For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌భుత్వోద్యోగుల‌కు 50% కంటే డీఏ దాటితే వారి వేత‌నం స‌వ‌రించే యోచ‌న

డీఏ పెరుగుద‌ల 50% మించిన సంద‌ర్భంలో ఆ ఉద్యోగి వేత‌నాన్ని స‌వ‌రించాల్సిందిగా ఒక ఉన్న‌త స్థాయి క‌మిటీ 7వ వేత‌న సంఘం వేత‌న స‌వ‌ర‌ణ‌కు సంబంధించి ముఖ్య సూచ‌న చేసింది. అయితే దీనికి సంబంధించి లోక్‌ష‌స‌భ‌లోన

|

భాజ‌పా అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వేత‌నాలు పెంచ‌డంలో ఏదో మెలిక పెడుతూనే ఉంది. అంతే కాకుండా ఎంత శాతం వేత‌న పెరుగుద‌ల ఉంటుంది, డీఏ ఏటా ఎలా పెరుగుతుంద‌నే నిర్ణ‌యానికి సంబంధించి ప‌లు సార్లు ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. అయితే దీనికి సంబంధించి ఏడో వేత‌న సంఘం ఇచ్చిన సిఫార్సుల మేర‌కు మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగు చూస్తోంది.
డీఏ పెరుగుద‌ల 50% మించిన సంద‌ర్భంలో ఆ ఉద్యోగి వేత‌నాన్ని స‌వ‌రించాల్సిందిగా ఒక ఉన్న‌త స్థాయి క‌మిటీ 7వ వేత‌న సంఘం వేత‌న స‌వ‌ర‌ణ‌కు సంబంధించి ముఖ్య సూచ‌న చేసింది. అయితే దీనికి సంబంధించి లోక్‌ష‌స‌భ‌లోనే తుది నిర్ణ‌యం జ‌ర‌గ‌లేదు. అధికారిక స‌మాచారం లేక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో దీనికి సంబంధించిన ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు ఈ కింద తెలుసుకుందాం.

 1. ప్ర‌భుత్వానికి ప్ర‌శ్న‌లు

1. ప్ర‌భుత్వానికి ప్ర‌శ్న‌లు

భ‌విష్య‌త్తులో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, పింఛ‌నుదార్ల‌కు సంబంధించి వేత‌నం పెంచే ఉద్దేశం ఉందా, లేదా అని పార్లమెంటులో ఆర్థిక మంత్రిని ఎంపీలు ప్ర‌శ్నించారు. అంతే కాకుండా వేత‌న భ‌త్యం 50% దాటితే ఉద్యోగి వేత‌నాన్ని మార్చే ప్ర‌తిపాద‌న ఏమైనా ఉందా అనే ప్ర‌శ్న కూడా వేశారు. అంతే కాకుండా వేత‌నాలు, వ్యయ శాఖ ఉద్యోగుల వేత‌నాన్ని నిత్యం ప‌రిశీలించే యోచ‌న ఉందా అనే కోణంలో సైతం ప్ర‌భుత్వానికి

ప్ర‌శ్న‌లు సంధించారు.

2. ప్ర‌భుత్వ స్పంద‌న‌

2. ప్ర‌భుత్వ స్పంద‌న‌

అయితే దీనికి సంబంధించి ఆర్థిక శాఖ త‌ర‌పున ఆర్థిక శాఖ మంత్రి లోక్ స‌భ‌లో స‌మాధానం ఇచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్ ట్రైనింగ్ ఆధ్వ‌ర్యంలో వేత‌న స‌వ‌ర‌ణ క‌మిటీని గ‌తేడాది ఆగ‌స్టులో ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. మిగిలిన మూడు ప్ర‌శ్న‌ల‌కు సంబ‌ధించి అలాంటి ప్ర‌తిపాద‌న‌లేవీ ప్ర‌భుత్వం వ‌ద్ల లేవ‌ని వివ‌రించారు.

3.భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక ఇదీ

3.భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక ఇదీ

వేత‌న స‌వ‌ర‌ణ క‌మిటీ వివిధ స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మావేశ‌మై నిర్ణ‌యం తీసుకుంటుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఇది జ‌ర‌గ‌లేదు. అయితే ఇందులో క‌నీస వేత‌నం పెంపు, ఫిట్మెంట్ అంశం మాత్రం ఈ క‌మిటీ ప‌రిధిలోకి రావ‌ని చెప్పారు. ఇప్పుడేమో మ‌ళ్లీ దీనికి సంబంధించి అత్యున్న‌త స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ అత్యున్న‌త స్థాయి క‌మిటీలో అధికారులు, మంత్రులు ఉంటారు. వారు సంయుక్తంగా ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటారు. అయితే ఇదంతా ప్ర‌తిపాద‌న ద‌శ‌లో ఉన్న‌ప్ప‌టికీ దీనికి సంబంధించిన ఫైళ్లు ప్ర‌భుత్వ స్థాయిలో వేగంగా క‌ద‌ల్లేద‌ని స‌మాచారం.

 4. 7వ వేత‌న సంఘమే చివ‌రిది

4. 7వ వేత‌న సంఘమే చివ‌రిది

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌నాల పెంపుకు సంబంధించి ఏడో వేత‌న సంఘ‌మే చివ‌రిది అయిన‌ట్లు ప్ర‌భుత్వ‌మే ఇప్ప‌టికి సంకేతాలు ఇస్తోంది. అంతే కాకుండా బ‌డ్జెట్లో వేత‌నాలు, పింఛ‌న్ల‌కే ఎక్కువ సొమ్ము పోతున్నందున దాని భారాన్ని త‌గ్గించుకోవాలని చూస్తున్నారు. ఆ కోణంలో ఆలోచించి ఎవ‌రిదైనా ఉద్యోగి డీఏ వేత‌నంలో 50% మించిన‌ట్లైతే దాన్ని ప్ర‌త్యేకంగా ప‌రిగ‌ణించి ఆ స‌ద‌రు ఉద్యోగి వేత‌నాన్ని స‌వ‌రించే యోచ‌న చేస్తున్నార‌ట‌. కొత్త పే క‌మీష‌న్ వేసే బ‌దులు క‌మిటీ సూచ‌న మేరకు నిర్ణ‌యాలు జ‌రగొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

English summary

ప్ర‌భుత్వోద్యోగుల‌కు 50% కంటే డీఏ దాటితే వారి వేత‌నం స‌వ‌రించే యోచ‌న | 7th Pay Commission: Salaries to be adjusted when DA crosses 50 per cent

The 7th Pay Commission recommendations have for long now been a subject matter of debate and bone of contention. For the 50 lakh Central Government employees, the wait has been a long one and one must add desperate and frustrating.
Story first published: Wednesday, January 10, 2018, 16:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X