For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ నో సబ్‌స్క్రిప్షన్ ఫీజు

By Sabari
|

అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లో మరో సర్వీస్ వచ్చింది. 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్'ని లాంఛ్ చేసింది ఫ్లిప్‌కార్ట్. ఈ ప్రీమియం అకౌంట్‌తో యూజర్లకు అదనపు బెన్‌ఫిట్స్ లభిస్తాయి. వస్తువులు త్వరగా డెలివరీ చేయడం, కొన్ని ప్రొడక్ట్స్‌ని మిగతావారికంటే ముందే కొనగలగడం లాంటి బెన్‌ఫిట్స్ లభిస్తాయి. అయితే అమెజాన్‌ ప్రైమ్‌కు డబ్బులు చెల్లించినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌కు ఏమీ చెల్లించక్కర్లేదు. కేవలం 'ప్లస్ కాయిన్స్' పేరుతో లాయల్టీ పాయింట్స్ పొందితే చాలు. ప్రతీ ఆర్డర్‌పై వచ్చే 'ప్లస్ కాయిన్స్‌'ని డిజిటల్ కరెన్సీ లాగా ఉపయోగించుకోవచ్చు.

అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ నో సబ్‌స్క్రిప్షన్ ఫీజు

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఎలా పొందాలి?

ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఖర్చుచేసే ప్రతీ రూ.250కి ఒక ప్లస్ కాయిన్ వస్తుంది. రూ.1,000 షాపింగ్ చేస్తే నాలుగు కాయన్స్ వస్తాయి. ప్రతీ ఆర్డర్‌పై 10 కంటే ఎక్కువ కాయిన్స్ పొందలేరు. 50 కాయిన్స్ వచ్చిన తర్వాత వాటితో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ వచ్చిన తర్వాత అదనపు బెన్‌ఫిట్స్ లభిస్తాయి. అంతేకాదు... ఈ కాయిన్స్‌ని బుక్‌మైషో, కేఫ్ కాఫీ డే, మేక్‌మైట్రిప్, ఇక్సిగో, జొమాటో, ఛాయ్ పాయింట్, హాట్‌స్టార్‌ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లోనూ రీడీమ్ చేసుకోవచ్చు.

Read more about: flipkart
English summary

అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ నో సబ్‌స్క్రిప్షన్ ఫీజు | FlipKart Launches Flipkart Pluse

Another service on the e-commerce platform is the competition for Amazon Prime. Flipkart to launch 'Flipkart Plus'.
Story first published: Friday, August 17, 2018, 14:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X