For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుమ్ములేపిన పదవ తరగతి పిల్లాడు..రూ.5 కోట్లు ఒప్పందం!

By Sabari
|

మందుపాతరలు తొలగించే డ్రోన్‌లు తయారీ చేయడంపై దృష్టిపెట్టాడు. ఏకంగా కంపెనీ ప్రారంభించి గుజరాత్‌ ప్రభుత్వంతో 5 కోట్ల ఒప్పందం కుదుర్చుకుని అందరి చేత శభాష్‌ అనిపించుకున్నాడు. మరి ఆ డ్రోన్‌ కబుర్లు మీరూ చదవండి.

సైనికులు

సైనికులు

హర్షవర్ధన్‌ జాలా.ఒకరోజు టీవీ చూస్తున్నాడు. అందులో సైనికులు ల్యాండ్‌మైన్‌లను తొలగించే క్రమంలో ప్రమాదాల బారిన పడి అవయవాలను కోల్పోయిన వార్తను చూశాడు. అది బాగా కదిలించింది. ఒక రకంగా స్ఫూర్తిని నింపింది.

ల్యాండ్‌మైన్లను

ల్యాండ్‌మైన్లను

ల్యాండ్‌మైన్లను మనుషులే ఎందుకు తొలగించాలి? యంత్రంతో తొలగిస్తే ఎవరూ చనిపోయే అవకాశం ఉండదు కదా అనిపించింది. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే డ్రోన్‌.

చిన్నప్పటి నుంచి హర్షవర్ధన్‌కు టెక్నాలజీ అన్నా, ఎలకా్ట్రనిక్‌ వస్తువులన్నా అమితమైన ఆసక్తి. తన ఆలోచనలను తల్లితండ్రులకు చెప్పడంతో వాళ్లు సరే అన్నారు.

ప్రభుత్వం

ప్రభుత్వం

మొదటి రెండు నమూనాలు రూపొందించడానికి అవసరమైన రూ. 2 లక్షలను హర్షవర్ధన్‌ తల్లితండ్రులే సమకూర్చారు. మూడో నమూనాకు అవసరమైన డబ్బును రాష్ట్రప్రభుత్వం అందించింది. మూడో నమూనా రూపొందించడానికి రూ.3 లక్షలు ఖర్చయ్యాయి.

కెమెరా సహాయంతో

కెమెరా సహాయంతో

ఇన్‌ఫ్రారెడ్‌, ఆర్‌జిబి సెన్సర్లు, థర్మల్‌ మీటర్‌, మెకానికల్‌ షట్టర్‌ ఉన్న 21 మెగాపిక్సెల్‌ కెమెరా వంటివన్నీ డ్రోన్‌లో ఉన్నాయి. డ్రోన్‌కు ఉన్న కెమెరా సహాయంతో హై రెజల్యూషన్‌ చిత్రాలు తీసే వీలుంది. ఈ డ్రోన్‌ రెండు అడుగుల ఎత్తులో ఎగురుతూ ల్యాండ్‌మైన్లను గుర్తిస్తుంది.

బాంబులను సైతం

బాంబులను సైతం

ఎనిమిది చదరపు అడుగుల వైశాల్యాన్ని కవర్‌ చేస్తుంది. ల్యాండ్‌మైన్స్‌ను గుర్తించిన వెంటనే బేస్‌ స్టేషన్‌కు సిగ్నల్‌ పంపుతుంది. అంతేకాదు ఈ డ్రోన్‌ ల్యాండ్‌మైన్లను నాశనం చేయడం కోసం 50 గ్రాముల బరువున్న బాంబులను సైతం మోసుకుని వెళ్లగలదు.

బాగా నచ్చింది.

బాగా నచ్చింది.

హర్షవర్ధన్‌ రూపొందించిన డ్రోన్‌ అధికారులకు బాగా నచ్చింది. దాంతో గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్‌ల తయారీకి అవసరమైన సహాయం అందించమని కోరుతూ హర్షవర్దన్‌తో 5 కోట్ల ఎంఓయూ కుదుర్చుకుంది.

హర్షవర్దన్‌ తండ్రి

హర్షవర్దన్‌ తండ్రి

హర్షవర్దన్‌ తండ్రి ప్రద్యుమన్‌సిన్హా ఒక ప్లాస్టిక్‌ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. తల్లి నిషాబ గృహిణి.

పేటెంట్‌

పేటెంట్‌

హర్షవర్దన్‌ తన ప్రోడక్ట్‌కు పేటెంట్‌ను కూడా పొందాడు. అమెరికాలోని గూగుల్‌ ప్రధాన కార్యాలయ్యాన్ని సందర్శించాక పేటెంట్‌ తీసుకోవాలన్న ఆలోచన వచ్చిందట.

‘ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్‌ సహాయంతో డ్రోన్‌ మైన్‌ను గుర్తించాక యాభై గ్రాముల డిటొనేటర్‌ సహాయంతో దాన్ని డిఫ్యూజ్‌ చేయడంతో పని ముగించేస్తుంద'ని అంటున్నాడు హర్షవర్దన్‌.

 ఆడుతూ-పాడుతూ

ఆడుతూ-పాడుతూ

తోటి పిల్లలు ఆడుతూ, పాడుతూ సంతోషంగా గడుపుతూ ఉంటే హర్షవర్ధన్‌ మాత్రం బిజినెస్‌ ప్లాన్‌ గురించి ఆలోచిస్తున్నాడు. ‘ఎరోబోటిక్స్‌' పేరుతో కంపెనీ రిజిస్టర్‌ చేయించాడు. బాపూనగర్‌లోని సర్వోదయ విద్యామందిర్‌లో పదోతరగతి చదువుతున్న హర్షవర్ధన్‌ మరిన్ని విజయాలు సాధించాలని మనమూ కోరుకుందామా! రిపోర్ట్స్ ఫ్రొమ్

ఏబిన్

English summary

దుమ్ములేపిన పదవ తరగతి పిల్లాడు..రూ.5 కోట్లు ఒప్పందం! | Drilling with drone Small Boy Earns Rs.5 Crores

The quotient reads on the exams and marks on the exams. But this is not a Gujarati boy.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X