For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ లావాదేవీల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వ హెచ్చ‌రిక‌లు

ప‌దే ప‌దే బిట్‌కాయిన్ల గురించి మీడియాలో వార్త‌లు రావ‌డం, సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం రావ‌డంతో మ‌ధ్య త‌ర‌గ‌తి వారు సైతం అందులో పెట్టుబ‌డులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్ర‌మంలో కేంద్రం అప

|

ప‌దే ప‌దే బిట్‌కాయిన్ల గురించి మీడియాలో వార్త‌లు రావ‌డం, సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం రావ‌డంతో మ‌ధ్య త‌ర‌గ‌తి వారు సైతం అందులో పెట్టుబ‌డులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్ర‌మంలో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. దీని ద్వారా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్ర‌మాదం అని భావించిన త‌రుణంలో కేంద్రం ప్ర‌జ‌లంద‌రినీ బిట్ కాయిన్ల గురించి హెచ్చ‌రించింది. ఈ త‌ర‌హా వ‌ర్చువ‌ల్(డిజిట‌ల్) కరెన్సీలు కూడా పోంజీ స్కీమ్‌ల్లాంటివేన‌ని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ త‌ర‌హా లావాదేవీల‌కు ఎటువంటి చ‌ట్ట‌బ‌ద్ద‌త‌, ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని తాజాగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. వ‌ర్చువ‌ల్ క‌రెన్సీలు ఆన్‌లైన్‌లో డిజిట‌ల్ ఫార్మాట్‌లో నిక్షిప్తం చేస్తార‌ని అవి హ్యాకింగ్, మాల్వేర్ దాడుల‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. అంతే కాకుండా పాస్ వ‌ర్డ్ మ‌రిచిపోతే డ‌బ్బు పూర్తిగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆర్థిక శాఖ ప్ర‌జ‌ల‌కు సంకేతాలు పంపింది. బిట్ కాయిన్ల గురించి ఈ 10 ముఖ్య విష‌యాలు మీకు తెలుసా?

 బిట్ కాయిన్

బిట్ కాయిన్ల‌కు అంత‌ర్గ‌తంగా ఎటువంటి విలువ ఉండ‌దు. దీనికి హామీగా ఎలాంటి ఆస్తులు కూడా ఉండ‌వు. కేవ‌లం ఊహాజ‌నితంగా వీటిలో పెట్టుబ‌డి పెట్టి మునిగిపోకూడ‌ద‌ని కేంద్రం చెప్పింది. ప్ర‌ధానంగా బిట్‌కాయిన్‌కు వాస్త‌వ విలువ ఉండ‌దు. వీటిని ఆన్‌లైన్‌లో గుట్టుగా నిర్వ‌హిస్తుంటే వీటికి సంబంధించి చ‌ట్ట‌బ‌ద్ధ వ్య‌వ‌స్థ‌లు, అంత‌ర్జాతీయ నిబంధ‌న‌ల‌ను స‌మీక్షించి నియంత్రించే విధంగా ఒక స‌ర్వాంగీకార‌మైన వ్య‌వ‌స్థ ఇప్ప‌టిదాకా లేదు. అయితే అంత‌ర్జాతీయ నిబంధ‌న‌ల‌ను స‌మీక్షించ‌డానికి ఆర్థిక వ్య‌వ‌హారాల విభాగం ఒక క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖా స‌హాయ మంత్రి రాధాకృష్ణ‌న్ లోక్ స‌భ‌లో ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. బిట్ కాయిన్ నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌కు సంబంధించి క‌మిటీ ఇప్ప‌టికే కొన్ని సూచ‌న‌లు చేస్తూ నివేదిక స‌మ‌ర్పించింద‌ని, ప్ర‌భుత్వం వాటినన్నింటినీ ప‌రిశీలిస్తోంద‌ని వెల్ల‌డించారు. బిట్‌కాయిన్‌, ఇతర వర్చువల్‌ కరెన్సీల్లో లావాదేవీలకు సంబంధించి రిజ‌ర్వ్ బ్యాంక్ ఇప్పటికే 3 సార్లు హెచ్చరికలు జారీ చేసిందని తెలిపారు. ఈ కరెన్సీలకు తమ నుంచి ఎలాంటి ఆమోదం లేదని, వీటిలో ట్రేడింగ్‌కు ఎలాంటి లైసెన్సులు జారీ చేయలేదని ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు స్పష్టత ఇచ్చింద‌ని పేర్కొన్నారు. అంతేకాదు, వర్చువల్‌ కరెన్సీల ద్వారా ఆర్థిక లావాదేవీలకు కూడా ఆర్‌బిఐ, ప్రభుత్వ ఆమోదం లేదని మంత్రి స్పష్టం చేశారు.

English summary

బిట్ కాయిన్ లావాదేవీల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వ హెచ్చ‌రిక‌లు | Bitcoin prices speculative, not backed by assets, warns Centre

Noting that virtual currencies like Bitcoin have no “intrinsic value”, the Union government on Friday sounded the alarm on the phenomenon of cryptocurrencies, comparing them with the notorious Ponzi schemes floated to dupe gullible investors.A Finance Ministry statement said that as virtual currencies (VCs) were not backed by assets, their prices are entirely a “matter of mere speculation
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X