For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డు స్థాయిల‌ను నెల‌కొల్పిన స్టాక్ మార్కెట్ సూచీలు

ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు బుల్‌ర్యాలీలో సాగుతుండటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అమెరికా దేశ స్టాక్ సూచీలైన‌ డోజొన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌

|

మ‌ళ్లీ స‌రికొత్త రికార్డుల‌ను నెలకొల్పిన భార‌త స్టాక్ మార్కెట్లు

వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌తోపాటు ఎన్‌ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ, మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ సైతం చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు డబుల్ సెంచరీతో 34,353 వద్ద నిలవగా.. నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 10,624 వద్ద స్థిరపడింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు బుల్‌ర్యాలీలో సాగుతుండటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అమెరికా దేశ స్టాక్ సూచీలైన‌ డోజొన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సైతం సరికొత్త గరిష్ట రికార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే.
అన్ని రంగాలూ లాభాల్లోనే
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం(1.4%), క్యాపిట‌ల్ గూడ్స్(1.22%), హెల్త్ కేర్(1.2%), స్థిరాస్తి(0.87%) రంగాలు బాగా లాభ‌ప‌డ్డాయి. సుర‌క్షిత పెట్టుబ‌డుల‌కు ఏది అత్యుత్త‌మం?

 మార్కెట్ల‌కు రికార్డు లాభాలు

బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభ‌ప‌డ్డ‌వి, న‌ష్ట‌పోయిన‌వి
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డ్డ‌, న‌ష్ట‌పోయిన కంపెనీల షేర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఈ రోజు ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్‌లో కోల్ ఇండియా(3.26%), ఇన్ఫోసిస్ (+ 2.33%), సన్ ఫార్మా (+ 2.28%), ఎల్ అండ్ టి (+ 1.8%), హీరో మోటోకార్ప్ (+ 1.37%)లాభ‌ప‌డ‌గా ,మ‌రో వైపు భారతీ ఎయిర్టెల్ (4.43%), ఒఎన్జిసి (-0.28%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.18%), టాటా స్టీల్ (-0.18%), అదానీ పోర్ట్స్ (-0.07%)న‌ష్ట‌పోయిన వాటిలో ముందున్నాయి.

English summary

రికార్డు స్థాయిల‌ను నెల‌కొల్పిన స్టాక్ మార్కెట్ సూచీలు | markets created new records in today trading

The Sensex and Nifty jumped to record closing highs for a second straight session on Monday as pre-budget cheer and optimism over corporate results offset lowered growth forecasts, with the sentiment also boosted by broader world markets hovering near all-time highs.
Story first published: Monday, January 8, 2018, 17:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X