For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవలం 70 రోజుల్లో 21 లక్షలు సంపాదించిన సామాన్య వ్యక్తి.. ఆ చిట్కా ఏంటో మనము చూసేదామా?

నెలకు నాలుగు వేలు జీతం తీసుకుంటున్న ఉద్యోగి నుండి నాలుగు లక్షలు సంపాదించే వాళ్ళ దాక చిన్న కష్టం వచ్చినా పని భారం ఎక్కువైనా లేక ప్రమోషన్లు రాకపోయినా ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా జీతాలు పెంచకపోయిన.

|

నెలకు నాలుగు వేలు జీతం తీసుకుంటున్న ఉద్యోగి నుండి నాలుగు లక్షలు సంపాదించే వాళ్ళ దాక చిన్న కష్టం వచ్చినా పని భారం ఎక్కువైనా లేక ప్రమోషన్లు రాకపోయినా ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా జీతాలు పెంచకపోయిన ఉద్యమాల బాట పడతారు,సమ్మె చేస్తారు అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి వంట వార్పూ చేస్తారు వ్యవస్థను స్థంబింపచేస్తాడు దింతో ప్రభుత్వాలు దిగిరాక తప్పదు మరియు వాళ్ళ డిమాండ్లు తీర్చక తప్పదు కానీ ఇలాంటి నిరసనలు చేయకుండా ఎంత కష్టం వచ్చిన వ్యవసాయం వదలకుండా ఎండలకు వానలకు ఎదురు నిలిచి మరి కష్ట పడతారు రైతులు.

రైతులు:

రైతులు:

మనకు తెలుసు రైతు లేనిదే రాజ్యం లేదు,రైతుల కంట నీరు తెప్పించిన అనేక ప్రభుత్వాలు మట్టి కరిచాయి దేశానికి ప్రధాన మంత్రి అవసరం ఉందొ లేదో కానీ రైతు మాత్రం దేశానికి చాల అవసరం ఎందుకంటే రైతు లేనిదే మానవ మనుగడే లేదు ఈ రోజు దేశాలు ఇలా ఉన్నాయి అంటే రైతే కారణం కానీ అటువంటి రైతులను పట్టించుకునే నాదులే కరువయ్యారు.

రైతుల తల రాతలు:

రైతుల తల రాతలు:

ఎన్ని ప్రభుత్వాలు మారిన రైతుల తల రాతలు మారడం లేదు ఆత్మహత్యలు ఆగడం లేదు.పగలు రాత్రి అని తేడా లేకుండ 24 గంటలు శ్రమించి పంట పండించి మన కడుపులు నింపుతున్న రైతులు సమాజం కోసమే వాళ్ళ జీవితాలను అర్పిస్తున్న వారి గోడు ఎవరు పట్టించుకోడం లేదు.

పంటకి గిట్టుబాటు ధర:

పంటకి గిట్టుబాటు ధర:

అసలు రైతులు అడుగుతున్న దేంటి,వారు కష్టించి పండించిన పంటకి గిట్టుబాటు ధర,తాము పండించిన పండించిన పంటకు నష్టం వాటిల్లకుండా మద్దతు ధర కల్పించందయ్య అని వేడుకుంటున్నా పాటించుకున్న పాపాన పోలేదు.తాము కష్టించి,శ్రమించి పండించిన పంటకు తామే ధరను నిర్ణయిన్చేలా ఒక కొత్త చట్టం తీసుకురావాలని రైతులు మొరపెట్టుకుంటున్న ఎవ్వరూ వినడం లేదు.రైతుల ఆవేదనను ఆలకించే నాధుడే లేడు.

రైతులు వలస:

రైతులు వలస:

దేశం లోని రైతులంతా ఉంటే ఉంటాం లేదంటే పోతాం అనే నిర్ణయానికి వస్తే తప్ప ప్రభుత్వాలు పట్టించుకోవేమో.ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉందంటే ఎకరాల భూములు ఉన్న తినడానికి తిండి లేదు,మనం సంవత్సరం పాటు వర్షాలు సరిగా పాడకపోయినా బతికేస్తాం కానీ రైతులకు సంవత్సరం లో ఒక రెండు నెలల వర్షాలకు ఎదురు చూస్తారు అదే వర్షాలు సరిగా కురవకపోతే ఆ రైతు భారీగా నష్ట పోతాడు,ఆ ఏడాది మొత్తం తినడానికి తిండి కూడా దొరకడం కష్టం.అందుకే ఎంతో మంది రైతులు వారికి సంబందించిన భూములు మరియు రైతాంగం వదిలేసి నగరాల బాట పడుతున్నారు.

నగరాల్లో జీవించాలంటే పలు రకాల పనుల గురించి తెలిసుండాలి కానీ వారికీ తెలిసింది రైతాంగం మాత్రమే ఇంక చేసేదేమి లేక వారు నగరాల్లో ఉన్న అపార్టుమెంటులకి కాపలా దారులుగా తోట మలులుగా పని చేస్తూ దయనీయమైన జీవితం గడుపుతున్నారు.

