For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కష్టాలు పడుతున్న కస్టమర్లు.. ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు!

By Sabari
|

బ్యాంకర్ల రెండు రోజుల బంద్‌తో ఏటీఎంల వద్ద నగదు కష్టాలు రెట్టింపు కానున్నాయి. ఇప్పటికే అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాస్‌‌లోని ఏటీఎంలలో సరైన స్థాయిలో నగదు లభ్యత లేదు.

 నో క్యాష్

నో క్యాష్

సగానికి సగం ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు శాశ్వాతం అన్నట్టుగా నిలిచిపోయాయి. ఇక మిగతావి కూడా అప్పుడప్పుడు మాత్రమే పని చేస్తూ ఉంటాయి. ఎప్పుడు క్యాష్ అందుబాటులో ఉంటుందో, ఎప్పుడు అందుబాటులో ఉండదో చెప్పలేని పరిస్థితి

 మహానగరం

మహానగరం

ఇలా దేశ వ్యాప్తంగా నగదు కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. మే నెల ఆరంభంలో క్యాష్ కష్టాలు పతాక స్థాయికి చేరాయి. ఆఖరికి దేశ ఆర్థిక రాజధాని ముంబాయి మహానగరంలోని ఏటీఎంలలో కూడా నగదు లభ్యత లేని పరిస్థితి.

హైదరాబాద్

హైదరాబాద్

హైదరాబాద్ నగరం కూడా అప్పుడు క్యాష్ కష్టంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అదే సమయంలో జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లోని ఏటీఎంల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఖాతాల్లోని డబ్బు తీసుకోలేక ప్రజలంతా విసిగిపోయారు

మండల కేంద్రాల్లో

మండల కేంద్రాల్లో

సిటీల్లో అయితే క్యాష్ లెస్ లావాదేవీలకు అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో, మండల కేంద్రాల్లో ఇప్పటికీ దానికి ఉన్న అవకాశం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో జనాలు విసిగి వేసారి పోయారు.

 బ్యాంకులే బంద్

బ్యాంకులే బంద్

ఆ తర్వాత ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అప్పుడప్పుడైనా నగదు అందుబాటులో ఉంటూ వస్తోంది. అయితే రేపు, ఎల్లుండి బ్యాంకర్ల బంద్‌తో పరిస్థితి మళ్లీ మొదటకు వచ్చేలా ఉంది. బ్యాంకులే బంద్ అయిపోతూ ఉండటంతో ఏటీఎంలలో నగదును పర్యవేక్షించే నాథుడు ఉండడు. దీంతో జనాలకు మళ్లీ క్యాష్ కష్టాలు తప్పవు.

 అంతో ఇంతో ఊరట

అంతో ఇంతో ఊరట

అయితే ఇప్పుడు బంద్‌కు వెళ్లింది కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే. ప్రేవేట్ బ్యాంకులు యథాతథంగా పని చేస్తున్నాయి. అంతో ఇంతో ఊరట ఇదే!

Read more about: no cash atm bajaj bank strike
English summary

కష్టాలు పడుతున్న కస్టమర్లు.. ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు! | Bank Unions Two days Strike No Cash In Atm's

.With a two-day bandh of bankers, Cash Aid is doubled at ATMs. There is no proper cash availability in ATMs in Urban, Semi-Urban and Rural Areas
Story first published: Wednesday, May 30, 2018, 12:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X