For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైతు రుణ మాఫీ స‌రైన నిర్ణ‌యం కాద‌న్న వైవీ రెడ్డి, ఆర్‌బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్

త‌ర‌చూ రుణం తీసుకుంటూ మ‌ళ్లీ క‌ట్టే సంస్కృతిని దెబ్బ‌తీస్తున్నందున వ్య‌వ‌సాయ రుణాల మాఫీ మంచిది కాద‌ని ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ వైవీ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. దేశ ఆర్థిక రంగానికి, ప‌ర‌ప‌తి సంస్కృతికి వ్య

|

త‌ర‌చూ రుణం తీసుకుంటూ మ‌ళ్లీ క‌ట్టే సంస్కృతిని దెబ్బ‌తీస్తున్నందున వ్య‌వ‌సాయ రుణాల మాఫీ మంచిది కాద‌ని ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ వైవీ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. దేశ ఆర్థిక రంగానికి, ప‌ర‌ప‌తి సంస్కృతికి వ్య‌వ‌సాయ రుణాల మాఫీ మంచిది కాదంటూ ఆయ‌న త‌న అభిప్రాయాన్ని వివ‌రించారు. స్వ‌ల్ప కాలానికి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పార్టీలు ముందుకు తీసుకొస్తాయ‌ని అయితే దీర్ఘ‌కాల దృష్టితో చూస్తే దీన్ని స‌మ‌ర్థించ‌లేమ‌న్నారు.

 రుణ మాఫీ మంచిది కాద‌న్న ఆర్‌బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్

మ‌రో ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ సి.రంగ‌రాజ‌న్ సైతం ఇదే త‌ర‌హా అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తూ, దీని క‌న్నా రైతుల‌కు రుణాలు చెల్లించేందుకు మ‌రింత గ‌డువు ఇవ్వ‌డం మంచిద‌ని సూచించారు. చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఈ త‌ర‌హా హామీల‌ను ఇస్తున్నాయ‌ని వై వీ రెడ్డి చెప్పారు. పంజాబ్, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, మహారాష్ట్ర ఇటీవ‌లే వ్య‌వ‌సాయ రుణ మాఫీల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.
అక్ష‌ర క్ర‌మంలో ముందున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒక విధంగా రుణ మాఫీకి బాట‌లు వేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగు దేశం ప్ర‌భుత్వం గ‌త ఎన్నిక‌ల్లో రైతు రుణ మాఫీ హామీ ఇచ్చింది. దాన్ని విడ‌త‌ల వారీగా అమలు చేస్తోంది. అయితే రైతు రుణ మాఫీ ప్ర‌క‌ట‌న కంటే కూడా అమ‌లు రాష్ట్ర ప్ర‌భుత్వానికి చాలా వ్య‌య‌భ‌రితంగా మారింది. ఇప్పుడు ఇచ్చిన హామీని వెన‌క్కు తీసుకోలేక, అటు హామీని స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌లేక రాష్ట్ర ప్ర‌భుత్వం స‌త‌మ‌త‌మవుతూ ఉంది.
రైతు రుణ మాఫీ చేయ‌డం కంటే, ఇంకాస్త ఎక్కువ స‌మ‌యం రుణం చెల్లించేందుకు గ‌డువు ఇవ్వ‌డం, వ్య‌వ‌సాయ సంక్షోభ స‌మ‌యంలో కేవ‌లం వ‌డ్డీని మాత్రం ప్ర‌భుత్వం చెల్లించ‌డం వంటి ప‌రిష్కారాల‌ను ఆర్థిక నిపుణులు, బ్యాంక‌ర్లు సూచిస్తున్నారు. ప‌లువురు ఆర్థిక వేత్త‌లు మొద‌టి నుంచి చెబుతున్న‌దేమిటంటే రైతుకు వ్య‌వ‌సాయం చేసేట‌ప్పుడు ఎదురయ్యే ఆటంకాల‌ను తొల‌గించ‌డంపై ప్ర‌భుత్వం దృష్టిపెట్టాల‌ని. అంతే కాకుండా రైతు పండించిన పంట‌కు స‌రైన గిట్టుబాటు ధ‌ర‌, మార్కెటింగ్ స‌దుపాయాలు క‌ల్పించి ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను తొల‌గించే విధంగా చూసి సకాలంలో రైతు పంట‌కు స‌ర‌స‌మైన మ‌ద్ద‌తు ధ‌ర దొరికేలా ప్ర‌భుత్వాల ప్ర‌య‌త్నాలు ఉండాల్సిందిగా తెలుగు గుడ్ రిటర్న్స్ సూచిస్తోంది.

Read more about: loan waiver farmers
English summary

రైతు రుణ మాఫీ స‌రైన నిర్ణ‌యం కాద‌న్న వైవీ రెడ్డి, ఆర్‌బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ | Ex-RBI chiefs oppose farm loan waiver

Former RBI Governor Y.V. Reddy said farm loan waiver was not good for “economic or credit culture” and insisted that ultimately it was a political decision and cannot be justified in the longer run.
Story first published: Tuesday, December 12, 2017, 15:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X