For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రిటర్న్స్‌ గురించి మీకు తెలియని 10 విషయాలు మీకోసమే చూడండి.

By Sabari
|

మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? ఇంకా చేయకపోతే కొన్ని విషయాలపై దృష్టిపెట్టండి. ప్రొఫెషనల్స్ సాయం అవసరం లేకుండా మీరు నేరుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. ఇందుకోసం మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. 2017-2018 ఆర్థిక సంవత్సరానికి ఐటీ డిపార్ట్‌మెంట్ కొన్ని కొత్త ట్యాక్స్ రిటర్న్ ఫామ్స్ తీసుకొచ్చింది. ఆ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి.

1. సరైన ఐటీఆర్ ఫామ్ ఎంచుకున్నారా?

1. సరైన ఐటీఆర్ ఫామ్ ఎంచుకున్నారా?

ఇప్పుడు మొత్తం 7 ఐటీఆర్ ఫామ్స్ ఉన్నాయి. మీ ఆదాయాన్ని బట్టి ఫామ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ తప్పుడు పత్రాన్ని ఎంచుకుంటే మీ టాక్స్ రిటర్న్స్ రిజెక్ట్ అయ్యే అవకాశముంది.

2. వ్యక్తిగత వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా?

2. వ్యక్తిగత వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా?

మీ పాన్ నెంబర్, ఇ-మెయిల్ ఐడీ, కాంటాక్ట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లాంటి వివరాలన్నీ ఐటీఆర్ ఫైలింగ్‌కు ముందే సిద్ధం చేసుకోండి. పాన్ నెంబర్ తప్పుగా ఇచ్చినా డేటా సరిపోలక ఇ-ఫైలింగ్ రిజెక్ట్ అవ్వొచ్చు.

3. మీ అన్ని రకాల ఆదాయాలను వివరించారా?

3. మీ అన్ని రకాల ఆదాయాలను వివరించారా?

పన్ను మినహాయింపులు ఉన్న ఆదాయాన్ని వివరించాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ అలా కాకుండా పన్ను చెల్లించాల్సిన ఆదాయంతోపాటు పన్ను మినహాయింపులు ఉన్న వాటినీ వివరించడం మంచిది. మీరు ఆ వివరాలు వెల్లడించకపోతే 'మీరు ఆదాయాన్ని దాచినట్టే' అని ఐటీ శాఖ పరిగణిస్తుంది. దాంతో మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీస్ కూడా రావొచ్చు.

4. క్లెయిమ్ మినహాయింపులు సరైన సెక్షన్‌లో ఉన్నాయా?:

4. క్లెయిమ్ మినహాయింపులు సరైన సెక్షన్‌లో ఉన్నాయా?:

తప్పుడు విభాగంలో మినహాయింపులు నమోదు చేస్తే మరిన్ని పన్నులు చెల్లించాల్సి రావొచ్చు. మీరు ఏవైనా పెట్టుబడులు పెడితే పన్ను మినహాయింపులు పొందొచ్చు. అయితే వాటిని సరైన విభాగంలో నమోదు చేయాలి. లేకపోతే ఎక్కువ పన్నులు భరించాల్సి వస్తుంది.

5. ఫామ్ 16, ఫామ్ 26ఏఎస్‌ సరిపోలిందా?

5. ఫామ్ 16, ఫామ్ 26ఏఎస్‌ సరిపోలిందా?

ఫామ్ 26ఏఎస్‌లో టీడీఎస్, ముందుగా చెల్లించిన పన్ను వివరాలు ఉంటాయి. అందుకే ఫామ్ 16, ఫామ్ 26ఏఎస్‌లోని అంశాలు ఒకేలా ఉన్నాయో లేదో చూడండి. లేకపోతే పన్నులు ఎక్కువగా చెల్లించడమో లేక రీఫండ్ తక్కువగా రావడమో తప్పదు. ఇంకా తేడా వస్తే ట్యాక్స్ నోటీస్ రావడం ఖాయం.

6. మీ టీడీఎస్ ఒకసారి కంటే ఎక్కువగా నమోదైందా?

6. మీ టీడీఎస్ ఒకసారి కంటే ఎక్కువగా నమోదైందా?

మీరు ఒకే ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారితే ఈ పరిస్థితి రావొచ్చు. మీ మొదటి యజమాని టీడీఎస్‌ను ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెల్లిస్తారు. ఆ విషయం తెలియక రెండో యజమాని కూడా టీడీఎస్ చెల్లించే అవకాశముంది. అందుకే మీ టీడీఎస్ వివరాలను కొత్త కంపెనీలో అందించండి.

7. మీ పన్ను చెల్లింపులను సరిగ్గా లెక్కించారా?

7. మీ పన్ను చెల్లింపులను సరిగ్గా లెక్కించారా?

మీ ఆదాయ వివరాలు సేకరించిన తర్వాత పన్ను చెల్లింపుల్ని లెక్కించండి. పన్ను చెల్లింపు లెక్కల్లో తేడా వస్తే ట్యాక్స్ నోటీస్ వస్తుంది.

8. లాస్ క్లెయిమ్ చేసుకున్నారా?

8. లాస్ క్లెయిమ్ చేసుకున్నారా?

ప్రాపర్టీ అమ్మడం ద్వారా మీకు ఏదైనా లాస్ వస్తే ఐటీఆర్‌లో వివరించి క్లెయిమ్ చేసుకోవచ్చు. గడువు లోగా వివరించకపోతే ఆ తర్వాత ఏమీ చేయలేరు.

9. మీ పెట్టుబడుల గురించి వివరించారా?

9. మీ పెట్టుబడుల గురించి వివరించారా?

రూ.10 లక్షల కన్నా ఎక్కువ క్యాష్ డిపాజిట్లు, రెండు లక్షల కన్నా ఎక్కువ మ్యూచ్యువల్ ఫండ్స్, రూ.2 లక్షల కన్నా ఎక్కువగా కొన్న ప్రాపర్టీ వివరాలు సరిగ్గా వెల్లడించండి.

10. మీ ఐటీఆర్ గడువులోగా ఫైల్ చేస్తున్నారా?

10. మీ ఐటీఆర్ గడువులోగా ఫైల్ చేస్తున్నారా?

ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఆగస్ట్ 31 వరకు గడువు పెంచారు. సమయం చాలా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఐటీఆర్ ఫైల్ చేయండి. లేకపోతే రూ.5000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ డిసెంబర్ 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించాలి. రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవాళ్లు రూ.1000 జరిమానా చెల్లించాలి.

Read more about: income tax
English summary

ఐటీ రిటర్న్స్‌ గురించి మీకు తెలియని 10 విషయాలు మీకోసమే చూడండి. | 10 Things to Know Before Income Tax Returns

Did you file IT returns file? If not done, focus on a few things. You can file IT returns directly without the help of professionals. You should remember some things. IT department has brought some new tax returns for the financial year 2017-2018. All these things must be taken into consideration.
Story first published: Tuesday, August 21, 2018, 13:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X