For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపరేషన్ లోటస్.. బీజేపీ ఆఫర్ చేసిన రూ.100 కోట్లు బ్లాక్ మనీనా? మీరే చూడండి.

By Sabari
|

బీజేపీ పార్టీ ,JDS శాసనసభ్యులను ₹ 100 కోట్ల ఆఫర్ తో పాటు కేబినెట్ మినిస్టర్ పోస్టు ఇచ్చారు అని మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్ (సెక్యులర్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి గారు వెల్లడించారు.

కుమార స్వామి

కుమార స్వామి

కుమార స్వామి గారు ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అవినీతి వ్యతిరేక ప్రచారం చేస్తున్నప్పుడు మరి అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అని అడిగారు.

బ్లాక్ మనీనా లేదా వైట్ మనీనా

బ్లాక్ మనీనా లేదా వైట్ మనీనా

నా పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన డబ్బు బ్లాక్ మనీనా లేదా వైట్ మనీనా అని వారు స్పష్టం చేయవలసి ఉంది. అంత డబ్బు ఎక్కడ ఉంది? బిజెపి ఖజానాలో వారు దానిని ఉంచారా? ఇంత జరుగుతున్న ఆదాయపన్ను శాఖ దాని గురించి ఏమి స్పందించడం లేదు అని అడిగారు.

 ఆపరేషన్ కమలాని

ఆపరేషన్ కమలాని

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపి ఆతృతలో ఉందని పేర్కొంటూ, "2008 లో ఆపరేషన్ కమలాని మొదటి పెట్టి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసింది ఇంకా ఎవరు మర్చిపోలేరు అని చెప్పారు.పోలీసు వాహనాలు, అంబులెన్సుల్లో 25 కోట్లకు నుంచి ₹ 30 కోట్ల రూపాయలు పంపించారు 'అని ఆయన అన్నారు.

బీజేపీ కూడా ఘాటుగా

బీజేపీ కూడా ఘాటుగా

ఇది ఎలా ఉండగా బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రముఖ లీడర్ మేము ఎటువంటి ప్రలోభాలకు పాల్పడలేదు అని మీడియాతో చేప్పారు. బీజేపీ పార్టీ మీద అభిమానంతో వస్తున్నారు అని చెప్పారు

ఈగిల్టన్ రిసార్ట్

ఈగిల్టన్ రిసార్ట్

ఇది ఇలా జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ మరియు జెడిఎస్ పార్టీ వారి MLA లను కాపాడుకోవాలని అని బెంగుళూరుకు సమీపంలో ఉన్న ఈగిల్టన్ రిసార్ట్ కి తరలించారు.

ఇక ఇక్కడ ఒక రోజు ఉండడానికి రూ.6000 వసూలు చేస్తారు ఇలా 120 రూములు బుక్ చేశారు.

బ్లాక్‌మనీతో

బ్లాక్‌మనీతో

బ్లాక్‌మనీతో బీజేపీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతోంది. అలాంటి కుయుక్తులతోటే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధ్దమయ్యింది. గవర్నర్‌ హై డ్రామా నడిపి బీజేపీ కొమ్ముకాయడం దుర్మార్గం'' అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు

గవర్నర్‌ చర్య

గవర్నర్‌ చర్య

మోదీ అప్రజాస్వామిక విధానాలు కర్ణాటక ఎన్నికల్లో మరింతగా బహిర్గతమయ్యాయన్నారు. గవర్నర్‌ చర్య అప్రజాస్వామిక పాలనకు పరాకాష్ఠగా పేర్కొన్నారు.

పెద్ద నోట్ల రద్దు తరువాత

పెద్ద నోట్ల రద్దు తరువాత

పెద్ద నోట్ల రద్దు తరువాత వరుసగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ వైపు నుంచి ధన ప్రవాహం 100 శాతం ఎక్కువైందని అన్నారు.

కర్ణాటకలో బీజేపీ నైతికంగా ఓడిందన్నారు. బలపరీక్షకు 15 రోజుల పాటు అవకాశం ఇవ్వడమంటే ఎమ్మెల్యేల కొనుగోలుకు అవకాశం ఇచ్చినట్లేనన్నారు.

 పార్క్ హయత్

పార్క్ హయత్

పరిస్థిలు చేజారిపోతుండడంతో కాంగ్రెస్ మరియు జెడిఎస్ రెండు పార్టీలు వారి MLA లను కాపాడుకోవడానికి బెంగుళూరు ఈగిల్టన్ రిసార్ట్ నుంచి హైదరాబాద్ లో ఉన్న పార్క్ హయత్ హోటల్లో ఉంచారు. ఇక్కడ రోజుకి దాదాపుగా రూ.7000 ఉంటుంది.

సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు

సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు

చివరికి సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ చేసుకోవాలి అని సుప్రీమ్ కోర్ట్ ఆదేశింది. దీని కోసం ఇటు బీజేపీ అటు కాగ్రెస్ మరియు జెడిస్ సిద్ధంగా ఉంది . మొత్తం MLA లు అంత హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు తిరుగు ప్రయాణం పట్టారు.

English summary

ఆపరేషన్ లోటస్.. బీజేపీ ఆఫర్ చేసిన రూ.100 కోట్లు బ్లాక్ మనీనా? మీరే చూడండి. | Did BJP Using Black Money to Buy MLA's That's Why Each MLA Rs.100 crores

Cabinet Minister has given the BJP party and JDS MLAs Rs 100 crore offer. Kumaraswamy said.
Story first published: Friday, May 18, 2018, 13:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X