For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ లో ఐకియా స్టోర్ ఈరోజే ఓపెనింగ్

By Sabari
|

స్వీడిష్ ఫర్నీచర్ కంపెనీ "ఐకియా" స్టోర్ ను హైదరాబాద్ న‌గ‌రంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో 13 ఎకరాల్లో ఫర్నీచర్ షోరూమ్ ను ఐకియా సంస్థ ఏర్పాటుచేసింది.

ఐకియా స్టోర్

ఐకియా స్టోర్

ఈ అంతర్జాతీయ సంస్థ..భార‌త‌దేశంలో తమ మొట్టమొదటి స్టోర్ ను హైదరాబాద్ లోనే ప్రారంభించింది. మొత్తం 7500 ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. వెయ్యి సీట్లతో అతిపెద్ద రెస్టారెంట్ ఐకియా స్టోర్ లో ఉంది. ఆహ్లాదకరంగా.. పిల్లలు ఆడుకునే ప్లే జోన్ కూడా ఉంది.

హైదరాబాద్‌దే ఫస్ట్

హైదరాబాద్‌దే ఫస్ట్

హైటెక్‌ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఐకియా స్టోర్ దేశంలో మరెన్ని స్టోర్స్‌ను ప్రారంభించినన హైదరాబాద్‌దే ఫస్ట్ అనేదే చారిత్రక సత్యం అవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు

కేటీఆర్

కేటీఆర్

కంపెనీ స్టోర్ ప్రారంభిస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ కంపెనీ ఐకియా తమ స్టోర్ ను హైదరాబాద్ లో ప్రారంభించడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు

చేనేత ఉత్ప‌త్తుల‌తో

చేనేత ఉత్ప‌త్తుల‌తో

తెలంగాణలో త‌యార‌య్యే చేనేత ఉత్ప‌త్తుల‌తో పాటు ఇతర ఉత్ప‌త్తులుకూడా ఐకియాలో అమ్ముతారని చెప్పారు. హైదరాబాద్ నగరానికి మరిన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు రాబోతున్నాయన్నారు.

 స్థానికులకే

స్థానికులకే

తెలంగాణ.. విదేశీ పెట్టుబడులకు గ‌మ్య‌స్థానంగా మారిందన్నారు. అన్ని వస్తువులను అందుబాటు ధరల్లోనే ఐకియా ఉంచిందని స్టోర్ లో 30శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చారని కేటీఆర్ చెప్పారు.

Read more about: telangana
English summary

హైదరాబాద్ లో ఐకియా స్టోర్ ఈరోజే ఓపెనింగ్ | IKEA Store Opening Today in Hyderabad

IKEA has visited more than 800 homes in the country to see how people live and the launch today comes at least 12 years after it started studying India
Story first published: Thursday, August 9, 2018, 14:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X