For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీడీపీ వృద్ధి రేటు 2025 నాటికి రూ.325 లక్ష‌ల కోట్లు.

2025 నాటికి దేశ జీడీపీ 5 ట్రిలియన్ డాలర్ల (రూ.325 లక్షల కోట్లు)కు చేరుకోగలదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

|

2025 నాటికి దేశ జీడీపీ 5 ట్రిలియన్ డాలర్ల (రూ.325 లక్షల కోట్లు)కు చేరుకోగలదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

జీడీపీ వృద్ధి రేటు 2025 నాటికి రూ.325 లక్ష‌ల కోట్లు.

గత కొన్ని సంవత్సరాల కాలంలో చేపట్టిన సంస్కరణలు ఫలితాలనివ్వడం మొదలైందని చెప్పారు. 2017లో భారత్‌ జీడీపీ 2.44 లక్షల కోట్ల డాలర్లుగా (రూ. 161 లక్షల కోట్లు) అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి వేగాన్ని సంతరించుకుంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొనగా, భారత ఏనుగు పరిగెత్తేందుకు సిద్ధంగా ఉందని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

కాగా, భారత ఆర్థిక వ్యవస్థ: అవకాశాలు మరియు సవాళ్లు అన్న అంశంపై అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికీ గార్గ్ హాజరైయ్యారు. ప్రభుత్వాలు తీసుకునే సాహసోపేత సంస్కరణలే దేశాన్ని వృద్ధిపథంలో నడిపించగలవన్న ఆయన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు భారత్ ఎన్నో సంస్కరణలు చేపట్టిందని గుర్తుచేశారు.

ఈ క్రమంలోనే జీఎస్టీని ఓ గొప్ప ఆర్థిక, రాజకీయ విజయంగా ఆయన అభివర్ణించారు. భారతీయ పన్ను వ్యవస్థలో మునుపెన్నడూలేని సంస్కరణ ఇదన్నారు. మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలకూ జీఎస్టీ ఊతమిచ్చిందని చెప్పారు. ఇదిలావుంటే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులతోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు.. ప్రభుత్వ రుణ పారదర్శకతను పెంపొందించడానికి సమర్థవంతమైన వ్యూహాలను అభివృద్ధి పరుచాలని ఆయన అన్నారు. అల్పాదాయ దేశాల కోసం ఇది అవసరమన్నారు. వాషింగ్టన్‌లో జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తరఫున గార్గ్ వెళ్లిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఈ సమావేశానికి జైట్లీ దూరమవగా, గార్గ్ నాయకత్వంలో భారత బృందం పాల్గొన్నది.

నాలుగేళ్ల సంస్కరణల మార్గం నేపథ్యంలో ఈ విషయాన్ని ఇన్వెస్టర్లు తనకు చెప్పినట్టు ఆయన వెల్లడించారు. సంస్కరణల విషయంలో మోదీ సర్కారు చక్కగా పనిచేస్తోందని కితాబిచ్చారు.

అయితే, ఈ సంస్కరణలను అమలు చేయడంతోపాటు, స్థిరమైన వృద్ధికి బలమైన బ్యాంకు బ్యాలన్స్‌ షీట్లు అవసరమని గుర్తు చేశారు. భారత్‌కు ఎన్నో మంచి ప్రణాళికలు ఉన్నప్పటికీ ప్రగతి ఆశించిన మేర లేదని విదేశీ ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నట్టు చాంగ్‌యాంగ్‌ తెలిపారు.

English summary

జీడీపీ వృద్ధి రేటు 2025 నాటికి రూ.325 లక్ష‌ల కోట్లు. | India's GDP Expected To Reach USD 5 Trillion By 2025

India is poised to remain the fastest growing large economy in the world and its GDP is expected to reach USD 5 trillion by 2025 as the economic reforms adopted in the last few years have started to bear fruit, a top Indian official has told the World Bank.
Story first published: Monday, April 23, 2018, 15:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X