For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జోరుగా సాగుతున్న రైతు బంధు పధకం రైతులకి బాండ్లు ఇచ్చిన కేటీఆర్

By Sabari
|

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో మంచి పథకం రైతు బంధు సామూహిక జీవిత బీమా. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది.

రూ.5 లక్షల

రూ.5 లక్షల

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకి రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నారు. రైతు సహజ మరణం చెందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా ప్రభుత్వం రూ.5 లక్షల బీమాను చెల్లించనుంది. కేవలం 10 రోజుల్లోనే బీమా తీసుకున్న రైతు సూచించిన నామినీకి ఈ మొత్తం చెల్లిస్తారు.

కేటీఆర్

కేటీఆర్

ఈ రైతు బీమాకు సంబంధించిన బాండ్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్లలో బాండ్లను పంపిణీ చేశారు.

పాలసీ క్లెయిమ్

పాలసీ క్లెయిమ్

రైతులకు జీవిత బీమా అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న రైతులందరికీ రైతుబీమా పథకం వర్తిస్తుంది. రైతు మరణించిన 10 రోజుల్లోనే పాలసీ క్లెయిమ్ అవుతుంది. దీనికి రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరంలేదు

ఆగస్టు 1న

ఆగస్టు 1న

రైతులకు జీవిత బీమా చెల్లించడానికయ్యే నిధులను బడ్జెట్లోనే కేటాయించి, ప్రతి ఏటా ఆగస్టు 1న ప్రభుత్వం ఎల్ఐసీకి చెల్లించనుంది.

రైతు బీమా

రైతు బీమా

తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులే 93 శాతం మంది ఉన్నారు. ఒక్క ఎకరంలోపు ఉన్న వారు 18 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతును ఆదుకునే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది రైతులకు ‘రైతు బీమా' బాండ్లను పంపిణీ చేస్తోంది.

ఉచిత విద్యుత్ సరఫరా

ఉచిత విద్యుత్ సరఫరా

వ్యవసాయాభివృద్ది - రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే ఎకరానికి 8వేల రూపాయల పెట్టుబడి, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా లాంటి పథకాలను అందిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ రైతు బీమాతో మరో అద్వితీయ పథకాన్ని తీసుకొచ్చింది.

Read more about: telangana
English summary

జోరుగా సాగుతున్న రైతు బంధు పధకం రైతులకి బాండ్లు ఇచ్చిన కేటీఆర్ | KTR gave Raithu Bandhu Scheme Bonds to Farmers

Another good initiative of the Telangana government is the farmer's family life insurance. The scheme will come into effect from August 15th on Independence Day.
Story first published: Wednesday, August 8, 2018, 16:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X