ఇకపై ఇలాంటి వాటికి చరమ గీతం పడాలని దేశం లో ఇంక రైతుల ఆత్మహత్యలు ఉండకూడదు అని గుజరాత్ కు చెందిన ఒక సామాన్య రైతు నిర్నయిన్చుకున్నాడు అతనే ఖేటజీ.గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో చంద్రజీ గోలియా అనే చిన్న గ్రామంలో జన్మించాడు, అతను ఉన్న చోట జనాభా వెయ్యి కన్నా తక్కువ ఉన్నారు, ఖేటజీ అతను చిన్నప్పటి నుండి కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడేవాడు. అతని తండ్రి బంగాళదుంపలు, బజ్ర మరియు వేరుశెనగ వంటి సాంప్రదాయ పంటలను పండించేవాడు. ఆ రోజుల్లో బంగాళాదుంపల కు రైతులు మంచి ధరలు పొందేవారు. అందువల్ల ఖేటజీ కుటుంబం సంతోషకరమైన జీవితాన్ని గడిపేవారు.కానీ ప్రస్తుతం రోజులు మారాయి ఇప్పుడు ఆ పంటలకు కనీస మద్దతు ధర కూడా రాక ఖేటజీ కుటుంబం కష్టాల్లో చిక్కుపోయింది.

'కరబుజ' పంట:

'కరబుజ' పంట:

అదే సమయం లో ఖేటజీ కి ఒక చక్కటి ఆలోచన తట్టింది ఎప్పుడూ పెట్టే పంటలు కాకుండా ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలనీ బంగాళాదుంప పంటకు బదులు ఈ ఏడాది 'కరబుజ' పంటను వేసాడు.

మంచి దిగుబడి:

మంచి దిగుబడి:

41 ఏళ్ళు ఉన్న ఖేటజీ తనకున్న నాలుగు ఎకరాల్లో 'కరబుజ' పంటను వేసాడు ఈ పంట వేసేముందు దీనిగురించి బాగా అధ్యయనం చేసాడు,అతి తక్కువ సమయం లోనే మంచి దిగుబడిని సాధించి చరిత్ర సృష్టించాడు.

కేవలం 70 రోజుల్లో:

కేవలం 70 రోజుల్లో:

కేవలం 70 రోజుల్లో 21 లక్షలు సంపాదించిన ఖేటజీ ఇప్పుడు అందరి నోటా చర్చనీయాంశం ఐయ్యాడు.ఏదేదో గొప్పలు చెప్పడం కాదు ఈ రైతు చేసిన విధానం చూసే మిగతా రైతులు కూడా ఈదేవిదంగా ఆదాయం పాడుతారు అనే చిన్న ప్రయత్నం లో భాగంగానే నేను ఇది మీకు చెప్తున్నా.

సకాలంలో ఎరువులు:

సకాలంలో ఎరువులు:

ఈ పంటకి పెట్టుబడి కేవలం లక్షన్నర(రూ.1,50,000 )రూపాయలు, పెట్టుబడి డబ్బు మినహాయిస్తే రూ.19,50,000 వీలు లాభం.దీనికోసం అతను ఎంతో జాగ్రత్తగా మందులు వాడాడు.సకాలంలో తగిన మోతాదులో ఎరువులు మరియు నీరు పెట్టి మంచి దిగుబడిని సాధించాడు ఖేటజీ.

పంటను కొనుగోలు:

పంటను కొనుగోలు:

తన వద్దకే వచ్చి పంటను కొనుగోలు చేసేలా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాడు,ఇక మార్కెట్ రేటుకే తన పంటను అమ్మగా నాలుగు ఎకరాల 'కరుబుజ' పంటకు అధిక మొత్తం లో లాభాలు పొందాడు.దీనికి ప్రధాన కారణం తాను ఎంచుకున్న విత్తనాలు మరియు పుష్టిసైడ్స్ అన్నాడు అంతే కాకుండా భూమి కూడా పంటకు చాల అనుకూలించిందని చెప్పుకొచ్చాడు.

తొలిసారి పంట:

తొలిసారి పంట:

తాను ఈ పంట వేయడం తొలిసారని ఇక నుండి మా గ్రామమంతా లాభాల బాటలు పట్టేందుకు తన సహాయాన్ని అందిస్తానని ఖేటజీ అన్నాడు,ప్లాన్ ప్రకారం పంట వేస్తే లాభం తప్పకుండ వస్తుందని భవిష్యత్తులో మంచి ఆదాయం వచ్చే కొత్త పద్దతులను కనుగొంటామని చెప్పాడు.

సాంకేతిక విధానాలు:

సాంకేతిక విధానాలు:

ప్రస్తుతం రైతులకు అందుబాటులో అనేక సాంకేతిక విధానాలు ఉన్నాయి,పంటలకు సాంకేతికతను జోడించి ప్రభుత్వాలపై ఆధార పడకుండా ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అనే దాని పై ద్రుష్టి సారించి తమ భూమికి తగ్గ పంట వేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.

English summary

కేవలం 70 రోజుల్లో 21 లక్షలు సంపాదించిన సామాన్య వ్యక్తి.. ఆ చిట్కా ఏంటో మనము చూసేదామా? | 21 Lakhs in 70 Days: Growing Muskmelons Helped a Farmer Earn This!

41-year-old Khetaji Solanki is the new talk of the town for the farming community these days. That’s because this farmer has earned Rs 21 lakh within 70 days by growing muskmelons on his 4-acre land.
Story first published: Saturday, June 2, 2018, 13:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X