For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడులు తెరవబోతున్నారు,కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు తెలిస్తే షాక్?

ఒకప్పుడు పిల్లలని బడికి పంపాలంటే ఫీజు గురించి ఎక్కువ ఆలోచన ఉండేది కాదు,మహా అయితే ఒక సంవత్సరానికి మూడు వేల నుండి ఆరు వేలు లోపు ఉండేది,పదవ తరగతికి ఒక ఎనిమిది వేలు ఉండేది.

|

ఒకప్పుడు పిల్లలని బడికి పంపాలంటే ఫీజు గురించి ఎక్కువ ఆలోచన ఉండేది కాదు,మహా అయితే ఒక సంవత్సరానికి మూడు వేల నుండి ఆరు వేలు లోపు ఉండేది,పదవ తరగతికి ఒక ఎనిమిది వేలు ఉండేది,కానీ ఎప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్ళు ఇష్టారాజ్యంగా ఫీజులు వాసులు చేస్తూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాయి.

కార్పొరేట్ స్కూళ్ళు:

కార్పొరేట్ స్కూళ్ళు:

ప్రస్తుతం ఎక్కడ చూసిన కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతున్నాయి,ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రుల నాడి తెలుసుకొని ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటున్నారు.తమ స్కూల్ లో చదివిన విద్యార్థులకు రాష్ట్ర ర్యంకులు కాయం అని బాగా నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులచే భోదన ఉంటుందని చక్కగా ఇంగ్లిష్ లో మాట్లాడం నేర్పిస్తాం అని చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు.

విద్య ఒక వ్యాపారం:

విద్య ఒక వ్యాపారం:

ప్రస్తుతం విద్య ఒక పెద్ద వ్యాపారం లాగ తయారైనది,తల్లిదండ్రులలో ఆంగ్ల మాధ్యమిక ప్రైవేట్ పాఠశాలలపై వ్యామోహాన్ని పెంచడం,ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు తల్లిదండ్రుల నుండి ట్యూషన్ రుసుము, ప్రవేశ రుసుము,పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు మరియు ఇతర కారణాలు చెప్పి అధిక మొత్తం లో డబ్బు గుంజుతున్నారు.

మధ్య తరగతి కుటుంబాలు:

మధ్య తరగతి కుటుంబాలు:

నగరాల్లో ముఖ్యంగా మధ్యతరగతి మరియు దిగువ-మధ్యతరగతి వర్గానికి చెందిన వేలాదిమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఎందుకంటే పాఠశాలలు నిర్దేశించిన అన్యాయ రుసుమును చెల్లించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వారి నెల సరి సంపాదన మొత్తం పిల్లల ఫీజులు కట్టడానికే సరిపోనుందని వాపోతున్నారు.

ఫీజులు ఈవిదంగా ఉన్నాయి:

ఫీజులు ఈవిదంగా ఉన్నాయి:

ప్రైవేట్ పాఠశాలకు ఫీజు రూ. 20,000 నుండి రూ .40,000 దాక వసూలు చేస్తున్నాయి.

ప్రాధమిక పాఠశాలకు కూడా, పాఠశాల యొక్క ఖ్యాతిని బట్టి రుసుము రూ .10,000 నుండి రూ .20,000 వేల దాక వాసులు చేస్తున్నారు.

ప్రైవేటు,ప్రభుత్వ స్కూళ్ల నిష్పత్తి:

ప్రైవేటు,ప్రభుత్వ స్కూళ్ల నిష్పత్తి:

ప్రైవేట్ పాఠశాలలు గురువులు మరియు విద్యార్థులు నిష్పత్తి 1:30 కాగా, ప్రభుత్వ పాఠశాలల నిష్పత్తి 1:20 గా ఉంది అంటే ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో తెలుసా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు తమ పిల్లలు ప్రైవేట్ స్కూల్ లో చదవాలని చక్కగా ఇంగ్లిష్ లో మాట్లాడాలని మరియు నాణ్యమైన విద్య ప్రైవేట్ స్కూల్ లోనే ఉంటుందని వారి నమ్మకం,ఇదే అదనుగా చోసుకొని ప్రైవేటు యాజమాన్యం ముక్కు పిండి మరి అధిక ఫీజులు వాసులు చేస్తున్నారు.

సదుపాయాలు:

సదుపాయాలు:

కార్పరేట్ పాఠశాలల్లో ఉన్నత పాఠశాల విద్యార్థుల ఫీజు నిర్మాణం రూ. 20,000 నుంచి రూ .45,000 వరకు ఉంటుంది. ప్లేగ్రౌండ్, ప్రయోగశాల మరియు అర్హతగల సిబ్బంది వంటి ప్రాథమిక సదుపాయాలు లేని చిన్న పాఠశాలలు కూడా అత్యధిక మొత్తంలో రుసుము డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు LKG మరియు UKG తరగతులకు రూ .10,000 కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి.

విజయవాడ:

విజయవాడ:

విజయవాడలో మరియు చుట్టుపక్కల నగరాల్లో సుమారు ఒక లక్ష మందికి పైగా విద్యార్థులు 270 ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తుంన్నారు,కానీ 150 ZP ప్రభుత్వ పాఠశాల్లో మాత్రం కేవలం 40 ,000 మంది మాత్రమే ప్రతి ఏటా విద్యనభ్యసిస్తున్నారని విజయవాడ అర్బన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కె.రవి కుమార్ అన్నారు.రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పాఠశాల విద్య కోసం ప్రభుత్వం రూ .20,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తోందన్నారు.

మెరుగైన విద్య:

మెరుగైన విద్య:

రాష్ట్రంలో ఉన్న పిల్లలకు నాణ్యమైన విద్యను అందజేయడానికి మంచి అర్హతగల మెరిట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించనున్నట్లు రవి కుమార్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలలతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఒత్తిడి లేని వాతావరణంలో చదువుకుంటున్నారన్నారు.

ఆలోచనలో మార్పు:

ఆలోచనలో మార్పు:

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినప్పటి నుండి తల్లిదండ్రుల ఆలోచనల్లో కొంత మార్పు కన్పిస్తోంది.ముక్యంగా మధ్య తరగతి మరియు దిగువున ఉన్న ప్రజలకు ఇది ఎంతో ఊరట నిచ్చిందని చెప్పవచ్చు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

Read more about: schools fees
English summary

బడులు తెరవబోతున్నారు,కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు తెలిస్తే షాక్? | Corporate Schools Fleecing Parents In Many Ways

Taking advantage of the craze for English medium private schools among the parents, managements of private schools are fleecing the parents in the name of tuition fee, admission fee, books, uniforms and so on. Thousands of parents particularly belonging to middle-class and lower-middle class in city are suffering because they are not able to pay the exorbitant fee prescribed by the schools.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X