For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI నుంచి హై అలెర్ట్ మీ దగ్గర ఏటిఎం ఉందా? అయితే జాగ్రత్తగా ఉండండి.

By Sabari
|

ఏటీఎం కార్డు వినియోగానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఇండియా తన వినియోగదాలను మరోసారి అలర్ట్ చేస్తోంది.

 బ్యాంకు నిబంధనలు

బ్యాంకు నిబంధనలు

నగదును తీసుకురావాలంటూ మీ ఏటీఎం కార్డును సమీప బంధువులు, స్నేహితులకు, కనీసం భార్యకార్డు భర్త, భర్త కార్డు భార్య సైతం ఉపయోగించకూడదని బ్యాంకు నిబంధనలు సూచిస్తున్నాయి

సబబేనని

సబబేనని

ఇది సబబేనని న్యాయస్థానం కూడా అంగీకరిస్తోంది. ఏటీఎం కార్డును సంబంధిత ఖాతాదారుడే ఉపయోగించాలనే నిబంధన ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

రసీదు వస్తే

రసీదు వస్తే

అత్యవసర సమయాల్లో ఒకవేళ ఏటీఎం కార్డు ఇచ్చి ఇతరుల ద్వారా డబ్బు తెప్పించుకునే క్రమంలో ఏటీఎంలో డబ్బు రాకుండా విత్‌డ్రా అయినట్లు రసీదు వస్తే ఆ తర్వాత ఏటీఎం నుంచి డ్రా చేసిన డబ్బు మీ ఖాతాలో ఉన్నా అవి లేనట్లే

నిబంధన ఉల్లంఘనే

నిబంధన ఉల్లంఘనే

ఏటీఎంలోని సీసీ కెమెరాల్లో ఖాతాదారుడికి బదులు ఇతరులు డ్రా చేసినట్లు తెలిసినా, ఏటీఎం కార్డు పిన్‌ను ఇతరులతో పంచుకున్నా కూడా నిబంధన ఉల్లంఘనే అవుతుందని ఒక కేసులో న్యాయస్థానం కేసును కొట్టివేసి ఎస్‌బీఐ నిబంధనలను సమర్ధించింది

 వినియోగదారులను

వినియోగదారులను

ఈ విషయాన్ని ఖాతాదారులు గ్రహించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ మరోసారి వినియోగదారులను హెచ్చరిస్తోంది.

బెంగళూరుకు చెందిన

బెంగళూరుకు చెందిన

బెంగళూరుకు చెందిన వందన 2013 నవంబరు 14న ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకురమ్మని.. భర్త రాజేశ్‌కు తన ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఇచ్చింది. ఆయన రూ.25,000 డ్రా చేశాడు. అయితే ఏటీఎం నుంచి మనీ డ్రా అయినట్లు రసీదు మాత్రమే వచ్చింది.

బ్యాంకు రూల్స్‌కి

బ్యాంకు రూల్స్‌కి

కాని డబ్బు రాలేదు. దీంతో ఆ భార్యాభర్తలు బ్యాంకును ఆశ్రయించారు. అయితే బ్యాంకు రూల్స్‌కి విరుద్ధంగా ఏటీఎం పిన్‌ను ఇతరుకు చెప్పడం అనేది ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. డబ్బు రాకపోతే తాము చేసేది ఏమి లేదని స్పష్టం చేశారు.

కోర్టులో పిటిషన్

కోర్టులో పిటిషన్

దీంతో ఆ దంపతులు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. 2014 అక్టోబరు 21లో వినియోగదారుల కోర్టులో పిటిషన్ వేశారు. దాదాపు నాలుగేళ్లపాటు సాగిన ఈ కేసు విచారణలో ఎస్‌బీఐ నిబంధనలను సమర్థిస్తూ వారి పిటిషన్‌ను కొట్టివేసింది.

Read more about: sbi
English summary

SBI నుంచి హై అలెర్ట్ మీ దగ్గర ఏటిఎం ఉందా? అయితే జాగ్రత్తగా ఉండండి. | SBI High Alert on Atm

State Bank India is once again utilizing its use of ATM card.
Story first published: Monday, August 13, 2018, 10:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X