పన్ను తగ్గించడం అనే అంశంపై అనేక పార్టీలు లేవనెత్తుతున్న సమయంలో కర్ణాటక ఇటీవల ఇంధనంపై పన్నులు పెంచింది.ఇది కేవలం రాజకీయ డిమాండ్ల వల్ల పెంచాల్సివచ్చిందని మూలాల సమాచారం వెల్లడించింది.

Read more about: gst
English summary

పెట్రోల్,డీజిల్ ను జిఎస్టి లో చేర్చకూడదంటున్న రాష్ట్రాలు? | No States Want GST On Fuel

New Delhi: The states did not agree to include petrol and diesel in the GST during the last GST Council meeting as they want some maneuverability to raise funds during crisis, said government sources.
Story first published: Wednesday, August 22, 2018, 12:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X