For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి అనుకుంటున్న వారు తప్పక చూడండి.

By Sabari
|

జూలై 31 లోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. గడువు ముంచుకొస్తోంది. అయితే ఏమాత్రం కంగారుపడకుండా ఆన్‌లైన్‌లో కూడా ఐటీ రిటర్న్ మీరే ఫైల్ చేయొచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ www.incometaxindiaefiling.gov.in ఉపయోగించుకోవచ్చు.

ఐటీ రిటర్న్స్

ఐటీ రిటర్న్స్

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి రోజు. అయితే ఇప్పటికీ ట్యాక్స్ పేయర్స్‌కు ఇంకా చాలా అనుమానాలున్నాయి. అసలు ఆన్‌లైన్‌‍‌లో ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలన్నది పెద్ద సందేహం

 ఆన్‌లైన్‌లో

ఆన్‌లైన్‌లో

నిజం చెప్పాలంటే అది చాలా సులువైన విషయం. మధ్యవర్తులపై ఆధారపడకుండా ఎవరికి వారు ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. అయితే ఇందుకోసం కావాల్సిన డాక్యుమెంట్స్, ఆధార్, పాన్ కార్డ్, ఫామ్16, పెట్టుబడుల వివరాలు, అద్దె రసీదులు, పిల్లల ట్యూషన్ ఫీజ్ వివరాలు అన్నీ పక్కాగా ఉంటే చాలు.ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు.

స్టెప్ 1: ఐటీఆర్‌ కోసం సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు.

స్టెప్ 1: ఐటీఆర్‌ కోసం సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు.

  • పాన్ కార్డ్
  • ఆధార్ కార్డ్
  • బ్యాంకు అకౌంట్ వివరాలు
  • ఫామ్ 16
  • ఎల్ఐసీ, పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, ఎన్‌పీఎస్, హెల్త్ ఇన్స్యూరెన్స్ లాంటి పెట్టుబడుల వివరాలు
  • ట్యూషన్ ఫీజు రసీదులు (ఇద్దరు పిల్లల వరకు)
  • ఇంటి అద్దె రసీదులు
  • హోమ్ లోన్ వివరాలు, లోన్ సర్టిఫికెట్లు
  • వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల రసీదులు
  • విరాళాలు
  • స్టెప్ 2: www.incometaxindiaefiling.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలి.

    స్టెప్ 2: www.incometaxindiaefiling.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలి.

    • న్యూ టు ఇ-ఫైలింగ్‌పై క్లిక్ చేయాలి.
    • వ్యక్తిగతం/హిందూ అవిభాజ్య కుటుంబం లాంటి ఆప్షన్లలో ఒక యూజర్ టైప్ ఎంచుకోవాలి.
    • సర్‌నేమ్, మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్, పాన్, పుట్టిన తేదీ లాంటి వివరాలన్నీ నమోదు చేయాలి.
    • రిజిస్ట్రేషన్ ఫామ్ మొత్తం పూర్తి చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
    • మీరు విజయవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడీకి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తుంది.
    • స్టెప్ 3: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ 2018 ఇ-ఫైలింగ్.

      స్టెప్ 3: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ 2018 ఇ-ఫైలింగ్.

      • యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, కాప్చా కోడ్ ఎంటర్ చేసి https://incometaxindiaefiling.gov.in/ లో లాగిన్ కావాలి.
      • "ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఐటీఆర్ ఆన్‌లైన్‌"పై క్లిక్ చేయాలి.
      • ఐటీఆర్ 1 ఫామ్(సహజ్ ఫామ్): మీరు వ్యక్తిగతంగా ఫైల్ చేస్తే వేతనం, పెన్షన్, కుటుంబ పెన్షన్, లాటరీ, వడ్డీ, ఇతర మార్గాల్లో రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తే ఈ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి.
      • 4. ఈ వివరాలు నమోదు చేయండి:

        4. ఈ వివరాలు నమోదు చేయండి:

        • Part A - సాధారణ సమాచారం
        • Part B - స్థూల ఆదాయం మొత్తం
        • Part C - పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం
        • Part D - చెల్లించాల్సిన పన్ను లెక్కింపు
        • Part E - ఇతర సమాచారంSchedule IT - అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ చెల్లింపులు
        • Schedule TDS - టీడీఎస్/టీసీఎస్ వివరాలు

        ఇ-ఫైలింగ్ కోసం

        ఇ-ఫైలింగ్ కోసం

        2017-2018 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్ ఇ-ఫైలింగ్ కోసం డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్(డీఎస్‌సీ) అప్‌లోడ్ చేయాలి. లేదా మీ దగ్గర డీఎస్‌సీ లేకపోతే ఐటీఆర్-వీ ఫామ్ ప్రింట్ తీసుకొని సంతకం చేసి ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్-బెంగళూరుకు ఇ-ఫైలింగ్ చేసిన 120 రోజుల్లో పంపాలి.

         ఒకవేళ రీఫండ్

        ఒకవేళ రీఫండ్

        • ఒకవేళ రీఫండ్ ఉంటే ఆ వివరాలు మీ అడ్రస్‌కు వస్తాయి.
        • ఒకవేళ పన్ను చెల్లించాల్సి ఉంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్(tin)లో డెబిట్ కార్డ్ లేదా నెట్‌ బ్యాంకింగ్ ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయాలి.
        • మీ దగ్గర డాక్యుమెంట్స్, వివరాలన్నీ ఉంటే ఇలా సులువుగా www.incometaxindiaefiling.gov.in.వెబ్‌సైట్‌లో ఐటీఆర్ ఇ-ఫైలింగ్ చేయొచ్చు.

Read more about: income tax
English summary

ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి అనుకుంటున్న వారు తప్పక చూడండి. | How to File IT Returns Before June 31

IT returns should be filed by July 31. Deadlines But you can even file IT returns online without worrying. Income Tax Department e-Filing website www.incometaxindiaefiling.gov.in can be used.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X