For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుష్మస్వరాజ్ ప్రయత్నం సూపర్ హిట్.. అసలు ఏంటి ఆ ప్రయత్నం? మీరే చూడండి.

By Sabari
|

కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ ఇటీవల ప్రారంభించిన పాస్‌పోర్ట్‌ సేవా మొబైల్‌ యాప్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.

ఈ యాప్‌

ఈ యాప్‌

ఈ యాప్‌ ప్రారంభించిన రెండు రోజుల్లోనే లక్ష మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ విషయాన్ని సుష్మ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

ఎక్కడినుంచైనా

ఎక్కడినుంచైనా

ఈ యాప్‌ ద్వారా దేశంలో ఎక్కడినుంచైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సుష్మ తెలిపారు. జూన్ 26న ఆరో 'పాస్‌పోర్ట్‌ సేవా దివస్‌'ను పురస్కరించుకుని సుష్మ ఈ యాప్‌ను ప్రారంభించారు.

ఈశాన్య ప్రాంతంలో

ఈశాన్య ప్రాంతంలో

ఈ యాప్‌ ద్వారా వలసదారులు తమ స్వస్థలాల నుంచే పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉంది. ఇప్పటివరకు ఈశాన్య ప్రాంతంలో గువాహటిలో మాత్రమే పాస్‌పోర్టు కార్యాలయం ఉంది.

కొత్త పాస్‌పోర్టు కేంద్రాలు

కొత్త పాస్‌పోర్టు కేంద్రాలు

ఇప్పుడు కొత్త పాస్‌పోర్టు కేంద్రాలు ఈ ప్రాంతంలో పనిచేయనున్నాయని సుష్మ వెల్లడించారు. గత రెండు దశల్లో 251 పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్ కేంద్రాలను ప్రకటించాం.

 మూడో దశలో

మూడో దశలో

వాటిలో 212 ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మూడో దశలో మరో 38 రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నట్లు ఆమె తెలిపారు.

ఇప్పటివరకు

ఇప్పటివరకు

ఇప్పటివరకు 260 వర్కింగ్ పాస్‌పోర్టు కేంద్రాలు ఉండగా, లోక్‌సభ నియోజవర్గ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా ఏఏ ప్రాంతాల్లో పాస్‌పోర్టు కార్యాలయాలను ఏర్పాటు చేయాలో అధికారులు, విదేశాంగ శాఖ జాబితా తయారు చేస్తోందని తెలిపారు.

ఈ విధానం కింద

ఈ విధానం కింద

ఈ విధానం కింద పాస్‌పోర్ట్‌ దరఖాస్తు సమర్పించేందుకు రీజినల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం(ఆర్‌పీఓ), పాస్‌పోర్ట్‌ సేవా కేంద్ర(పీఎస్‌కే) లేదా పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్ర(పీఓపీఎస్‌కే)లలో దేన్నైనా ఎంచుకోవచ్చు.

 నివాస స్థలం

నివాస స్థలం

ఎంచుకున్న ఆర్‌పీఓ పరిధిలో దరఖాస్తుదారుడి నివాస స్థలం లేకున్నా కూడా అప్లికేషన్‌ పంపొచ్చు.

దరఖాస్తు ఫారంలో

దరఖాస్తు ఫారంలో

దరఖాస్తు ఫారంలో పేర్కొన్న చిరునామాలోనే పోలీసు ధ్రువీకరణ జరుగుతుంది. పాస్‌పోర్టు మంజూరు అయిన తరువాత.. సదరు ఆర్‌పీఓనే దరఖాస్తులోని చిరునామాకు దాన్ని పంపుతుంది

Read more about: passport
English summary

సుష్మస్వరాజ్ ప్రయత్నం సూపర్ హిట్.. అసలు ఏంటి ఆ ప్రయత్నం? మీరే చూడండి. | Sushmaswaraj Introduced Passport App Super Hit

recently launched Passport Service Mobile App has been receiving great support from Union Minister Sushma Swaraj.
Story first published: Saturday, June 30, 2018, 8:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X