For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బీఐ నుంచి రూ.25 కోట్లు సేక‌రించిన లెండింగ్‌కార్ట్

దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.25 కోట్లు క్యాష్ క్రెడిట్ కింద తీసుకున్న‌ట్లు లెండింగ్ కార్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ తెలిపింది.

|

దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.25 కోట్లు క్యాష్ క్రెడిట్ కింద తీసుకున్న‌ట్లు లెండింగ్ కార్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ తెలిపింది. కంపెనీ లోన్ బుక్ పెంచుకునేందుకు ఈ సొమ్మును ఉప‌యోగించ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. కంపెనీ ప్ర‌స్తుతం 950 న‌గ‌రాల్లో విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న త‌రుణంలో ఈ ఫండింగ్ రావ‌డం శుభ‌సూచ‌కం. చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా సంస్థ‌ల‌కు మ‌రింత‌గా రుణాలిచ్చేందుకు కంపెనీ ఈ నిధుల‌ను ఉప‌యోగిస్తుంద‌ని ప్ర‌క‌టించింది.
"ఆర్థిక స్వావ‌లంబ‌న పెంచేందుకు, చిన్న‌,మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ను మ‌రింత‌గా వృద్ది చెందించ‌డం ఎంత ముఖ్య‌మో మేము గుర్తించాం" అని లెండింగ్ కార్ట్ టెక్నాల‌జీస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కులు హ‌ర్ష వ‌ర్థ‌న్ లునియా ఒక ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు.

 లెండింగ్ కార్ట్ నిధుల సేక‌ర‌ణ‌

వ్య‌వ‌స్థాప‌కుల‌కు మూల‌ధ‌నం స‌మ‌కూర్చుకోవ‌డంలో ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను తీర్చేందుకు లెండింగ్ కార్ట్‌ను స్థాపించారు. న‌గ‌దు ఇబ్బందుల కార‌ణంగా వ్యాపారంలో ఇబ్బందులు ప‌డే వ్య‌వ‌స్థాప‌కుల క‌ష్టాల‌ను తీరుస్తూ వారు వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించేందుకు లెండింగ్ కార్ట్ గ్రూప్ ముందుకు సాగుతోంది. డిపాజిటేత‌ర ఎన్‌బీఎఫ్‌సీగా కొన‌సాగుతూ ఎస్ఎంఈల‌కు రుణ అవ‌స‌రాల‌ను తీర్చే దారిలో ఈ సంస్థ ప‌య‌నిస్తోంది.

Read more about: lendingkart business loan
English summary

ఎస్బీఐ నుంచి రూ.25 కోట్లు సేక‌రించిన లెండింగ్‌కార్ట్ | lendingkart rises 25 crores from state bank of India

Lendingkart Finance Limited said it has raised ₹25 crore in cash credit facility from State Bank of India. It said the money would be used towards growing the loan book. As the company expands its reach to over 950 cities across the country, the firm also said the funds would come in handy to widen its offerings to small and medium enterprises country-wide. “We recognize the importance of promoting financial inclusivity among SMEs in our country,” said Harshvardhan Lunia, co-founder of Lendingkart Technologies, in a statement.
Story first published: Thursday, December 28, 2017, 10:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X