For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక పై మీరు రైల్లో తినేవి ఎలా చేస్తున్నారో మీరు చూడచ్చు ఎలాగో తెలుసా?

|

రైలులో మీకు అందించే ఆహారాన్ని ఐఆర్‌సీటీసీ ఎలా వండుతుందో ఇక తెలుసుకోవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయడంతో పాటు క్యాంటీన్‌లో ఉన్న సీసీ కెమెరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అనుసంధానించింది ఐఆర్‌సీటీసీ. అక్కడ పరిశుభ్రతను పాటించకపోతే చర్యలు తీసుకోనుంది.

ఇండియన్ రైల్వే

ఇండియన్ రైల్వే

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) లైవ్ స్ట్రీమింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. తమకు రైలులో అందించే ఆహారాన్ని ఎలా వండుతున్నారు? ఎలా ప్యాక్ చేస్తున్నారన్న విషయాన్ని ప్రయాణికులు లైవ్‌లో చూడొచ్చు.

 పీయూష్ గోయల్

పీయూష్ గోయల్

ఇటీవల రివ్యూ మీటింగ్‌లో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన ఆదేశాలతో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఐఆర్‌సీటీసీ, రైల్వే బోర్డ్ ఛైర్మన్ అశ్వనీ లోహని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించారు.

నిబంధనలు

నిబంధనలు

నిబంధనలు అతిక్రమించినా, పరిశుభ్రత పాటించకపోయినా గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సాయంతో విశ్లేషిస్తోంది ఐఆర్‌సీటీసీ. వోబోట్ అనే కంపెనీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను డెవలప్ చేసింది.

కిచెన్

కిచెన్

నోయిడాలోని ఐఆర్‌సీటీసీ సెంట్రల్ కిచెన్‌లో ఆహారం తయారీని లోహని పరిశీలించారు. న్యూ ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్లే శతాబ్ది, రాజధాని, దురంతో లాంటి 17 ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో 10,000 మీల్స్‌ను ఈ కిచెన్ నుంచే డెలివరీ చేస్తారు.

ఐఆర్‌సీటీసీ కేటరింగ్

ఐఆర్‌సీటీసీ కేటరింగ్

ఐఆర్‌సీటీసీ కేటరింగ్ ఆపరేషన్స్ చూసుకునేందుకు ప్రత్యేకంగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉందన్నారాయన. అలాంటి ఏర్పాట్లు ఎయిర్‌లైన్ కేటరింగ్ సెక్టార్‌లో కూడా లేవన్నారు.

ఐఆర్‌సీటీసీ

ఐఆర్‌సీటీసీ

ఐఆర్‌సీటీసీ కిచెన్లలో వండే వంటకాల నాణ్యతపై ప్రజల్లో నమ్మకాన్ని, పారదర్శకతను పెంచేందుకు లైవ్ స్ట్రీమింగ్ కొనసాగిస్తాం. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోని గ్యాలరీ లింక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు అని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.

Read more about: irctc
English summary

ఇక పై మీరు రైల్లో తినేవి ఎలా చేస్తున్నారో మీరు చూడచ్చు ఎలాగో తెలుసా? | Now You Can See How Railways Cooks Food For You? Now You Can See it Live

The food you provide on the train can now learn how the IRCTICE will cook. IRCTC connects artificial intelligence to live cinematic cameras in addition to live streaming. If there is no cleanliness, actions will be taken.
Story first published: Saturday, July 7, 2018, 12:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X