For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ఉన్నత స్థితిలో ఉన్న సంస్థల గురించి మీకు తెలుసా

దేశ‌వ్యాప్తంగా ఉన్న స్థిరాస్తి రంగం గురించి బాగా విచారిస్తూ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ ముందుగానే పసిగట్టి, అక్కడ నిర్మాణాలను చేపట్టి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటాయి. భారత దేశంలో ఉన్న టాప్ రియల్ ఎస

|

నగరాల్లో రోజు రోజుకి పెరిగిపోతున్న మధ్యతరగతి జనాభా వల్ల భారత రియల్ ఎస్టేట్ రంగం మరింతగా పుంజుకుంటుంది. గత పది సంవత్సరాలుగా ఈ ధోరణి మరింత పెరిగింది. ఇందుకు మనం మధ్య తరగతి ప్రజలకు ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పవలసి ఉంటుంది.

ఏ ఏ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయి అని తెలుస్తుందో, ఆయా ప్రాంతాలను రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ ముందుగానే పసిగట్టి, అక్కడ నిర్మాణాలను చేపట్టి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటాయి. భారత దేశంలో ఉన్న టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 డి.ఎల్.ఎఫ్ :

1 డి.ఎల్.ఎఫ్ :

రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద వాణిజ్య సంస్థల్లో డి.ఎల్.ఎఫ్ కూడా ఒకటి. దీని ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ లో ఉంది.

గత 70 సంవత్సరాలుగా ఎన్నో నిర్మాణ ప్రాజెక్ట్ లను చెప్పట్టింది మరియు విజయవంతంగా పూర్తి చేసింది. ముఖ్యంగా ఢిల్లీ లోని గ్రేటర్ కైలాష్, సౌత్ ఎక్స్టెన్షన్, హౌజ్ ఖాస్ మరియు ఇతర ప్రాంతాల్లో ఎన్నో నివాస సముదాయాలను నిర్మించడం జరిగింది.

భారత దేశ వ్యాప్తంగా 24 నగరాల్లో డి.ఎల్.ఎఫ్ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. భారత దేశ రిటైల్ రంగం రూపాంతరం చెందే విధంగా, ఈ సంస్థ ఎన్నో మాల్స్ మరియు వాణిజ్య సముదాయాలను నిర్మించడం జరిగింది.

2016 ఆర్ధిక సంవత్సరానికి గాను డి.ఎల్.ఎఫ్ సంస్థ 9819 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2015 ఆర్ధిక సంవత్సరంలో ఈ సంస్థ 8168 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత సంవత్సరంతో పిలిచి చూస్తే ఈ సంవత్సరం 20% అధికంగా లాభాలను కైవసం చేసుకుంది.

2. యునిటెక్ రియల్ ఎస్టేట్ :

2. యునిటెక్ రియల్ ఎస్టేట్ :

భారత దేశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో యునిటెక్ కూడా ఒకటి. ఈ సమస్త విబ్భిన్నమైన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో విలాసవంతమైన ప్రాజెక్ట్ లను ఈ సంస్థ నిర్మించడం జరిగింది.

కానీ, ఈ మధ్యనే న్యూ ఢిల్లీ దగ్గర లోని నోయిడా ప్రాంతంలో గ్రేటర్ నోయిడా ఎక్సప్రెస్ వే దగ్గర, అతి ఖరీదైన ప్రాజెక్ట్ బుర్గున్డి అనే అతి విలాసవంతమైన ప్రాజెక్ట్ ని నిర్ణీత సమయంలో వినియోగదారులకి ఇవ్వడంలో విఫలమైంది.

3 సూపర్ టెక్ :

3 సూపర్ టెక్ :

సూపర్ టెక్ అనే సంస్థ 25 సంవత్సరాలకు ముందు స్థాపించడం జరిగింది. ఈ 25 సంవత్సరాల్లో ఈ సంస్థ ఎన్నో శిఖరాలను అధిరోహించి, కొత్త ఎత్తులకు ఈ రంగంలో చేరుకుంది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఎప్పటికప్పుడు నూతన ప్రాజెక్ట్ లను చేపట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

నోయిడాలో ' సూపర్ నోవా ' అనే డిజైనర్ గృహాలను ప్రముఖ ప్రఖ్యాత డిజైనర్ అర్మానీ/కాసా తో ఒప్పందం చేసుకొని వీటిని నిర్మిస్తుంది.

అయినప్పటికీ ఈ సంస్థ కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఈ మధ్యనే సర్వోన్నత న్యాయస్థానం, సూపర్ టెక్ సంస్థ నోయిడా లో నిర్మించిన ' ఎమెరాల్డ్ టవర్స్ ' ని నిబంధనలను ఉల్లంఘంచి నిర్మించిందని, గ్రీన్ ఏరియా నిబంధనలను ఉల్లంఘించి ప్లాన్ కు అనుగుణంగా కట్టలేదని, ఈ ప్రాంతాన్ని తనిఖీ చేయవలసిందిగా నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ని న్యాయస్థానం ఆదేశించింది.

