For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూట్యూబ్ సంస్థ‌లో కొత్త‌గా 10,000 ఉద్యోగాలు

వీడియో నిర్వ‌హ‌ణ సంస్థ యూట్యూబ్ కొత్తగా పది వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నది. వీళ్లు చేయాల్సిన పనేంటో తెలుసా? స‌మ‌స్యాత్మ‌క వీడియోల‌ను స‌మీక్షించ‌డం.

|

వీడియో నిర్వ‌హ‌ణ సంస్థ యూట్యూబ్ కొత్తగా పది వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నది. వీళ్లు చేయాల్సిన పనేంటో తెలుసా? స‌మ‌స్యాత్మ‌క వీడియోల‌ను స‌మీక్షించ‌డం. అందులో ఉన్న హింసాత్మక, రెచ్చగొట్టే, అభ్యంతకర వీడియోలను తొలగించడం, నియంత్రించడం. అంతేకాదు పిల్లలను చెడుదోవ పట్టించే వీడియోలపై కూడా ఓ కన్నేసి ఉంచడం. చాలా మంది యూట్యూబ్‌ను అడ్డంగా పెట్టుకొని నెటిజన్లను తప్పుదోవ పట్టించడం, హింసించడం చేస్తున్నారని ఆ సంస్థ సీఈవో సుసాన్ వోజికి అన్నారు. తమ విధానాలకు విరుద్ధంగా యూట్యూబ్‌లో లోడ్ అవుతున్న ఇలాంటి వీడియోల ఆట కట్టించడానికి వచ్చే ఏడాది పది వేలకు పైగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు సుసాన్ వెల్లడించారు. అయితే ప్ర‌స్తుతం ఈ ర‌క‌మైన వీడియో నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఎంత మంది ప‌నిచేస్తున్నారో ఆమె వెల్ల‌డించ‌డం లేదు.

 యూట్యూబ్‌లో 10వేల ఉద్యోగాలు

ఇక రెచ్చగొట్టే కామెంట్లపైనా దృష్టిసారించామని, అందుకే కొత్తగా కామెంట్ మోడరేషన్ టూల్స్‌ను లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే అసలు కామెంట్స్ సెక్షనే క్లోజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టంచేశారు. యూట్యూబ్ తన తాజా మార్గదర్శకాల ప్రకారం 50 చానెల్స్‌తోపాటు కొన్ని వేల వీడియోలను తొలగించింది. యూట్యూబ్‌లో వస్తున్న స‌మాచారాన్ని నియంత్రించడంలో విఫలమవుతున్నదంటూ కొంత కాలంగా అడ్వర్‌టైజర్లు, రెగ్యులేటర్స్ సంస్థను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఇథియాడ్ ఎయిర్‌వేస్, మారియ‌ట్‌, డెలివ‌రో వంటి సంస్థ‌లు త‌మ వీడియోల‌ను తొల‌గించాయి. ఎందుకంటే త‌మ వీడియోల ప‌క్క‌నే వాటిని విమ‌ర్శిస్తూ త‌యారుచేసిన వీడియోలు ప్ర‌త్య‌క్షం కావ‌డ‌మే ఇందుకు కార‌ణం. ప్ర‌క‌ట‌దారుల హ‌క్కుల‌ను కాపాడుతూ, వారు ప్ర‌శాంతంగా ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేలా చూడ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని సుసాన్ వెల్ల‌డించారు.

Read more about: youtube jobs
English summary

యూట్యూబ్ సంస్థ‌లో కొత్త‌గా 10,000 ఉద్యోగాలు | YouTube is about to go to hire 10,000 people to remove inappropriate videos and comments

YouTube says that it plans to have 10,000 human beings reviewing videos to screen for clips that violate its policies.
Story first published: Friday, December 8, 2017, 11:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X