English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఓటర్లు మరియు చిన్న వ్యాపారస్తులను ఆకట్టుకునే యోచనలో 2018 బడ్జెట్

Written By: Bharath
Subscribe to GoodReturns Telugu

రానున్న కేంద్ర బడ్జెట్ 2018 చాల ప్రాధాన్యం కానుంది,ఇది కేవలం ఆర్థిక వ్యవస్థ కోసమే కాకుండా వచ్చే ఎన్నికలకు ఈ బడ్జెట్ చాల కీలకం అని చెప్పవచ్చు.

 గ్రామీణ ఓటర్లు మరియు చిన్న వ్యాపారస్తులే లక్షంగా బడ్జెట్

నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ బుడ్జెడ్ పెద్ద సవాలుగా మారింది,ఎందుకంటే 2018 లో దాదాపు 8 రాష్ట్రాలలో శాసన సబ ఎన్నికలు జరగనున్నాయి,అదేవిదంగా 2019 లో కీలక లోక్ సభ ఎన్నికలు రాన్నున్న నేపత్యంలో మోడీ ప్రభుత్వం గెలుపుకు సంబందించి ఏఒక్క అవకాశం వదలకూడదు అనే యోచనలో అడుగులు వేస్తోంది.

వచ్చే 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి విజయం సాధించాలని,గ్రామీణ ఓటర్లను మరియు చిన్న వ్యాపారస్తులను తమవైపు తిప్పుకోవాలనే నేపథ్యంలో 2018 బడ్జెట్ లో రైతులకోసం కొత్తపథకాలు ప్రవేశపెట్టడం,మరియు వస్తు పన్ను(GST) లో మార్పులు దిశగా అడుగులు వేయనుంది.

అన్ని ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సెషన్ ముఖ్యాంశం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం (ఫిబ్రవరి 1) 2018 నాడు

ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్.

ఈ బడ్జెట్ చాల కీలక అంశాలతో ముడిపడి ఉంది.ఇది మోడీ ప్రధుత్వానికి చివరి బడ్జెట్ కావడంతో,వచ్చే 2019 ఎన్నికల్లో ఓట్ల పై కూడా ప్రభావం చూపనుంది.ప్రజలంతా ఆర్ధిక మంత్రి తమకు ఎటువంటి వరాలు కురిపించి ఊరట కలిపిస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.  

నివేదికలు చెప్పినట్టు ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టే బడ్జెట్ లో గ్రామీణ ఓటర్లకు మరియు చిన్న వ్యాపారస్తులకు ఊరట కలిగించి తద్వారా వారిలో ప్రభుత్వం పై నెలకొన్న వ్యతిరేకతను తొలగించి 2019 ఎన్నికల్లో మరోసారి జయకేతనం ఎగరవేయాలనే దిశగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుత గ్రామీణ కార్యక్రమాల నిధులు,ఉద్యోగ హామీ పథకం, గ్రామీణ గృహాలు మరియు బడ్జెట్లో పంట బీమా పథకం వంటి పథకాలకు ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లే నిధులను పెంచనున్నారు.

విశ్లేషకుల ఆధారంగా , "ప్రభుత్వం యొక్క ప్రధాన ప్రాధాన్యత ఉద్యోగాలను సృష్టించడం మరియు అభివృద్ధిని పెంచడం, వ్యవసాయ రంగం మరియు చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహకాలు కల్పించే అవకాశం ఉంది."

గ్రామీణ ఓటర్లను తిరిగి బీజేపీ వైపు తిప్పుకోవటం ప్రభుత్వం ముందున్న ప్రధాన అంశం,ప్రత్యేకించి గుజరాత్ లో గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత గ్రామీణ ఓటర్లు అధిక సంఖ్యలో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు.

గుజరాత్ ఎన్నికలు భారతదేశం యొక్క భావాలను కొలవడానికి ఒక కొలబద్దగా పరిగణించబడితే, అప్పుడు మోడీ ప్రభుత్వం రైతులకు మరియు గ్రామీణ పేదలకు ఆర్థిక ఇబ్బందులను తొలగించడం చాల ముఖ్యం.

ఈ బడ్జెట్ తర్వాత చ్చిన వ్యాపారాలను తిరిగి ఆవిష్కరించి,దీని ద్వారా ప్రధుత్వం మద్దతు పొందడం చాల ముఖ్యం ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రెండు అతి పెద్ద ఆర్థిక నిర్ణయాలు పెద్దనోట్ల రద్దు మరియు జి.స్.టి వాళ్ళ వ్యాపారస్తులపై తీవ్ర ప్రభావం చూపాయి.

గత ఏడాది,ప్రభత్వ మరియు పరిశ్రమల నాయకుల సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ, "రాబోయే బడ్జెట్లో రెండు రంగాలు కేంద్రీకృతమై గ్రామీణ భారతం మరియు వ్యవస్థాపన అభివృద్ధి."ప్రధాన అంశం అని వెల్లడించారు.

ఆర్థికమంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారం, బడ్జెట్ లో రహదారులను నిర్మించడం, రైల్వేలను ఆధునీకరించడం మరియు మౌలిక సదుపాయాల అడ్డంకులు తొలగించడం వంటి అంశాలు కూడా కీలకం కానున్నాయి.

గత ఏడాది జిఎస్టి అమలు తరువాత మోడి ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ఇది.అందువల్ల పాలక బిజెపికి కఠినమైన పరీక్షా అని చెప్పవచ్చు. జైట్లీ బాధ్యత,ఏవిదంగా బడ్జెట్ పై ప్రభావం చూపనుందో వేచి చూడాల్సిందే.

English summary

How Modi Govt PlansTo Bring Back Rural Voters, Small Businesses

In order to emerge victorious in these elections, the ruling Bharatiya Janata Party (BJP) has to win back the confidence of the rural voters and small businesses which of late have been miffed by various anti-farmer policies and introduction of the complex and controversial Goods and Services Tax (GST).
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns