For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు SBI కార్డు ఉందా? అయితే వీళ్లతో జర జాగ్రత్త ! మీరే చూడండి.

By Sabari
|

సైబ‌ర్ నేర‌గాళ్లు రోజురోజుకు మీరిపోతున్నారు. న‌కిలీ క్రెడిట్ కార్డుల సాయంతో దాదాపు రూ.5 కోట్ల మోసానికి పాల్ప‌డ్డారు.

ఎస్‌బీఐ

ఎస్‌బీఐ

ఎస్‌బీఐ పేరిట న‌కిలీ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.5 కోట్ల‌ను స్వాహా చేసిన బాగోతం న్యూఢిల్లీలో బ‌య‌ట‌ప‌డింది. బ్యాంకు ఖాతాదారుల కార్డుల‌తో మోసాల‌కు పాల్ప‌డుతున్న 30 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు

 సైబ‌ర్ క్రైమ్

సైబ‌ర్ క్రైమ్

దీని వ‌ల్ల దాదాపు 2000మంది ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులు మోస‌పోయార‌ని హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

న్యూఢిల్లీకి చెందిన

న్యూఢిల్లీకి చెందిన

న్యూఢిల్లీకి చెందిన విజ‌య్ కుమార్ శ‌ర్మ ను ఈ నేరంలో ప్ర‌ధాన నిందితుడిగా ఆరోపిస్తున్నారు. 38 ఏళ్ల విజ‌య్ న్యూఢిల్లీలో జీన్స్ మ్యాన్సుఫ్యాక్చ‌రింగ్ వ్యాపారం చేస్తున్నారు

హైద‌రాబాద్

హైద‌రాబాద్

అత‌డితో క‌లిసి మ‌రికొంద‌రు ఢిల్లీ వాసులు ఈ నేరంలో పాలుపంచుకున్నారు. సందీప్ బ‌జాజ్ అనే వ్య‌క్తి హైద‌రాబాద్ న‌గ‌రం రామ్‌గోపాల్ పేట్‌లో జ‌య‌శ్రీ డిస్ట్రిబ్యూట‌ర్స్ పేరుతో వ‌స్త్ర వ్యాపారం నిర్వ‌హించేవాడు.

క్రెడిట్ కార్డు మోసం

క్రెడిట్ కార్డు మోసం

వీళ్లిద్ద‌రూ 2017 జులైలో హైద‌రాబాద్‌లో క‌లుసుకున్నారు. క్రెడిట్ కార్డు మోసం ఎలా చేయాల‌నే దానిని గురించి విజయ్ సందీప్‌కు వివ‌రించారు. సందీప్ దాని ప‌ట్ల ఆశ‌ప‌డి తాను అలా చేసేందుకు ఒప్పుకున్నాడు

ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు దారుల‌కు

ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు దారుల‌కు

విజ‌య్ త‌నకు ప‌రిచయం ఉన్న వ్య‌క్తులైన అభిజిత్ శ్రీ‌వాత్స‌వ‌, సీతా కుమారి, అశుతోష్ శ్రీ‌వాత్స‌వ సాయంతో 22 మంది టెలికాల‌ర్ల‌ను నియ‌మించుకున్నారు. వీళ్లంతా క‌లిసి ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు దారుల‌కు సంబంధించిన పేర్లు, మొబైల్ నంబ‌ర్లు, ఏ న‌గ‌రంలో నివ‌సిస్తున్నారు అనే వివ‌రాల‌ను క‌లెక్ట్ చేశారు.

పోలీసుల ద‌ర్యాప్తులో

పోలీసుల ద‌ర్యాప్తులో

వీరంతా జ‌ట్టుగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు కాల్ సెంట‌ర్ పేరిట టెలికాలర్స్ ఫోన్లు చేసి క్రెడిట్ కార్డుల వివ‌రాలు, ఓటీపీ సేక‌రించి డ‌బ్బు డ్రా చేశార‌ని పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది.

80 ల‌క్ష‌ల న‌గ‌దు

80 ల‌క్ష‌ల న‌గ‌దు

ఈ మోసం వెలుగులోకి రావ‌డానికి న్యూఢిల్లీ పోలీసుల‌తో పాటు హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు చాలా లోతైన విచార‌ణ జ‌రిపారు. నిందితుల నుంచి 80 ల‌క్ష‌ల న‌గ‌దు, హుందాయ్ క్రెటా కారును స్వాధీనం చేసుకున్నారు.

Read more about: credit card
English summary

మీకు SBI కార్డు ఉందా? అయితే వీళ్లతో జర జాగ్రత్త ! మీరే చూడండి. | Rs.5 Crores Fraud With Credit Cards

Cyber ​​criminals are turning up for the day. Fraudulent credit cards, fraudulent Rs 5 crore fraud
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X