For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైల్వే రిజర్వేషన్ టికెట్ పై భారీ మార్పులు ఏంటో చూడండి.

By Sabari
|

ఆన్‌లైన్‌లో రైలు టికెట్‌ బుక్‌ చేసుకుంటున్నారా.. అయితే ఒక్క నిమిషం! రైల్వే టికెట్ల రిజర్వేషన్ల నిబంధనల్లో ఐఆర్‌సీటీసీ పలు మార్పులు తీసుకొచ్చింది.

కొత్త నిబంధనల ప్రకారం

కొత్త నిబంధనల ప్రకారం

ఈ కొత్త నిబంధనల ప్రకారం ఒక వినియోగదారుడు ఒక ఐడీ మీద నెలకు ఆరు టికెట్లు మాత్రమే బుక్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ వెరిఫై చేసి ఉంటే నెలకు 12 టికెట్ల వరకు బుక్‌ చేసుకునే వీలుంటుంది.

ఐఆర్‌సీటీసీలో

ఐఆర్‌సీటీసీలో

ప్రయాణ తేదీకి 120 రోజుల ముందుగానే ఈ టికెట్లు బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఇకపై ఐఆర్‌సీటీసీలో లాగిన్‌ అయి నిదానంగా టికెట్‌ బుక్‌ చేయడం కుదరదు. ఎందుకంటే.. రైళ్లలో ఖాళీలు చూసుకొని.. టికెట్‌ బుక్‌ చేసుకోవడానికి కేవలం 25 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది.

టికెట్‌ బుక్‌

టికెట్‌ బుక్‌

పేమెంట్‌ చేయడానికి మరో ఐదు సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది.ఈలోగానే టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

టికెట్‌ బుకింగ్‌కు సంబంధించిన మరిన్ని నిబంధనలు:

టికెట్‌ బుకింగ్‌కు సంబంధించిన మరిన్ని నిబంధనలు:

ఏసీ అయితే ఉదయం 10 గంటలకు, స్లీపర్‌ క్లాస్‌ అయితే 11 గంటలకు తత్కాల్‌ బుకింగ్‌ ప్రారంభమవుతుంది. ఉదయం 10-12 గంటల మధ్యలో ఒక యూజర్‌ ఐడీపై రెండు టికెట్లు మాత్రమే పొందవచ్చు.

నిబంధన 2

నిబంధన 2

ప్రత్యేక సమయాల్లో మాత్రం 2 స్టేషన్ల మధ్య దూరాన్ని బట్టి ఒక ఐడీ మీద 6 బెర్తులు/టికెట్లు తత్కాల్‌లో బుక్‌ చేసుకునే అవకాశం ఉంది.

నిబంధన 3

నిబంధన 3

తిరుగు ప్రయాణం మినహాయించి ఒక సెషన్‌లో ఒక తత్కాల్‌ టికెట్‌ మాత్రమే బుక్‌ చేసుకోవచ్చు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్విక్‌బుక్‌ సర్వీస్‌ అందుబాటులో ఉండదు

నిబంధన 4

నిబంధన 4

ఉదయం 8-8.30 గంటలు, ఉదయం 10-10.30గంటలు, ఉదయం 11-11.30గంటల మధ్య మాత్రమే ఏజెంట్లు టికెట్లు బుక్‌ చేయాలి. ఇక తత్కాల్‌ రిజర్వేషన్‌ ప్రారంభమైన 30 నిమిషాల వరకు వారికి బుకింగ్‌కు అనుమతి ఉండదు.

నిబంధన 5

నిబంధన 5

నిర్దేశించిన సమయం కన్నా 3 గంటలు ఆలస్యంగా బయలుదేరినా, రైలు మార్గాలు మళ్లించినా ప్రయాణికుడికి పూర్తి చార్జీలు తిరిగి ఇస్తారు. ఫస్ట్‌ క్లాసులో టికెట్‌ బుక్‌ చేసుకుని సెకండ్‌ క్లాస్‌ లేదా జనరల్‌లోకి మార్చుకుంటే చార్జీల మధ్య ఉన్న తేడాను తిరిగి ఇస్తారు.

నిబంధన 6

నిబంధన 6

అలాగే ఒక పేరు మీద బుక్‌ చేసుకున్న టికెట్‌ను మరొకరి పేరు మీదకు మార్చుకునే అవకాశం రైల్వే కల్పించింది. రైలు ప్రయాణానికి 24 గంటల ముందు

చీఫ్‌ రిజర్వేషన్‌ సూపర్‌వైజర్స్‌ అనుమతితో తమ కుటుంబ సభ్యుల పేరు మీదకు ఆ టికెట్‌ మార్చుకోవచ్చు.

Read more about: railway irctc
English summary

రైల్వే రిజర్వేషన్ టికెట్ పై భారీ మార్పులు ఏంటో చూడండి. | New Changes in Railway Ticket Reservation

Are you booking a train ticket online .. But wait a minute! The IRCTC has made many changes in the reservation rules for railway ticket
Story first published: Friday, June 22, 2018, 10:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X