For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాలలో SBI బ్యాంకు ఎంతో తెలుసా?మీరే చూడండి.

By Sabari
|

దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ నష్టాలు నమోదు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో రూ.4,875.75 కోట్లు నష్టం వచ్చినట్లు ఎస్బీఐ ప్రకటించింది.

మూడో త్రైమాసికంలోనూ

మూడో త్రైమాసికంలోనూ

దీంతో వరసగా మూడో త్రైమాసికంలోనూ నష్టం వాటిల్లినట్లు ఎస్బీఐ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎస్బీఐకి రూ.2,416 కోట్ల నష్టం రాగా, నాలుగో త్రైమాసికంలో ఏకంగా రూ.7,718.17 కోట్ల నష్టం వచ్చింది.

గతేడాది

గతేడాది

అయితే గతేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ రూ.2,005.53 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగా ఈ ఏడాది మాత్రం భారీగా నష్టపోయింది. ఈ తొలి త్రైమాసికంలో నష్టం వచ్చినా ఆదాయం మాత్రం పెరిగింది.

ఎస్‌బీఐ

ఎస్‌బీఐ

గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ.62,911.08 కోట్ల ఆదాయం రాగా ఈ సంవత్సరం రూ.65,492.67 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. అలాగే స్థూల నిరర్ధక ఆస్తులు కూడా పెరిగాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 9.97 శాతంగా ఉన్న స్థూల నిరర్ధక ఆస్తులు ఈ సంవత్సరం 10.69 శాతానికి పెరిగాయి

నిరర్ధక ఆస్తులు

నిరర్ధక ఆస్తులు

మరోవైపు నికర నిరర్ధక ఆస్తులు మాత్రం తగ్గిపోయాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 5.73 శాతంగా ఉన్న నికర నిరర్ధక ఆస్తులు ఇప్పుడు 5.29 శాతానికి పడిపోయాయి.

గత ఏడాదితో పోలిస్తే

గత ఏడాదితో పోలిస్తే

గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,88,068 కోట్ల స్థూల నిరర్ధక ఆస్తులు ఉండగా, ఈ ఏడాది రూ.2,12,840 కోట్లకు పెరిగాయి. అలాగే గతేడాది రూ.1,07,560 కోట్ల నికర నిరర్ధక ఆస్తులు ఉండగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.99,236 కోట్లుగా నమోదయ్యాయి. బ్యాంకు ప్రొవిజన్లు, కాంటింజెన్సీస్ గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.8,929.4 8కోట్లుగా ఉండగా ఇప్పుడు రూ.19,228 కోట్లుగా నమోదయ్యాయని ఎస్‌బీఐ తెలిపింది.

 ఈ ఏడాది

ఈ ఏడాది

ఏకీకృత ప్రాతిపదికన చూస్తే.. బ్యాంకు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.4,230కోట్ల నికర నష్టం నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3,032కోట్ల నికర లాభం వచ్చింది. ఇక నికర వడ్డీ ఆదాయం కూడా పెరిగినట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఇదే త్రైమాసికంలో కిందటేడాది రూ.17,606 కోట్ల నికర వడ్డీ ఆదాయం రాగా ఈ ఏడాది రూ.21,798 కోట్లకు పెరిగినట్లు ఎస్బీఐ తెలిపింది.

Read more about: sbi
English summary

భారీ నష్టాలలో SBI బ్యాంకు ఎంతో తెలుసా?మీరే చూడండి. | SBI Got Huge Lose In Q1 Results

State Bank of India (SBI) on Friday posted a loss for the third consecutive quarter after setting aside funds to cover losses on its bond portfolio and increased gratuity.
Story first published: Saturday, August 11, 2018, 12:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X