For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెలినార్ ఉద్యోగస్తులకు ఎయిర్టెల్ ఊహించని షాక్ ఇచ్చింది?

టెలికం ప్రధాన సంస్థ భారతి ఎయిర్టెల్ లిమిటెడ్,టెలినార్ ఇండియా విలీనం ప్రభుత్వం అంగీకరించిన తర్వాత టెలినార్ ఇండియా ఉద్యోగుల విభాగం తొలగింపుకు ఎయిర్టెల్ సిద్ధపడింది.

|

టెలికం ప్రధాన సంస్థ భారతి ఎయిర్టెల్ లిమిటెడ్,టెలినార్ ఇండియా విలీనం ప్రభుత్వం అంగీకరించిన తర్వాత టెలినార్ ఇండియా ఉద్యోగుల విభాగం తొలగింపుకు ఎయిర్టెల్ సిద్ధపడింది.

టెలినార్ ఉద్యోగస్తులకు ఎయిర్టెల్ ఊహించని షాక్ ఇచ్చింది?

విలీనం తరువాత ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి భారతీ ఎయిర్‌టెల్‌ నుంచి టెలినార్‌ ఉద్యోగులకు ఈ-మెయిల్స్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. .ఎయిర్టెల్ మాట్లాడుతూ "టెలినార్ ఇండియా నుంచి అందరికీ ఎయిర్టెల్లో సమాన ఉద్యోగాలు రావని పేర్కొంది.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కన్నా రెండు రెట్లు పరిమాణంలో ఉంటుందని సునీల్ మిట్టల్ నేతృత్వంలోని సంస్థ యొక్క చందాదారుల స్థావరాన్ని ఏర్పరుస్తుందన్నారు.మే 14 న టెలికాం విభాగం విలీనం ఆమోదించింది ,ఈ రెండు కంపెనీలు ఫిబ్రవరి 2017 లో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఒక టెలిఫోన్ ఉద్యోగి మాట్లాడుతూ ఎయిర్‌టెల్‌ నుంచి నాకు ఒక ఈ-మెయిల్‌ వచ్చింది. ఎయిర్‌టెల్‌ హెచ్‌ఆర్‌ అధికారుల సమావేశానికి హాజరయ్యాను. విలీనం తర్వాత నా ప్రస్తుత హోదాకు వారి సంస్థలో ఖాళీ లేదని చెప్పారు. ఐదు నెలల వేతనాన్ని ఆఫర్‌ చేసి, ఉద్యోగానికి రాజనామా చేయాలని కోరారు. ఏం చేయాలో అర్థకావడం లేదని వాపోయాడు.

టెలినార్ ఇండియా 1,400 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వాటిలో 700 మందిని పైగా కొనసాగిస్తున్నాం. వీరి ఎదుగుదలకు ఎయిర్‌టెల్‌ ఇండియా సహా ఇతర విభాగాల్లో అవకాశాలను కల్పించాం' అని ఎయిర్‌టెల్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

కాగా టెలినార్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ (తూర్పు), ఉత్తరప్రదేశ్‌ (పశ్చిమ), అస్సాం సర్కిళ్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

English summary

టెలినార్ ఉద్యోగస్తులకు ఎయిర్టెల్ ఊహించని షాక్ ఇచ్చింది? | Bharti Airtel To Lay Off Section Of Telenor Staff Post Merger

A day after government approved its merger with telecom major Bharti Airtel Ltd., a section of Telenor India’s employees are facing layoffs.
Story first published: Thursday, May 17, 2018, 13:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X