For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చేసింది మీరు కూడా ఒక లుక్ వేయండి

By Sabari
|

వాట్సప్ టాప్ మెసేజింగ్ సర్వీస్. ఫేస్‌బుక్‌ సొంతం చేసుకున్న ఈ ప్లాట్‌ఫామ్‌కు అంత పాపులారిటీ రావడానికి మూడు కారణాలున్నాయి.

వాట్సప్

వాట్సప్

ఒకటి అన్‌లిమిటెడ్ టెక్ట్‌ మెసేజింగ్. రెండోది సింపుల్ యూఐ. మూడోది ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌డేట్స్ అందించడం. మెసేజింగ్‌తో పాటు గ్రూప్ చాట్, లొకేషన్ షేరింగ్, వాయిస్, వీడియో కాల్స్ లాంటి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. ఇప్పుడు మరిన్ని ఫీచర్లు యాడ్ చేసింది.

వాట్సప్ గ్రూప్ కాల్:

వాట్సప్ గ్రూప్ కాల్:

ఈ ఫీచర్ వాట్సప్ బీటాలో మాత్రమే ఉంది. త్వరలో మిగతావాళ్లకూ ఈ ఫీచర్‌ను అందించనుంది వాట్సప్. ఈ కొత్త ఫీచర్ మొదట విండోస్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. మొత్తం నలుగురు ఒకేసారి గ్రూప్ కాల్ మాట్లాడొచ్చు. వీడియో కాలింగ్ యాప్స్ అయిన గూగుల్ డ్యుయో, స్కైప్‌లకు పోటీ ఇవ్వనుంది వాట్సప్.

అడ్మిన్‌ను డిస్మిస్ చేయడం:

అడ్మిన్‌ను డిస్మిస్ చేయడం:

ఇది వాట్సప్ గ్రూప్స్ కోసం రూపొందించిన ఫీచర్. గ్రూప్ అడ్మిన్స్ మిగతా అడ్మిన్లను డిమోట్ చేసే అవకాశముంటుంది. గతంలో ఇతర అడ్మిన్లను గ్రూప్‌లోంచి తొలగించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డిమోట్ చేస్తే చాలు. ఇది గ్రూప్ ఇన్ఫో మెనూలో ఉంటుంది

డిలిట్ చేసిన మీడియా ఫైల్స్‌‌ని డౌన్‌లోడ్ చేయడం:

డిలిట్ చేసిన మీడియా ఫైల్స్‌‌ని డౌన్‌లోడ్ చేయడం:

గతంలో మీరు వాట్సప్‌లో ఫోటోలు, వీడియోలు డిలిట్ చేశారా? ఏం పర్లేదు మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. గతంలో అయితే ఒక్కసారి డిలిట్ చేస్తే ఇక ఆ ఫైల్ కనిపించేది కాదు. ఇప్పుడు మాత్రం ఆ ఫైల్‌ సర్వర్‌లో ఉంటుంది కాబట్టి మీరు మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఫార్వర్డ్ మెసేజ్‌కు లేబుల్:

ఫార్వర్డ్ మెసేజ్‌కు లేబుల్:

వాట్సప్‌లో సర్క్యులేట్ అయ్యేవి ఎక్కువగా ఫార్వర్డ్ మెసేజ్‌లే. అయితే అది పంపిన వ్యక్తి సొంతగా రూపొందించిన మెసేజా, లేక ఫార్వర్డ్ మెసేజా అన్నది గతంలో తెలిసేది కాదు. ఇప్పుడు ఆ మెసేజ్‌పై ఫార్వర్డ్ లేబుల్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ గతంలో ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌లో ఉండేది. ఇప్పుడు అందరి వాట్సప్‌లో కనిపిస్తోంది.

Read more about: whatsapp
English summary

వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చేసింది మీరు కూడా ఒక లుక్ వేయండి | Whatsapp Came up with New Feature

Whatsup Top Messaging Service. The Facebook-owned platform has three reasons for its popularity.
Story first published: Tuesday, July 24, 2018, 15:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X