For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ లో నయా వ్యాపార మోసం చూస్తే షాక్ !మీరే చూడండి.

By Sabari
|

వెయ్యి రూపాయల కరక్కాయలు కొనండి పొడి చేసి ఇస్తే రూ. 300 కమిషన్ నమ్మి లక్షలు పెట్టిన వినియోగదారులు రూ. 2 కోట్లతో ఉడాయించిన నిర్వాహకులు!

 పొడి చేసి

పొడి చేసి

ముందుగా వెయ్యి రూపాయలు పెట్టి కరక్కాయలు కొనుక్కోవాలి. వాటిని చేతితో దంచి మెత్తగా పొడి చేసి ఇస్తే 300 రూ. కమీషన్ కలిపి 1300 రూ. చెల్లిస్తారు. ఇందులో ఎటువంటి మోసం లేదు. ఎలాంటి వారైనా పని చేస్తున్నందుకు కమీషన్ ఇస్తున్నారని తేలిగ్గా నమ్మేస్తారు.

కుకట్‌పల్లి పరిధిలోని

కుకట్‌పల్లి పరిధిలోని

కుకట్‌పల్లి పరిధిలోని మహిళలు, గృహిణులు చాలామంది ఇలాగే నమ్మేశారు. 1500 మంది వినియోగదారులు చేరారు. వారి నుంచి సేకరించిన రూ. 2 కోట్ల రూపాయలతో ఉడాయించారు కంపెనీ నిర్వాహకులు. ఆకస్మాత్తుగా కంపెనీ మాయం కావడంతో ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు బాధితులు

 టీవీ ఛానెల్లో

టీవీ ఛానెల్లో

కేపీహెచ్‌బీ రోడ్డు నెం. 1లో ఎస్.ఐ.ఎమ్.టీ (సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీటూల్స్ ప్రైవేట్ లిమిటెడ్) పేరుతో ఈ ఏడాది మార్చి నెలలో ఓ కంపెనీ ప్రారంభమైంది. కంపెనీ తరుపున ఇంట్లో ఖాళీగా ఉండే గృహిణులకు, నిరుద్యోగులకు ఉద్యోగమిస్తామంటూ టీవీ ఛానెల్లో ప్రకటనలు ఇచ్చారు

కిలో కరక్కాయలు

కిలో కరక్కాయలు

కిలో కరక్కాయలు కొని, వాటిని చేతితో దంచి పొడి చేసి ఇస్తే రూ. 300 కమిషన్ చెల్లిస్తామని చెప్పారు. చేతితో దంచిన కరక్కాయ పొడులను ఆయుర్వేదంలో వైద్యం కోసం వాడతారని నమ్మబలికారు.

సంగారెడ్డి ప్రాంతానికి

సంగారెడ్డి ప్రాంతానికి

సంగారెడ్డి ప్రాంతానికి చెందిన బస్వరాజ్ ఈ పథకం ఎంతగానో నచ్చింది. అంతేకాకుండా మొదట్లో కరక్కాయలు పొడి చేసి ఇవ్వగానే కమిషన్‌తో పాటు డబ్బులు చెల్లించారు. భారీ మొత్తంలో కరక్కాయలు కొంటే కమిషన్ పెరుగుతుందని కంపెనీ ఆఫర్లు కూడా ప్రకటించింది. దాంతో కంపెనీని నమ్మిన బస్వరాజ్, అతని స్నేహితులతో కలిసి దాదాపు 40 లక్షల రూపాయల విలువ చేసి కరక్కాయలు కొన్నాడు.

సుమారు 1500

సుమారు 1500

ఇలా సుమారు 1500 మంది ఈ కంపెనీ కరక్కాయలను కొనుక్కున్నారు. ఒక్కొక్కరి నుంచి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా సేకరించినట్టు సమాచారం. ఐదు నెలల్లో వ్యాపారం బాగా విస్తరించింది. అయితే సోమవారం కంపెనీ బోర్డు తిప్పేసింది.

కంపెనీకి మేనేజర్‌

కంపెనీకి మేనేజర్‌

ఇన్నాళ్లు కంపెనీకి మేనేజర్‌గా ఉన్న ముప్పాల మల్లికార్జున్, కంపెనీ ఉద్యోగులకు ఫోన్ చేసి అనిల్ దేవరాజ్ అనే వ్యక్తి...కంపెనీ డబ్బు మొత్తం తీసుకెళ్లిపోయాడని చెప్పాడు. ఉద్యోగులందరూ ఫోన్లు స్వీచ్ఛాఫ్ చేయాలని సూచించాడు. కరక్కాయ పొడి తీసుకుని తమకు రావాల్సిన డబ్బు కోసం కంపెనీకి వచ్చిన వారికి కార్యాలయంలో ఉద్యోగులు సామాగ్రి సర్దుకుని వెళ్లిపోతుండడం కనబడింది.

 మోసపోయామని గ్రహించిన

మోసపోయామని గ్రహించిన

వెంటనే తాము మోసపోయామని గ్రహించిన 200 మంది వినియోగదారులు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేనేజర్ మల్లికార్జున్, ఎస్.ఐ.ఎమ్.టీ సంస్థ ఉద్యోగులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more about: business
English summary

హైదరాబాద్ లో నయా వ్యాపార మోసం చూస్తే షాక్ !మీరే చూడండి. | New harad Business 2 Crore Business Scam in Hyderabad

Buy a thousand rupees harad and pay Rs. Consumers who trust 300 commissions will get Rs. 2 crore coordinators
Story first published: Tuesday, July 17, 2018, 15:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X