For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్ కి ఫుల్ జోష్ క్యూ కడుతున్న కంపెనీలు.ఈసారి ఏ కంపెనీ తెలుసా?

By Sabari
|

నవ్యాంధ్రకు పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తి సంస్థ హోలీటెక్‌ ఏపీ సర్కార్‌తో కీలకమైన ఎంవోయూ చేసుకుంది. అమరావతిలో మంత్రి లోకేష్ స‌మ‌క్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. హోలీటెక్ కంపెనీ భారతదేశంలోనే మొదటిగా ఏపీలో రూ.1400కోట్ల పెట్టుబడి పెడుతోంది. తిరుప‌తి సమీపంలో 75 ఎక‌రాల్లో ఏర్పాటు చేయ‌నున్న ఈ హోలీటెక్ ప్లాంట్‌లో.. ప్ర‌తినెలా 5కోట్ల మొబైల్ విడిభాగాల‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ కంపెనీ ద్వారా 6వేల మందికి ఉద్యోగ అవ‌కాశాలు రానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ కి ఫుల్ జోష్ క్యూ కడుతున్న కంపెనీలు.ఈసారి ఏ కంపెనీ తెలుసా?

హోలీటెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. ఈ కంపెనీకి చైనాలో 16 ఫ్యాక్టరీలు ఉన్నాయని.. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. హోలీటెక్ మొత్తం ఐదు ప్రొడక్ట్‌లు .. టిన్ ఫిలిమ్ ట్రాన్సిస్టర్, లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు, కేపాసిటర్ టచ్ స్ర్ర్కీన్, సీసీఎం (కాంపోనెట్ కేమ్రామోడ్యూల్), ఫింగర్ ప్రింట్ మాడ్యూల్‌ను ఇక్కడే తయారు చేయనున్నారని చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు హోలీటెక్‌ ప్రతినిధి మనజియన్. చంద్రబాబు విజన్ ఉన్న సీఎం అని.. అందుకే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించామన్నారు. ఇక్కడే హోలీటెక్ అతిపెద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోందని చెప్పారు.

Read more about: andhra pradesh
English summary

ఆంధ్రప్రదేశ్ కి ఫుల్ జోష్ క్యూ కడుతున్న కంపెనీలు.ఈసారి ఏ కంపెనీ తెలుసా? | HoliTech Company Coming to Andhra Pradesh

Investments for Navyanandhra are in the queue. Freshly popular electronic production company, Holitech AP Sarkar,
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X