4. ఒమేక్సీ :

4. ఒమేక్సీ :

చాలా కొద్ది సమయంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా అవతరించింది ఒమేక్సీ. విభిన్నమైన ఆలోచనలతో ముందుకెళ్తూ చాలా కొద్దీ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 30 నగరాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఎంతో మంది అభినందించదగ్గ ప్రాజెక్ట్ లను ఈ సంస్థ నిర్మించడం జరిగింది.

తన ఎదుగుదల మరింత ఎత్తుకు చేరేలా ఈ సంస్థ ప్రణాళికలను రచిస్తోంది. అందులో భాగంగానే ఉత్తర భారతదేశంలో అత్యంత నాణ్యతతో కూడిన గృహాలను సరసమైన ధరల్లో వినియోగదారులకు ఇవ్వాలని ఈ సంస్థ నిర్ణయించుకుంది.

5. ఒబెరాయ్ రియాలిటీ :

5. ఒబెరాయ్ రియాలిటీ :

మహారాష్ట్ర రాష్ట్రంలోనే అత్యత ధనవంతుల్లో ఒకరైన వికాస్ ఒబెరాయ్ ఈ సంస్థకు అధిపతి. ఇతను ఒక పెద్ద కోటీశ్వరుడు.

మిగతా రియల్ స్టేట్ సంస్థలాగానే ఈ సంస్థ కూడా వాణిజ్య సముదాయాలు మరియు మాల్స్ ని నిర్మించడం పైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తోంది.

2015 ఆర్ధిక సంవత్సరంలో 940.15 కోట్ల ఆదాయాన్ని ఈ సంస్థ ఆర్జించింది. ఇదే సంస్థ 2016 లో 1444.30 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

6. అన్సాల్ ఏ.పి.ఐ :

6. అన్సాల్ ఏ.పి.ఐ :

1967 వ సంవత్సరం నుండి ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మొదలు రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో ఎన్నో గృహ సముదాయాలను, వాణిజ్య నిర్మాణాలను ఈ సంస్థ నిర్మించడం జరిగింది.

పోయిన సంవత్సరం స్మార్ట్ సిటీ లను అభివృద్ధి చేయడంలో భాగంగా, సాంకేతిక రంగ దిగ్గజాలైన ఐ.బి.ఎం మరియు సిస్కో వంటి దిగ్గజ కంపెనీ లతో ఒప్పందాలను కుదుర్చుకొంది.

7. జెపీ ఇంఫ్రా టెక్ :

7. జెపీ ఇంఫ్రా టెక్ :

జెపి గ్రూప్ కి సంబంధించిన అనేక సంస్థల్లో జెపీ ఇంఫ్రా టెక్ కూడా ఒకటి. ఇది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ. నోయిడా మరియు గ్రేటర్ నోయిడా లలో అతి పెద్ద టౌన్ షిప్ లను నిర్మించడం జరిగింది.

ప్రాజెక్ట్ లను వినియోగదారులకు సరైన సమయంలో అందించకపోవడం వల్ల భారీ నష్టాలను ఈ సంస్థ చవి చూడాల్సి వచ్చింది. ఆ సందర్భంలో తీవ్రమైన ఒత్తిళ్లను కూడా ఎదుర్కొంది.

2015 సంవత్సరంలో 350.44 కోట్ల నష్టాలను మూటగట్టుకున్న ఈ సంస్థ, 2016 ఆర్ధిక సంవత్సరంలో 298.41 కోట్ల నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

8. గోద్రెజ్ ప్రాపర్టీస్ :

8. గోద్రెజ్ ప్రాపర్టీస్ :

ఎన్నో సంవత్సరాలుగా 12 నగరాల్లో ఈ సంస్థ ఎన్నో నివాస, వాణిజ్య సముదాయాలతో పాటు టౌన్ షిప్ ప్రాజెక్ట్ లను నిర్మించడం జరిగింది.

2016 ఆర్ధిక సంవత్సరంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ నోయిడా మార్కెట్ లోకి ప్రవేశించడం జరిగింది.

2015 సంవత్సరంలో 2681 కోట్ల బుకింగ్ విలువని సొంతం చేసుకున్న ఈ సంస్థ, 2016 సంవత్సరంలో 5038 కోట్ల బుకింగ్ విలువని సాధించింది.

English summary

రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ఉన్నత స్థితిలో ఉన్న సంస్థల గురించి మీకు తెలుసా | Top 10 real estate companies in India

The Indian real estate market has seen a huge boom in the past decade thanks to a growing urban middle class population.Major real estate companies are targetting developable areas and turning them into construction marvels. Here is the list of Top real estate companies in India
Story first published: Thursday, January 4, 2018, 12:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X