For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లాష్ .. ఫ్లాష్ SBI అకౌంట్ ఉన్నవారు తప్పక చూడండి సరికొత్త సర్వీస్

By Sabari
|

బ్యాంకుల్ని కస్టమర్లకు చేరువ చేస్తూ ఆదాయాన్ని పొందే మార్గం కల్పిస్తోంది బ్యాంక్ మిత్ర. చాలామందికి ఈ సర్వీస్ గురించి తెలియదు.

బ్యాంక్ మిత్రగా

బ్యాంక్ మిత్రగా

మీరు కూడా బ్యాంక్ మిత్రగా మారి నెలకు 30-40 వేలు సంపాదించొచ్చు. అసలు బ్యాంక్ మిత్ర ఏంటీ? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఏమేం సర్వీసులు అందించాల్సి ఉంటుంది? తెలుసుకోండి.

సింపుల్‌గా చెప్పాలంటే

సింపుల్‌గా చెప్పాలంటే

మీరు ఏ బ్యాంకుకైనా బ్యాంక్ మిత్ర కావొచ్చు. దీన్నే కస్టమర్ సర్వీస్ పాయింట్ అని కూడా అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే బ్యాంక్ మిత్ర మినీ బ్యాంకుగా పనిచేస్తారు. అంటే బ్యాంకులో లభించే సర్వీసుల్లో చాలావరకు బ్యాంక్ మిత్ర అందిస్తారు. బ్యాంకు నుంచి నెలనెలా జీతంతో పాటు ఖాతాదారులకు అందించే సర్వీసుల ఆధారంగా కమిషన్ లభిస్తుంది.

చాలా సేవలు

చాలా సేవలు

బ్యాంకు మిత్ర చాలా సేవలు అందిస్తారు. ఖాతా తెరవడం, నగదు జమ చేయడం, విత్‌డ్రా చేసుకోవడంతో పాటు వేర్వేరు ప్రభుత్వ స్కీమ్‌లను ప్రజలకు చేరువ చేసే బాధ్యత బ్యాంక్ మిత్రది.

ఎవరైనా బ్యాంక్ మిత్ర కావొచ్చు

ఎవరైనా బ్యాంక్ మిత్ర కావొచ్చు

ఎవరైనా బ్యాంక్ మిత్ర కావొచ్చు. వయస్సు 18 ఏళ్ల పైన ఉండాలి. కనీసం 10వ తరగతి పాస్ కావాలి. కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ తప్పనిసరి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అయితే అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్, 100 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ఉండాలి. సీఎస్పీ ఏర్పాటుకు లోన్ కూడా ఇస్తుంది బ్యాంకు.

 వెబ్‌సైట్‌లో

వెబ్‌సైట్‌లో

బ్యాంకు మిత్ర ఏర్పాటు గురించి బ్యాంకు వెబ్‌సైట్‌లో సమాచారం ఉంటుంది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు, రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ సైనికులు, రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు, కిరాణం, మెడికల్ షాప్ నిర్వాహకులు, ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలు లేదా బీమా కంపెనీల ఏజెంట్ల లాంటి వారెవరైనా బ్యాంక్ మిత్రగా మారొచ్చు. పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్ చూడండి. https://www.sbi.co.in/portal/web/agriculture-banking/business-correspondent-bc-ranrangement

కావాల్సిన పత్రాలు:

కావాల్సిన పత్రాలు:

ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కంటే ఇతర ప్రభుత్వ గుర్తింపు). నివాస ధృవపత్రం, వ్యాపారం నిర్వహించే చిరునామా, 10వ తరగతి మెమో, పోలీసుల నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌బుక్, క్యాన్సల్డ్ చెక్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి.

సేవలు:

సేవలు:

సేవింగ్స్ ఖాతా తెరవడం, లావాదేవీలు, ఆర్‌డీ, ఎఫ్‌డీ, ఓవర్‌డ్రాఫ్ట్ సేవ, కిసాన్ క్రెడిట్ సేవలు, ఇన్సూరెన్స్ సర్వీసులు, మ్యూచువల్ ఫండ్ అమ్మకాలు, పెన్షన్ అకౌంట్, అన్ని రకాల బిల్ చెల్లింపులు, టికెట్ బుకింగ్, పాన్ కార్డ్ సేవలు అందించొచ్చు.

Read more about: sbi
English summary

ఫ్లాష్ .. ఫ్లాష్ SBI అకౌంట్ ఉన్నవారు తప్పక చూడండి సరికొత్త సర్వీస్ | SBI Introduced New Bank Mitra Service to Customers

Bank Mitra provides a way to get revenue from customers to customers. Many people do not know about this service
Story first published: Thursday, July 19, 2018, 14:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X