For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.2000 లోపు కార్డు చెల్లింపులు, భీమ్ యాప్ చెల్లింపుల‌పై రుసుముల్లేవ్

బ్యాంకు ఖాతాదారులు, అదే విధంగా వ్యాపార వ‌ర్గాలు ఇరువురికి డిజిట‌ల్ లావాదేవీల‌ను రెండేళ్ల పాటు ఉచితం చేసింది. డెబిట్ కార్డులు, భీమ్, యూపీఐ, ఆధార్ ఆధారిత చెల్లింపుల‌ను జ‌న‌వ‌రి 1 నుంచి రెండేళ్ల పాటు ఉచి

|

డిజిట‌ల్ లావాదేవీల పెంపు కోసం కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కొత్త ప్ర‌య‌త్నం చేస్తోంది. సాధార‌ణ బ్యాంకు ఖాతాదారులు, అదే విధంగా వ్యాపార వ‌ర్గాలు ఇరువురికి డిజిట‌ల్ లావాదేవీల‌ను రెండేళ్ల పాటు ఉచితం చేసింది. డెబిట్ కార్డులు, భీమ్, యూపీఐ, ఆధార్ ఆధారిత చెల్లింపుల‌ను జ‌న‌వ‌రి 1 నుంచి రెండేళ్ల పాటు ఉచితం చేసిన‌ట్లు పీటీఐ నివేదించింది.

 డిజిట‌ల్ లావాదేవీలు

ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి రాజీవ్ కుమార్ ట్వీట్ ప్ర‌కారం హ్యాపీ డిజిట‌ల్ 2018. డిసెంబ‌రు త్రైమాసికంలో భీమ్ యాప్ ఆధారంగా చెల్లింపులు 145.6 మిలియ‌న్ల నుంచి 86% పెరిగి గ‌ణ‌నీయ‌మైన వృద్దిని సాధించాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ భీమ్ ఆధారంగా జ‌రిగిన చెల్లింపుల విలువ 13174కోట్ల‌ను దాటేసింది. ఇప్పుడు ప్ర‌భుత్వం డెబిట్ కార్డులు, భీమ్ ఆధారంగా చేసే చెల్లింపుల‌కు సంబంధించి రూ.2000 లోపు జ‌రిగే చెల్లింపుల‌పై అయ్యే చార్జీల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కు ఇస్తుంది. దీనికి సంబంధించి వ్యాపారుల‌కు ఎటువంటి భారం ఉండ‌దు. డిజిట‌ల్ వైపు మ‌ళ్లండి. పార‌ద‌ర్శ‌క‌త‌ను పెంచండి.

గ‌తేడాది న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. దాని ప్ర‌కారం జ‌న‌వ‌రి 1 నుంచి మొద‌లుకొని రెండేళ్ల పాటు డిజిట‌ల్ లావాదేవీల‌కు సంబంధించి ఎటువంటి చార్జీలు ఉండ‌వు. దీంతో దుకాణాల వ‌ద్ద ఎంత విలువ‌కైనా కార్డుల‌తో చెల్లింపుల చేసేయ‌వ‌చ్చు.

Read more about: bank account digital online
English summary

రూ.2000 లోపు కార్డు చెల్లింపులు, భీమ్ యాప్ చెల్లింపుల‌పై రుసుముల్లేవ్ | No Charges On Digital Payments Up To Rs. 2000 For 2 Years

Customers as well as merchants will not have to pay any transactional charges on payments through debit card, BHIM, UPI or Aadhaar-enabled payment systems from 1st of January, 2018, reported PTI.
Story first published: Tuesday, January 2, 2018, 16:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X