For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీ రేట్లు పెంచిన ఆ రెండు బ్యాంకులు మీరే చూడండి.

By Sabari
|

చాలా మంది రుణ గ్ర‌హీత‌ల‌కు వాహ‌న‌, గృహ రుణాలు ప్రియం కానున్నాయి. భారత రిజర్వు బ్యాంకు రెపో రేటును పెంచిన మరుసటి రోజే మరికొన్ని బ్యాంకులు తమ రుణాలపై వడ్డీ రేట్లను పెంచేశాయి.

బ్యాంకులు

బ్యాంకులు

ఇండియన్‌ బ్యాంక్‌, కరూర్‌ వైశ్యా బ్యాంకులు నిధుల సమీకరణ వ్యవ ఆధారిత రుణ వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 0.10 శాతం వరకు పెంచుతున్నట్లు వెల్లడించాయి. దీంతో ఎంసీఎల్‌ఆర్‌తో సంబంధం ఉన్న ఆటో, గృహ, వ్యాపార రుణాల నెలవారీ వాయిదాలు మరింతగా పెరుగుతాయి.

ఐదేళ్ల కాలపరిమితి

ఐదేళ్ల కాలపరిమితి

ఇండియన్‌ బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ను మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితి గల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 0.10 శాతం పెంచింది. కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ఆరు నెలలు, ఏడాది కాల పరిమితి రుణాలపై ఇదే స్థాయిలో ఎంసీఎల్‌ఆర్‌ను పెంచినట్లు తెలిపింది.

 రెపో రేటు

రెపో రేటు

వడ్డీ రేట్లను పెంచనున్నట్టు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర సంకేతాలు ఇచ్చింది. ఆర్‌బీఐ రెపో రేటును పెంచడానికి ముందే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ), ఐసిఐసిఐ బ్యాంక్‌, హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంక్‌లు తమ వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే.

 తాజాగా వడ్డీ రేట్లను

తాజాగా వడ్డీ రేట్లను

ఇదే బాటలో మరికొన్ని బ్యాంకులు తాజాగా వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం మేర పెంచిన నేపథ్యంలో ఇతర బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను పెంచడానికి అవకాశం ఉందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Read more about: banks
English summary

వడ్డీ రేట్లు పెంచిన ఆ రెండు బ్యాంకులు మీరే చూడండి. | Indian Bank and Karur Vsya Bank hike lending Rates

Most loan recipients are going to be expensive for home and housing loans. The next day after the Reserve Bank of India raised the rate of repo rate, some banks raised interest rates on their loans
Story first published: Friday, June 8, 2018, 11:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X