For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు పాన్ కార్డులుంటే ఒకదాన్ని స్వాధీన‌ప‌ర‌చ‌డ‌మెలా?

పర్మినెంట్‌ ఎకౌంట్‌ నెంబర్‌గా అందరికీ సుపరిచతమైనది పాన్‌ కార్డ్‌. ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్‌తో లావా దేవీలు చేస్తున్న తరుణంలో పాన్ కార్డు తప్పనిసరి. పాన్ కార్డును బ్యాంక్ ఖాతా తెర‌వ‌డానికి, సెక్యూర

|

పర్మినెంట్‌ ఎకౌంట్‌ నెంబర్‌గా అందరికీ సుపరిచతమైనది పాన్‌ కార్డ్‌. ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్‌తో లావా దేవీలు చేస్తున్న తరుణంలో పాన్ కార్డు తప్పనిసరి. పాన్ కార్డును బ్యాంక్ ఖాతా తెర‌వ‌డానికి, సెక్యూరిటీలతో పాటు మొదలైన ఆర్దిక లావాదేవీల కోసం ఈ కార్డు ఉపయోగిస్తారు. అయితే ఇప్పడు పాన్‌ కార్డుని ఆధార్‌తో అనుసంధానం చేయమంటోంది ప్రభుత్వం. దీనికి గడువును మార్చి 31 వరకూ గ‌డువు ఇచ్చింది. ఇప్పటికే 11.44లక్షల ఫేక్ పాన్ కార్డులను డీ యాక్టివేట్ చేసింది ప్రభుత్వం. ఇంకా ఫేక్ పాన్ కార్డులున్నాయని గుర్తించింది. ఒక్కరే రెండు లేదా అంతకన్నా ఎక్కువ పాన్‌ కార్డులు కలిగి వుంటే ఆధార్ తో పాన్ లింక్ చేయడం ద్వారా ఈజీగా తెలసిపోతుంది. మీకు గనుక మీ చిరునామాతో రెండు పాన్ కార్డులను కలిగి ఉన్నట్లైతే... ప్రభుత్వం మీకు లీగల్ నోటీసుతో పాటు, ఆదాయ పన్ను చట్టం ప్రకారం సెక్షన్‌ 272 బి ప్రకారం రూ. 10,000 జరిమానా విధిస్తుంది.

 రెండు పాన్ కార్డులుంటే ఏం చేయాలి.

ఎలా స్వాధీన ప‌ర‌చాలి?
తెలిసి చేసినా..తెలియక చేసినా ఒకే వ్యక్తి కి రెండు పాన్‌ కార్డులు మాత్రం ఉండకూడదంటోంది ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌. ఇలా ఎవరైనా రెండు పాన్ కార్డులను కలిగి ఉన్నట్లైతే ఆన్ లైన్‌లో https://incometax.intelenetglobal.com/pan/newPAN.asp అనే వెబ్ సైట్‌కి లాగిన్ అయి తన వద్ద ఉన్న రెండవ పాన్ కార్డు సమాచారాన్ని ఇన్ కమ్ టాక్స్ వెబ్ సైట్‌లో జత చేయాలి. ఇక ఆఫ్ లైన్‌లో రెండవ పాన్ కార్డు సమాచారాన్ని అందజేయాలంటే లిఖిత పూర్వకంగా లెటర్ వ్రాసి NSDL TIN ఫెసిలిటేషన్ సెంటర్ లేదా UTI PAN సెంటర్‌‌లో ఉన్న అధికారులకు అందజేయాలి. అప్లికేషన్‌లో ఉన్న చివరి కాలమ్‌లో రెండవ పాన్ కార్డు సమాచారాన్ని క్లుప్తంగా వ్రాయాలి. ఎవరైతే వ్యక్తి రెండవ పాన్ కార్డుని కలిగి ఉంటారో అప్లికేషన్‌లో పూర్తి పేరు, పూర్తి చిరునామాతో పాటు పాన్ కార్డు వివ‌రాలు రాయాలి. ఆ తర్వాత సదరు అధికారి మీకు రెండవ పాన్ కార్డు‌ సమాచారాన్ని అందజేసినట్లు మీరు రసీదు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీ రెండో పాన్‌ కార్డును సరండర్‌ చేస్తే సరిపోతుంది.

Read more about: pan card financial transaction
English summary

రెండు పాన్ కార్డులుంటే ఒకదాన్ని స్వాధీన‌ప‌ర‌చ‌డ‌మెలా? | How to surrender additional pan card

If you have more than one PAN, whether acquired intentionally or inadvertently, you run the risk of being penalised. Following government's mandate to link PAN with Aadhaar, and Aadhaar with bank accounts, detecting multiple PANs could become easier for the Income Tax Department once the data is collated.
Story first published: Saturday, December 30, 2017, 15:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X