For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లిప్ కార్ట్, అమెజాన్, పేటీఎమ్ వంటి వాటిల్లో వ‌స్తువుల కొనుగోలా... అయితే ఇవి మీ కోస‌మే...

సంప్ర‌దాయ షాపింగ్లో వ‌స్తువు నాణ్య‌త‌ను నేరుగా తెలుసుకోవ‌చ్చు. అయితే స‌మ‌యం లేక‌పోవ‌డం కార‌ణంగా ఇప్పుడు ఎక్కువ మంది ఉద్యోగులు ఆన్‌లైన్ షాపింగ్ ప‌ట్ల మొగ్గుచూపుతున్నారు. అయితే ఆఫ‌ర్ల పేరిట పాత వ‌స్తు

|

ఇటీవ‌ల ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్ల‌లో 30%, 50% డిస్కౌంటు ఆఫ‌ర్లు అంటూ ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ల వూర‌డింపు ఎక్కువైంది. ఏదో ఉత్ప‌త్తిపైన అత్య‌ధిక రాయితీ అంటూ ఆశ‌చూపి వెబ్‌సైట్లోకి వినియోగదారు ప్ర‌వేశించేలా చేస్తారు. త‌ర్వాత క‌స్ట‌మ‌ర్లంతా ఏదో ప్రాడ‌క్ట్ కొనేలా వ్యూహాన్ని త‌యారీ చేసి ఉంటారు. ఈ విధంగా ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ల క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకుని ఆన్‌లైన్ షాపింగ్ పేరిట లాభాలు గ‌డిస్తుంటాయి. ఒకే ఉత్ప‌త్తికి ఉన్న ధ‌ర కంటే అధికంగా రేటు విధించి మ‌ళ్లీ దానిని రాయితీ పేరిట అంట‌గ‌డ‌తారు. ఈ నేప‌థ్యంలో ఈసారి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి వెబ్సైట్ల‌లో వ‌స్తువులు కొనుగోలు చేసేముందు ఈ విష‌యాలు తెలుసుకుని ఉంటే మంచిది.

1. ఆన్‌లైన్‌ షాపింగా?

1. ఆన్‌లైన్‌ షాపింగా?

'ఉత్పాదక కంపెనీలు లేదా అమ్మే ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లు బాగానే వారంటీ, గ్యారంటీ ఇస్తున్నాయిగా?' అనే ప్రశ్న తలెత్తవొచ్చు. కానీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ అనే విషయంలో నెంబర్‌వన్‌గా చెలామణి అవుతున్న కంపెనీల పట్ల కూడా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కస్టమర్ల జేబులకు కత్తెర్లు పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయనేది మరిచిపోవొద్దు.

2. ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే?

2. ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే?

ఆన్‌లైన్లో వస్తువుల్ని కొనడం, అమ్మడం అనే పద్ధతినే ఇ-కామర్స్‌ అంటారు. 'ఆన్‌లైన్‌ షాపింగ్‌' అనేది అందరికీ అర్థమయ్యే మాట. వస్తువులు కొనడం, అమ్మడం అనే విషయంలో కొత్త పద్ధతులకు తెరలేపింది ఇ-కామర్సే. దీంతో ఇ-కామర్స్‌ సంస్థలు రోజుకి వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ బిజినెస్‌ నిర్వహిస్తున్నాయి. మొదట్లో వంటికి ధరించే బట్టలు, కాళ్ళకు వేసుకునే చెప్పులు, బూట్లకే పరిమితమైన ఆన్‌లైన్‌ షాపింగ్‌ విధానం.. నేడు డిమాండ్‌ ఉన్నచోటే సప్లరు ఉంటుందన్నట్టుగా క్రమేణా పెద్ద గ్లోబల్‌ మార్కెట్‌ అయిపోయింది. ఈ మార్కెట్‌లో కొనడానికి స్వతంత్రం ఎంత ఉంటుందో?! కుతంత్రం అంతే ఉంటుంది. డిస్కౌంట్‌ పేరుతో వినియోగదారుడికి మేలు చేకూర్చే లాభాలూ రావొచ్చు.. నాసిరకం వస్తువులు అంటగట్టి మోసగించే నష్టాలూ రావొచ్చు.

3. జవాబుదారీ ఎవ‌రు?

3. జవాబుదారీ ఎవ‌రు?

