For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్ కామ్ పై దివాళా పిటీష‌న్ ఉప‌సంహ‌రించుకున్న చైనా బ్యాంకు

అప్పుల భారంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్)కు భారీ ఉపశమనం లభించింది. ఆర్‌కామ్‌కు అతిపెద్ద విదేశీ రుణదాతగా ఉన్న చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ (సీడ

|

అప్పుల భారంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్)కు భారీ ఉపశమనం లభించింది. ఆర్‌కామ్‌కు అతిపెద్ద విదేశీ రుణదాతగా ఉన్న చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ (సీడీబీ) ఆ సంస్థపై దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకున్నది. ఈ పిటీషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సీడీబీ తరఫు న్యాయవాది ఎన్‌సీఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)కు తెలియజేయడంతో అందుకు ట్రిబ్యునల్ అనుమతించింది.

 ఆర్‌కామ్ కు చైనా బ్యాంకు నుంచి ఊర‌ట‌

చైనాకు చెందిన మరో రెండు బ్యాంకులతో కలసి ఆర్‌కామ్‌కు దాదాపు 200 కోట్ల డాలర్ల రుణమిచ్చిన సీడీబీ.. తమకు ఆర్‌కామ్ పెద్ద మొత్తంలో బకాయి పడిందని, కనుక ఆ సంస్థపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ గత ఏడాది నవంబర్‌లో ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. అయితే ఈ విషయమై సదరు బ్యాంక్‌తో చర్చలు జరుపుతున్న ఆర్‌కామ్ గత వారం రుణ పునర్ వ్యవస్థీకరణ ప్రణాళికను ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్‌తో పాటు టెలికం టవర్లను కొనుగోలు చేసేందుకు అనిల్ అంబానీ అన్న ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ముందుకు రావడంతో సీడీబీ తన దివాలా పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

Read more about: rcom business telecom
English summary

ఆర్ కామ్ పై దివాళా పిటీష‌న్ ఉప‌సంహ‌రించుకున్న చైనా బ్యాంకు | A sigh of Relief for RCOM from China development bank

China Development Bank (CDB), the biggest foreign lender to Reliance Communications Ltd (RCom), on Friday withdrew a petition seeking to drag the indebted telecoms carrier into insolvency.
Story first published: Saturday, January 6, 2018, 11:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X