For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక నుంచి వాట్సాప్ లో ఫేక్ న్యూస్లు వస్తే తటా తీయండి : కేంద్రం

By Sabari
|

వాట్సాప్ ద్వారా సర్క్యేలేట్ అవుతున్న నకిలీ మెసేజ్‌లు ఎక్కడినుంచి పుట్టుకొచ్చాయో గుర్తించేందుకు అవసరమైన టెక్నాలజీని రూపొందించడంతో పాటు దేశంలో కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

 రవిశంకర్ ప్రసాద్

రవిశంకర్ ప్రసాద్

వాట్సాప్ అధినేత క్రిస్ డేనియల్స్ ఇండియా పర్యటన సందర్భంగా ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశం అయ్యారు. దేశ డిజిటల్ రంగం అభివృద్ధికి వాట్సాప్ కృషి అభినందనీయమే అయినప్పటికీ, మూకస్వామ్యం, అశ్లీలదృశ్యాల ప్రచారం వంటి చెడ్డ పరిణామాలను అరికట్టేందుకు పరిష్కారాలను కనిపెట్టాలని రవిశంకర్ ప్రసాద్ కోరారు

క్రిస్ డేనియల్స్‌

క్రిస్ డేనియల్స్‌

వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్స్‌తో సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సాంకేతిక అవగాహనను కల్పించడంలో వాట్సాప్ చేసిన కృషిని అభింనందించారు. అయితే మూకస్వామ్యం, రివేంజ్ పోర్న్ వంటి మెసేజ్ లను అరికట్టడానికి సాంకేతిక పరిష్కారాలను కొనుక్కోవాల్సిన సూచించినట్టు తెలిపారు,. దేశీయంగా క్రిమినల్ చట్టాల ఉల్లంఘన జరగకుండా పరిష్కారాలుండాలని అన్నారు.

వాట్సాప్

వాట్సాప్

దేశంలో వాట్సాప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన కంప్లయెన్స్ అధికారిని కూడా నియమించాలని వాట్సాప్ కోరినట్టు ఆయన వెల్లడించారు. తప్పుడు మెసేజ్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలసుకోవడానికి రాకెట్ సైన్స్ అవసరంలేదని, అందుకు తగిన పరిష్కారాన్ని కనుక్కోవడానికి యంత్రాంగం ఉంటే చాలునని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

సోషల్ మీడియా

సోషల్ మీడియా

ఒకవేళ వాట్సాప్ ఈ దిశగా చర్యలు తీసుకోకపోతే ప్రేరేపణ చర్యలకు పాల్పిన నేరారోపణలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ అంశాలకు సంబంధించి పరిష్కారాల దిశగా వాట్సాప్ హామి ఇచ్చినట్టు తెలిపారు. అయితే ఈ సమావేశ వివరాలను వెల్లడించడానికి వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్స్ నిరాకరించారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని చేరవేయకుండా ప్రజలకు అవగాహన కల్పించడానికి డేనియల్ అంగీకరించారని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు

Read more about: whatsapp
English summary

ఇక నుంచి వాట్సాప్ లో ఫేక్ న్యూస్లు వస్తే తటా తీయండి : కేంద్రం | Central Government Serious on Whatsapp Fake Messages

The Central Government has said that it is necessary to create the necessary technology to determine
Story first published: Wednesday, August 22, 2018, 17:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X