For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లాష్ ఫ్లాష్..ఈ సారి తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఒప్పకున్న కెటిఆర్!

By Sabari
|

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంక్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) ప్రకటించిన తాజా జాబితాలో ఆంధ్రప్రదేశ్‌‌కు ఫస్ట్ ర్యాంక్ దక్కింది.

గత ఏడాది

గత ఏడాది

గత ఏడాది ప్రకటించిన జాబితాలో తెలంగాణతో కలసి ఏపీ తొలిస్థానంలో ఉండేది. ఈ సారి ఏపీ ఒక్కటే తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణ (2), హర్యానా (3), జార్ఖండ్ (4) స్థానం దక్కించుకున్నాయి

ఈ సారి

ఈ సారి

ఈ సారి ఏపీ ఒక్కటే తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణ (2), హర్యానా (3), జార్ఖండ్ (4) స్థానం దక్కించుకున్నాయి. 2015 నుంచి వరుసగా మూడేళ్లపాటు మొదటిస్థానంలో కొనసాగిన గుజరాత్, గత ఏడాది మూడోస్థానానికి పరిమితమైంది.

అన్నిటికంటే చివరగా

అన్నిటికంటే చివరగా

ఈ ఏడాది ఆ స్థానం మరింత దిగజారి ఐదో ప్లేస్‌కి పడిపోయింది. ఛత్తీస్‌గఢ్ (6), మధ్యప్రదేశ్ (7), కర్ణాటక (8), రాజస్థాన్ (9), పశ్చిమ బెంగాల్ (10) స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ 23వ స్థానంలో నిలిస్తే, మేఘాలయకు అన్నిటికంటే చివరగా 36 ప్లేస్ దక్కింది. లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్ కూడా కింది వరుసలో నిలిచాయి.

రమేష్ అభిషేక్

రమేష్ అభిషేక్

ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు కిందిస్థాయికి చేరాయా అనే కోణంలో వ్యాపారవర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ర్యాంకులు నిర్ణయించినట్టు డీఐపీపీ సెక్రటరీ రమేష్ అభిషేక్ తెలిపారు.

వచ్చే ఏడాదికి

వచ్చే ఏడాదికి

వచ్చే ఏడాదికి మరింత మెరుగ్గా ఫీడ్ బ్యాక్ సంపాదిస్తామని చెప్పారు. కేంద్రం సంస్కరణలతో దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాపార సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు

ఆర్థిక వ్యవస్థ

ఆర్థిక వ్యవస్థ

సులభతర వాణిజ్యానికి బాటలు వేస్తూ.. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నట్టు చెప్పారు. రాష్ట్రాల మధ్య పోటీతో రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని లెక్కలు వేస్తున్నారు.

 రాకేష్ భారతి

రాకేష్ భారతి

ఇలాంటి ర్యాంకుల వల్ల రాష్ట్రాల మధ్య పోటీ తత్వం పెరుగుతుందని, మరిన్ని వ్యాపార అవకాశాలు, వసతులు, వనరులు సృష్టించేందుకు అవకాశం దొరుకుతుందని సీఐఐ అధ్యక్షుడు రాకేష్ భారతి మిట్టల్ అన్నారు

 దేశం అభివృద్ధి

దేశం అభివృద్ధి

దాని వల్ల దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్రాల్లో సంస్కరణలు అమలు కావడం, పెట్టుబడుల ఆకర్షణతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ స్థానం కూడా మెరుగుపడింది.

కేటీఆర్

మరోవైపు తృటిలో మొదటిస్థానం కోల్పోయామని, ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు అభినందనలు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు

లోకేష్

దీనికి లోకేష్ కూడా హుందాగా స్పందించారు. ఒకటి, రెండు ఏంలేదు. తెలుగు రాష్ట్రాలే టాప్‌లో ఉన్నాయి. అంతా తెలుగువారి మంచికోసమే అంటూ రీ ట్వీట్ చేశారు.

Read more about: andhra pradesh telangana
English summary

ఫ్లాష్ ఫ్లాష్..ఈ సారి తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఒప్పకున్న కెటిఆర్! | Andhra Pradesh is Number One in Ease of Doing Business and Telangana Number two

Andhra Pradesh is at the top of the is doing business. Andhra Pradesh is ranked first in the latest list announced by World Bank, Department of Industrial Policy and Promotion (DIPP).
Story first published: Wednesday, July 11, 2018, 12:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X