నిజానికి ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఉత్పతిదారుడికి, వినియోగదారుడికి మధ్య మధ్యవర్తిత్వం నెరిపే విధానం. ఉత్పత్తి కంపెనీల నుంచి ఆయా వస్తువుల్ని వినియోగదారుడికి అమ్మడం, చేర్చడం చేసినందుకుగాను సదరు ఆన్‌లైన్‌ కంపెనీలు కమీషన్‌ తీసుకుంటాయి. ఆన్‌లైన్‌ మార్కెట్‌ విస్తరించిన నేపథ్యంలో ఈ షాపింగ్‌ వెబ్‌సైట్లు రోజువారీ లక్షలాది రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్నాయి. అయితే వినియోగదారుడికి జవాబుదారీగా ఉండాల్సింది ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లే. అందుకే గ్యారంటీని ఇవ్వగలిగే కంపెనీలేమిటో అవగాహనకు రావాలి.

4. ఆన్‌లైన్లో.. సౌకర్యమేగానీ..?!

4. ఆన్‌లైన్లో.. సౌకర్యమేగానీ..?!

షాప్‌దాకా వెళ్లి ఏదైనా వస్తువు కొనాలంటే జేబులో తగినంత డబ్బు కావాలి. జేబులో ఉన్న డబ్బును బట్టి, నచ్చిన వస్తువుల్ని కొనాలా? వద్దా? అనే ఆలోచనలతో తర్జనభర్జనలు పడతాం. కానీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ విషయంలో అలాంటివేమీ అవసరంలేదు. ఇంటి బాల్కనీలో కూర్చుని టీనో, కాఫీనో తాగుతూ స్మార్ట్‌ఫోన్‌ టచ్‌స్క్రీన్‌ టచ్‌ చేసి, అలవోకగా ఆర్డర్ ఇవ్వొచ్చు. అందుకు తగ్గట్టుగానే మనం ఎక్కడున్నా వెదికి పట్టుకుని మరీ, మనం ఆర్డర్‌ చేసిన వస్తువు మనకందిస్తాయి ఆన్‌లైన్‌ కంపెనీలు. ఈ రోజు డబ్బుల్లేవు, అయినా నాలుగైదు రోజులు ఆగైనా సరే ఆ వస్తువును తీసుకునే వెసులుబాటు కల్పిస్తాయి. ఇలాంటి సౌలభ్యాలు, సౌకర్యాలే కస్టమర్లను ఆకర్షించడానికి ప్రధానకారణం. అయితే తీసుకున్న వస్తువులకు గ్యారంటీ ఎంత అనేదే మన ముందున్న ప్రశ్న. ఈ విషయంలో కస్టమర్లకు జవాబుదారీగా ఉండే ఆన్‌లైన్‌ కంపెనీలు కొన్నైతే.. దిక్కున్నవాడితో చెప్పుకో.. పో! అనే మోసపూరిత వ్యవహారంతో నడిచే కంపెనీలు చాలానే ఉన్నాయి. అలా మోసపోయిన కస్టమర్లూ మన మధ్య లేకపోలేదు.

5. మోసాలు ఎక్కువే!

5. మోసాలు ఎక్కువే!

ఆన్‌లైన్లో షాపింగ్‌ అంటే డిస్‌ప్లేలో పొందుపరిచిన వస్తువుల ఫొటోలు, వాటి వివరాల్ని చూసి ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వస్తువుల నాణ్యతను పసిగట్టే అవకాశం ఉండదు. మనం బయట బజార్లో దొరికే షాపుల్లో నాణ్యతా ప్రమాణాలను తెలుసుకోడానికి ఆ వస్తువును భౌతికంగా చూసి, చేతి స్పర్శతో నాణ్యతను పసిగడతాం. అయితే ఆన్‌లైన్‌ షాపింగ్‌లో అలాంటి అవకాశం ఉండదు. కేవలం ప్రొడక్ట్‌ (వస్తువు)కు సంబంధించిన వివరాలు మాత్రమే ఉంటాయి. వాటిని కూలంకషంగా చదివి, నాణ్యతా ప్రమాణాలను అంచనా వేసుకోవాలి. వినియోగదారుల్ని ఆకర్షించే క్రమంలో అగ్గిపుల్ల, పిన్నీసుల్ని సైతం ఎంతో అద్భుతంగా, ఉన్నతంగా చూపించే టెక్నాలజీ వచ్చేసింది. ఈ క్రమంలో అక్కడ ఆకర్షణీయంగా కనిపించే బొమ్మల్ని చూసి 'చాలా బావుంది, అద్భుతం' అనే భావనకు రాకుండా నిజరూపంలో ఆ వస్తువు ఎలా ఉంటుందనే విషయంలో ఓ అవగాహనకు రావాలి.

