For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI కస్టమర్లకి ముకేశ్ అంబానీ జియో శుభవార్త.. ఇక బ్యాంకింగ్ సేవలు చాలా సులువు !

By Sabari
|

ఎస్‌బీఐ కస్టమర్లకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. మెరుగైన డిజిటల్ బ్యాకింగ్ సేవలతో పాటు పేమెంట్స్, ఈకామర్స్ సేవలను అందించేందుకు ఎస్‌బీఐతో ఒప్పందం కుదుర్చుకుంది.

మై జియో యాప్

మై జియో యాప్

మై జియో యాప్‌తో ఎస్‌బీఐ యోనో యాప్‌ను అనుసంధానం చేసేందుకు రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. ఈ మేరకు ముంబైలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సమక్షంలో ఎస్‌బీఐ, జియో ప్రతినిధులు మెమోరాండం ఆఫ్ అండర్‌ స్టాండింగ్ (ఎంవోయూ)పై సంతకాలు చేశారు.

ఎస్‌బీఐ

ఎస్‌బీఐ

ఈ ఒప్పందంతో జియో ద్వారా ఎస్‌బీఐకి ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి. యోనో యాప్ ద్వారా ఇప్పటికే కస్టమర్లకు బ్యాకింగ్, కామర్స్, సూపర్ స్టోర్ సర్వీసులను అందిస్తోంది ఎస్‌బీఐ.

తక్కువ ధరకే

తక్కువ ధరకే

ఐతే ఇకపై 'మై జియో' యాప్‌ నుంచి సైతం ఎస్‌బీఐ లావాదేవీలు చేసుకోవచ్చు. వాటితో పాటు టాక్సీ బుకింగ్, బిల్ పేమెంట్స్, సూపర్ స్టోర్ సేవలను పొందవచ్చు. ఎస్‌బీఐ రివార్డ్స్‌ను రిలయన్స్ రిటైల్, జియో, ఇతర పార్ట్‌నర్ బ్రాండ్స్‌లోనూ రిడీమ్ చేసుకోవచ్చు. ఇక జియో ఫోన్‌లు సైతం ఎస్‌బీఐ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ల కింద తక్కువ ధరకే లభిస్తాయి.

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు

ఏప్రిల్‌లో ఎస్‌బీఐతో కలిసి పేమెంట్స్ బ్యాంక్‌ని ప్రారంభించింది జియో.ఇందులో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు 70 శాతం వాటా ఉండగా. మ‌రో 30 శాతం వాటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క‌లిగి ఉంది.

 దేశంలోనే అతి పెద్ద

దేశంలోనే అతి పెద్ద

ఇండియాలో అతి పెద్ద ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్స్‌లో మై జియో కూడా ఒకటి. కాగా, జియో రిలయన్స్ సబ్సిడరీ సంస్థ అన్న విషయం తెలిసిందే. ఇక ఎస్‌బీఐ దేశంలోనే అతి పెద్ద బ్యాంకు.42 కోట్ల 40 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లు ఎస్‌బీఐకి ఉన్నారు.

Read more about: sbi
English summary

SBI కస్టమర్లకి ముకేశ్ అంబానీ జియో శుభవార్త.. ఇక బ్యాంకింగ్ సేవలు చాలా సులువు ! | Jio Tie up With SBI For Good Banking Service

SBI has inked a pact with Reliance Jio Infocomm to integrate its digital banking solution Yono with MyJio application to boost digital payment.
Story first published: Friday, August 3, 2018, 9:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X