అలాగే కంపెనీని పోలిన కంపెనీలు ఉంటాయి. అంటే ఒక అక్షరం తేడాతో పేరుమోసిన కంపెనీల పేర్లతో నకిలీ వ్యాపారాలు అనేకం మార్కెట్లో హల్‌చల్‌ చేయడం మనకు తెలుసు. ఇలాంటి దిగువశ్రేణి ఉత్పత్తి కంపెనీలు చాలావరకూ ఆన్‌లైన్‌ షాపింగ్‌ విధానాన్ని అవలంభిస్తున్నాయి. అలాంటి కంపెనీ ఉత్పత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే బ్రాండెడ్‌ కంపెనీలైనా, చిన్నా చితకా కంపెనీలైనా ఆన్‌లైన్లో అమ్మే వస్తువుకు ఎంత గ్యారంటీని ఇవ్వగలుగుతున్నాయి? మార్కెట్‌ ధరకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ ధరకు తేడా ఎంత? అనే విషయాలపై శ్రద్ధపెట్టాలి.

6. డిస్కౌంట్ల ఆఫరా?!

6. డిస్కౌంట్ల ఆఫరా?!

వ్యాపార రంగాల్లో క్రిస్‌మస్‌, సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి వంటి పండగ సీజన్లలో డిస్కౌంట్‌ సేల్‌ ఆఫర్లనేవి సర్వసాధారణం. ఈ విషయంలో ఈ-మార్కెట్‌ (ఆన్‌లైన్‌ షాపింగ్‌ కంపెనీలు) అసలు మార్కెట్‌ కంటే ముందుంటుంది. 40 శాతం, 60 శాతం డిస్కౌంట్లు అని ఆర్భాటంగా జరిగే ప్రచారాల్లో నిజమెంత? అమ్మే వస్తువుల్లో నాణ్యత ఎంత? అనేది పరిశీలించాలి. సాధారణంగా పండగ సీజన్లలో కొత్త ఉత్పత్తులతో పాటే నిల్వ సరుకుకు డిస్కౌంట్‌ సేల్‌ పేరుతో అమ్మే ప్రయత్నాలు జరుగుతుంటాయి. నాణ్యతలేని వస్తువుల్ని కూడా అమ్మేసి లాభపడుతుంటాయి. ఇటీవల కాలంలో ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీలు డిస్కౌంట్ల ఆఫర్ల ప్రకటనల కోసం కోట్లాది రూపాయల్ని ఖర్చు పెడుతున్నా యంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

7. ఎలా చెల్లిస్తున్నారు?

7. ఎలా చెల్లిస్తున్నారు?

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ప్రధానంగా డబ్బు చెల్లించే విధానం మూడు పద్ధతుల్లో ఉంటుంది. 1. క్రెడిట్‌ కార్డ్‌, 2. డిబెట్‌ కార్డ్‌, 3. డెలివరీ టైమ్‌లో చెల్లించే పద్ధతి. మూడో పద్ధతినే ఎంచుకోవడం శ్రేయస్కరం. వీలైనంత తక్కువగా బ్యాంకు లావాదేవీలు ఇంటర్‌నెట్‌ ద్వారా జరపకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇటీవల కాలంలో నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరుగుతున్న మోసాలు అనేకం. అందుకే, ఆన్‌లైన్‌ ఆఫర్ల విషయంలో ఒకటి, రెండుసార్లు ఆలోచించి, అవగాహన, నమ్మకం కలిగాకే షాపింగ్‌ చేయడం మంచిది.

Read more about: online shopping ecommerce
English summary

ఫ్లిప్ కార్ట్, అమెజాన్, పేటీఎమ్ వంటి వాటిల్లో వ‌స్తువుల కొనుగోలా... అయితే ఇవి మీ కోస‌మే... | doing shopping online you have to know these important things

These are things you should be careful at online shopping
Story first published: Wednesday, January 17, 2018, 12:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X